కలా నిజమా


నిన్ను కలిసిన క్షణం నా ఊహలు మాయమయ్యాయి, ఎందుకంటే నువ్వు ఉన్నందుకు ఊహని నా లోకం చేసుకున్నాను, నువ్వు లేని నిజాన్ని ఊహల్లో దాచుకున్నాను...

All fantasies disappeared the moment I met you. Why? Because you exist in my fantasies, so I made them my reality, and where you are not present, I made reality my fantasy....

💙

పెదవుల ఘర్షణ



నీ పెదవుల ఘర్షణకు వచ్చే నవ్వుల మెరుపు కంటేనా ఆ మేఘాల మెరుపు, ఆ నవ్వుకు కట్టిన తోరణాలేగా ఆ పంటి ముత్యాల వరుసలు...

The shine of your smile is more charming than the lightning of those clouds, and the rows of your teeth are like the string of pearls that adorn the smile...

आपकी मुस्कान की चमक उन बादलों की बिजली से अधिक मोहक है, और आपके दांतों की पंक्तियाँ मोतियों की माला जैसी हैं जो मुस्कान को सजाती हैं...

💙


నీకంటూ ఓ ప్రపంచానికి పునాది వేస్తావు


పైకప్పు నీ ఆకాశమైనప్పుడు, నాలుగు గోడల మధ్య పువ్వు నువ్వు, చిరునవ్వు నీ భాష అయినప్పుడు, భూమిపై నడయాడే జాబిలి నువ్వు, ఎక్కడ ఉంటే అక్కడ నీకంటూ ఓ ప్రపంచానికి పునాది వేస్తావు...

When the roof is your sky, you bloom like a flower within the four walls, when smile is the language you have, then you are the walking moon on earth, wherever you are, you will create a world for yourself...

💙

నా మనసుపై రాశాను పదిలమైపోయింది


రాతి పలకలపై నీ పేరు రాస్తుంటే కరిగిపోతున్నాయి, పూల రేకులపై రాస్తుంటే వాడిపోతున్నాయి, నీటి అలలపై రాస్తుంటే నీరు ఆవిరైపోతోంది, నా మనసుపై రాశాను పదిలమైపోయింది, అక్కడ తప్ప నీ పేరు ఇంకెక్కడ ఉండనంది...

I wrote your name on stone slabs, they melted away.
Wrote it on flower petals, they withered.
Wrote it on the waves of the water, the water evaporated.
I wrote it on my heart, and it remained there forever.
There is no place where your name will be more cherished than here..

💙

సుగంధాల ఊబి


సుగంధాల ఊబిలో చిక్కుకుంటే ఉక్కిరిబిక్కిరి అవ్వాలో లేక ఆ సువాసనలను ఆస్వాదించలో తెలియదు, నీ చూపులో నా మనసు చిక్కుకుంది అలమటిస్తోంది కానీ చాలా బాగుంది....

I don't know whether to feel suffocated or enjoy those fragrances when I get caught in the morass of aromas. Similarly, my mind gets caught in your gaze, struggling but finding it so good....

💞

మార్చలేము ఆపలేము

పడే చినుకు రూపాన్ని మార్చలేము,
మొదలైన నీ ప్రేమ భావాన్ని ఆపలేము...


అందపు చక్క


నిన్ను చూస్తే గంధపు చక్క కోసం వెతకడం మానేసి నువ్వు వాడే అందపు చక్క కోసం వేతుకుతారేమో...

If people see you, they will stop searching for sandalwood and start finding the beautiful wood that you are using...

💞

ఓడిపోతోంది



తేలికపాటి దుమ్ము కణిక కూడా కింద వాలాల్సిందే, అయినప్పటికీ భూమి తనవైపు లాగలేని ఒకేఒక్కటి ఏంటో తెలుసా? నీ అందం, అంతులేని సౌందర్యంతో అంత బరువున్నా లాగలేకుంది ఓడిపోతోంది..
Even the lightest speck of dust has to fall, yet do you know what the Earth can't pull towards itself? Your beauty. Though it's endless and heavy, gravity fails to do so..

💞

చూడకలా


చూడకలా ఎన్ని చిక్కుకుంటాయో నీ కనుసన్నల్లో నీకు తెలియదుగా, మేఘం ఆగిపోతే పోనీ కానీ నీ కబురు అందదు నాకు అందుకే నింగివైపు చూడకు, రాతిరి ఆగిపోతే పోనీ కానీ నాకు నీ కలలు అందవు అందుకే చీకటివైపు చూడకు, గాలి ఆగిపోతే పోనీ కానీ నీ పరిమళాల నన్ను చేరవు అందుకే గాలివైపు చూడకు, నన్ను చూడు ఆగిపోతాను నీతో ఉండిపోతాను...

💞

బొమ్మ






కాగితం అడిగింది నీ స్పర్శ కోసం అందుకే ఈ చిన్ని ప్రయత్నం...

The paper called for your touch, so here's a little effort from me...

❤️

విశ్రాంతి లేని పని



విశ్రాంతి లేకుండా చేయగలిగే పని ఏదైనా ఉంది అంటే నిన్ను చూసే పని అని కనులు చెబుతున్నాయి.....

If there is any work that doesn't need rest, it's looking at you, my eyes said...

💞

కవితనారగించాను


మొదటసారి కవిత రాయడం మాని కవితనారగించాను నీ మాట వింటూ నిన్ను చూస్తూ నీ కలిమితో కవితనారగించాను...

For the first time, I stopped writing a poem and started feeling it. While looking at you, listening to you, and with your presence, I started feeling it....

💞

నా చేతి ఆకాశాన పండిన జాబిలి


నా చేతి ఆకాశాన పండిన జాబిలి నువ్వే కదా, నీడైనా నువ్వు నిజమే కదా, చీకటి కలతలకు చిక్కని నీ నవ్వు, నీడలోనూ ముద్దొచ్చే చందమామవు...

You are the moon in the sky of my hands; you are true even if you are a shadow. The sorrowful darkness cannot dim your smile, and even your shadow is so beautiful...

💞

పరిమళాల బొమ్మ


పూల పరిమళాలతో ఎవరైతే బొమ్మ గీయగలరో వారే నీ అందాన్ని తెలుసుకోగలరు...

Those who can draw with the fragrance of flowers, they can only understand the beauty of yours...

💞

కన్నీరు


కాటుక కనులు వదిలే ప్రతి కన్నీటి చుక్క నల్ల బారినట్టు, నిన్ను దాచుకున్న నా కనులలో ప్రతి ఎదురుచూపు నీతో నిండిపోతుంది...

Like every tear drop left by the eyes with eyeliner becomes black, every anticipation in my eyes that hides you is filled with you..

💞

ప్రేమాక్షరం


అక్షరం పైన అక్షరం వాలితే దాని రూపం మాసిపోతుంది, కానీ నా ప్రేమ ఆ అక్షరం కాదు, మరో ప్రేమ దానిపై వాలలేదు...

If a letter overlaps with another, its form disappears. But my love is not like that; no other love can overshadow it...

💞

సిగ్గు మొగ్గ


పూరేకులన్నీ ముడుచుకొని మొగ్గగా మారే తరుణమిది, నీ సొగసులన్నీ ముడుచుకొని సిగ్గుగా మారే సమయమిది...

It is the time when all the flower petals come closer to become a bud again; it is the time when all your beauty factors draw closer to feel shy again....

💞

బరువు మోయాలి


తలమీద బరువును కాళ్లు మోస్తాయి, మది మీద బరువును తానే మోయాలి, బరువు ఎక్కువ అయ్యే కొద్ది చేతులు దించేస్తాయి, కానీ మది బరువు ఎక్కువ్వయ్యేకొద్ది మరింత మోస్తూనే ఉండాలి...

The legs bear the weight of the body, the heart must bear its own weight. The hands can drop their load when it becomes too heavy, but the heart must carry more as the burden increases...

💔

చేపను ప్రేమించి

నీటిలో బ్రతకలేనని తెలిసి, చేపను ప్రేమించి, అర్థం లేని పోరాటం చేస్తున్నా, నాకు నేను దూరం అవుతున్నా.. 💔