కులం

నా తోలు రంగే నీకు సమస్య అయితే చీకటిలో నీ రంగేమిటో చూసుకో,
నా కులం నీకు సమస్య ఐతే ఆకలికి రగిలే నీ పొట్టని ఆపి చూసుకో,
బేధాలు అన్నవి విభేదించడానికి కాదు గౌరవించడానికి అర్థం చేసుకోవడానికి,
ఒకరికి దారి చూపలేని ఒకరికి సాయపడని కులం అగ్రకులం ఎలా అవుతుంది?
చూసుకో మరి నీది దారి తప్పిన కులమా లేక దారి చూపే కులమా....

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️