ఆత్మ విశ్వాసం










నీడ వంక చూసావా నీడలేకున్నది

తోడు వంక చూసావా తరలిపోతున్నది

నిప్పుకాలం రగిలే హృదయం

కన్నీటితోను ఆరనంది

చెలిమి కూడా తీర్చలేనిది లోన ఏదో ఉంది



ఐనా ఆగవే మది ఆగిపోకే అందమైన లోకమిది

చూడవే కనులతోటి మొత్తమంతా నీదౌతుంది

ఆశ చేర్చు ఊపిరి తిరిగొస్తుంది

దేనిని వదులుకోకు మళ్ళీ కోరుకున్నా రాదు మరి...

.



పేరేమిటి










లతవై పరిమళించి

సుధవై ఉదయించి

పరిమళాల కిరణాలు వెదజల్లుతూ

సుదూరాలు పయనిస్తూ

నా మనసు చేరి నీ పేరడిగితే

మైమరచి పోవటమే నా వంతు కాని

నీ పేరెక్కడ నే వెతికేది.....



గుడ్ ఫ్రైడే








సిలువ పొందిన ఏసువు కష్టాలు తీరుస్తాడు

కరుణామయుడి రూపము మన తోడే ఎల్లపుడు

మనసారా కొలిస్తే ఒక వెలుగై వస్తాడు

ప్రార్ధించి చూడు పాపాలను తొలగిస్తాడు

తానై కదలివస్తాడు వరములు అందిస్తాడు

ఏ బేధము లేని ఆత్మబంధువు .....



ఉండవే అక్కో నా పెండ్లి దాక


ఒకానొక అక్కకి ఇది అంకితం :D








ఉండవే అక్కో నా పెండ్లి దాక ...

ను ఉండవే అక్కో నా పెండ్లి దాక ....

సరి జోడిని వెతకాలే... తాంబూలమివ్వాలే ..

నా దాన్ని సూసి సూసి మురిసిపోవాలే...

ఉండవే అక్కో నా పెండ్లి దాక...

ను ఉండవే అక్కో నా పెండ్లి దాక....



అక్కో అక్కో అక్కో పెళ్లాయే వేళాయే ...

పెండ్లాము దెగ్గరాయే...

నువ్వు తాళి అందివ్వాలే...

తయ్య తక్క లాడాలే ..

చపట్లు కొట్టలే పాటలు పాడాలె ...

ఉండవే అక్కో నా పెండ్లి దాక ...

నువ్ ఉండవే అక్కో నా పెండ్లి దాక...



ఆపైన నా కొడకు నీ చేత పెరగాలే ...

వాడి పెండ్లి కూడా నువ్వే జెరిపించాలే ...

ఉండవే అక్కో నా పెండ్లి దాక...

ఉండుండవే అక్కో వాడి పెండ్లి దాక ...



కరువు

నేలకి కరువు కానీ నింగికి కాదు, మనిషికి కరువు కానీ అందని తలపులకు కొదవ లేదు... The earth may face drought, but the sky does not. Man may face ...