నివాసిని


మల్లె మొగ్గ విరసి 
రోజా అయ్యింది, 
రోజా పెరుగుతూ 
ముద్ద బంతి అయ్యింది,
నవ్వితే మొగలి, 
అల్లరి చేస్తుంటే సూర్యకాంతి, 
అడుగులేస్తే చేమంతి, 
అలిగితే సంపంగి, 
నిదరోతే కలువ, 
వేకువన తామర, 
ఇన్ని పూల చందాలు,
 నీ ఒక్క దానిలో ఒదిగాయి,
మా మమతల మట్టిలో,
ఒక తోటగా వెలిశాయి..

💞

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️