కోమలం


గాలిలో ముద్దు కూడా నిన్ను గాయపరిచేంత కోమలంగా ఉన్నావు, అందం అన్న పదం నీ తరువాత జన్మించిందేమో...

You are so delicate that even a kiss could hurt you; perhaps the word "beauty" was born only after you..

आप इतनी कोमल हैं कि एक चुंबन भी आपको चोट पहुँचा सकता है; शायद "सुंदरता" शब्द आपके बाद ही जन्मा होगा।

💞

నివాసిని


మల్లె మొగ్గ విరసి 
రోజా అయ్యింది, 
రోజా పెరుగుతూ 
ముద్ద బంతి అయ్యింది,
నవ్వితే మొగలి, 
అల్లరి చేస్తుంటే సూర్యకాంతి, 
అడుగులేస్తే చేమంతి, 
అలిగితే సంపంగి, 
నిదరోతే కలువ, 
వేకువన తామర, 
ఇన్ని పూల చందాలు,
 నీ ఒక్క దానిలో ఒదిగాయి,
మా మమతల మట్టిలో,
ఒక తోటగా వెలిశాయి..

💞

వాడినా సరే విడిపోయి నిన్ను వెతుకుతున్నాయి


పూలపై నీ బొమ్మ గీస్తుంటే, కొమ్మనుంచి రాలిపోతున్నాయి, వాటికంటే కొమలత్వమా అని ఆశ్చర్యపోయి, వాడిపోయినా సరే కొమ్మను విడిపోయి నిన్ను వెతుకుతున్నాయి....

When your image is sketched on flowers, they, in surprise, detach from the stem, realizing a tenderness beyond themselves. Even as they dry, they seek you, drifting away from the stem....

जब तुम्हारी छवि फूलों पर उकेरी जाती है, तो वे, आश्चर्य में, डंठल से अलग हो जाती हैं, अपने से परे कोमलता का एहसास कराती हैं। सूख जाने पर भी, वे आपकी ओर खींची चली जाती हैं, डंठल से दूर खींची चली जाती हैं।

💞

నీడనే ముద్దు కోరితే


నీ నీడనే నీకు ముద్దు పెట్టేంతగా ముద్దొస్తున్నావు, చెలి నీ అందాన్ని నేను ఏమని వర్ణించను...

आप इतनी प्यारी हैं कि आपकी परछाई भी आपको चूमना चाहती है, मेरी जान, आपके खूबसूरती का वर्णन मैं कैसे करूं...

You are so cute that your own shadow wants to kiss you, my dear how can I describe your beauty...

💞

ప్రేమ కాటు


తేనెటీగ కాటుకి సిద్ధంగా లేకుంటే తేనెపట్టును ముట్టుకోకు..

यदि आप मधुमक्खी के डंक के लिए तैयार नहीं हैं, तो छत्ते को न छुएं...

If you are not prepared for a bee sting, do not touch the hive...

💞

నిశబ్దం


నిశబ్దం

Silence

मौन

నీ ప్రేమ వేగం


కొన్నేళ్ల పాటు ప్రయాణించిన కాంతి కంటే నీ ప్రేమ వేగం ఎక్కువ, నక్షత్రాల కూటమి కంటే నీ ప్రేమ బరువు ఎక్కువ, ఈ చీకటి రాత్రి అంత హృదయం ఉంటే తప్ప నీ ప్రేమను నిలుపుకోవడం సాధ్యం కాదుగా...

Your love is faster than the light that has traveled for years, your love is heavier than the constellation of stars, it's not possible to hold your love unless one has the heart the size of this dark night....

आपके प्यार की रफ्तार, बरसों का सफर तय कर चुकी रोशनी से भी तेज है। आपका प्यार, तारों के समूह से भी ज्यादा भारी है। इस घने अंधेरे रात जितना विशाल दिल ना हो, तो आपके प्यार को समेट पाना नामुमकिन है।...

💞

వెలుగు కిరణాన్ని నిలువరించగల చూపు నీది


వెలుగు కిరణాన్ని నిలువరించగల చూపు నీది, నా మనో భావాన్ని వశం చేస్కోవడం నీకెంత పని...

You are capable of stopping the light ray with a simple gaze, so isn't it easy for you to conquer my feelings...

आप एक नज़र से प्रकाश की किरण को रोक सकते हैं, तो क्या मेरी भावनाओं को जीत लेना आपके लिए आसान नहीं है...

💞

గాలిని అడుగు


గాలిని అడుగు నీ అందం గురించి ఎంత మంది గుసగుసలాడుతున్నారో చెబుతుంది..

Ask the wind; it will show you the countless whisperers talking about your beauty.

हवा से पूछो; यह आपको आपकी सुंदरता के बारे में बात करने वाले अनगिनत कानाफूसियों को दिखाएगा।

💞

ఆల్చిప్ప


ముత్యం బయటకు వచ్చిన తర్వాత ఆల్చిప్ప గురించి ఎవరు మాట్లాడతారు? అది ఒక అవశేషంగా మిగిపోతుంది..

मोती निकल जाने के बाद सीप के बारे में कौन बात करेगा? ये सिर्फ एक अवशेष रह जाएगा..

Who will talk about oyster's shell after the pearl is out? It will remain as a remnant.. 

 💔

ఆఖరి పుస్తకం


ఒక పాఠకుడు అనేక పుస్తకాలను ఎంచుకోవచ్చు, కానీ ఒక పుస్తకం దాని పాఠకుడిని ఎంచుకుంటే, అది అతని చివరి పుస్తకం అవుతుంది...

A reader can choose many books, but if a book chooses its own reader, it will be the reader's last book...

एक पाठक कई किताबें चुन सकता है, लेकिन अगर कोई किताब अपना पाठक चुनती है, तो वह पाठक की आखिरी किताब होगी...

💞


కాల్చేస్తా ఆ రహస్యాన్ని


ఉన్న అందాన్నంతా మేళవించి నిన్ను చేసిన రహస్యం నాకు తెలిస్తే, ఆ రహస్యం ఎవరికీ దొరక్కుండా కాల్చేస్తాను, నువ్వు తప్ప ఇంకెవరికీ అంత అందం రాకుండా చూసుకుంటాను...

I wonder what secret is used to glue together all the finest beauty in this creation to look like you? But if I knew it, I would burn that secret for you to remain such a one and only beauty....

अगर मैं उस रहस्य को जान लूं जिसने सारी सुंदरता को मिलाकर तुम्हें बनाया है, तो मैं उस रहस्य को जला दूंगा ताकि कोई उसे ढूंढ न सके, मैं यह सुनिश्चित कर दूंगा कि तुम्हारे अलावा कोई और इतना सुंदर नहीं हो सकता...

💞

రాయి ఉలి ప్రేమ


రాయి సరైన ఉలిని ఎంచుకోలేకపోయినా, తప్పుడు ఉలితో విరుగుతుంది. అలాగే, హృదయానికి నిజమైన ప్రేమను ఎంచుకునే అవకాశం లేకపోవచ్చు, కానీ భూటకపు ప్రేమతో విరుగుతుంది....

Just as stone cannot choose the right chisel but breaks with the wrong one, similarly, heart may not have the choice to select the right love, but it breaks with the fake one...

जिस तरह पत्थर सही हथौड़ी नहीं चुन सकता, लेकिन गलत से टूट जाता है, उसी तरह दिल को भी शायद सच्चा प्यार पाने का हक न हो, लेकिन नकली से टूट जाता है...

💞

నీ మనసు నీడ


నువ్వు తాకిన రాళ్లను చాదితే పరిమళాలు వెదజల్లుతాయి, మరి నీ మనసు నీడలో ఉంటే నాలో ప్రేమ కలగదా..

When the stones you've touched are ground, the fine fragrance fills the air, won't my heart simply fall in love in your presence?

आपके छुए हुए पत्थरों को पीसने पर, हवा में चन्दन की खुशबू भर जाती है, क्या आपकी मौजूदगी में मेरा दिल यूँ ही आसानी से आपसे प्यार नहीं कर लेगा?

💞

నీ పాదాలు తాడుస్తాయా అని సందేహం


నీ అందం చూస్తుంటే నాకో సందేహం కలుగుతోంది, వర్షంలో నీ పాదాలు ఎప్పుడైనా తడిసాయా అని?

Looking at your beauty I wonder if your feet ever get wet in the rain?

💞

ప్రేమ x ఆవిరి


సముద్రపు ఆవిరిని పట్టుకొని మేఘాలను చేరాలని శ్రమించాను కానీ కుదరలేదు, చెలి ఆ ఆవిరి కంటే తేలికైన నీ ప్రేమతో నన్ను ఎలా మోయగలిగావు, నేను అంతగా బరువు తగ్గానా? లేక నీ ప్రేమకు బలం ఎక్కువా?

I tried to hold the vapors of the sea to reach the clouds, but I couldn't. Yet, you were able to hold me with your love, which is lighter than those vapors, without any effort. Dear, did I become lighter, or is your love so dense?

💞

సంద్రానికి ఆకు నీడ


ఆకును విసిరేసి సముద్రానికి నీడనివ్వచ్చు అనుకోవడం మూర్ఖత్వం, ఆ మేఘం కూడా నీడను ఇవ్వలేదు కేవలం ఆకు ఎలా ఇవ్వగలదు, సముద్రమంత విశాలమైన నీ మనసులో నా ప్రేమ ఒక ఆకంత, అయినా కూడా ఎన్నో మేఘాలు అందించే నీడ కంటే నా నీడనే ఎక్కువ ఆస్వాదిస్తున్నావు, నన్ను నీకు అర్పించుకోవడం తప్ప ఇంక నేనేమి చేయగలను....

I am foolish to think that just by throwing a leaf, shadow can be provided to the ocean; but even a cloud can't do, how a leaf can. My love is just a leaf in your oceanic heart. Yet, you enjoy its shadow more than the cloud's, so what else I can do except surrendering myself..

💞

ఎడారిలో ఈత


చెలి ఈ ఒంటరితనంలో ఈదడం కంటే ఎడారిలో ఈదడం సులువేమో, ఆ వేడి నన్ను దహించి వేస్తుంటే నీ ధ్యాస కలగదేమో...

My dear, it's easier to swim in the sandy desert than to swim in this loneliness. At least with the burns on my body, I may stop thinking about you amidst the pain; otherwise, I can't stop myself...

💞

సూర్యుడికే వేసవి కాదా



సూర్యుడికే వేసవి కాదా నీ చూపుల వాడి, మరి నా పరిస్దితి ఏమిటో ఆలోచించు చెలి...

Your fiery looks are like summer to the sun itself; imagine what would happen to me, dear...

आपके रूप की तपन सूरज की गर्मी को भी मात दे देगी। सोचिए, मुझ पर क्या असर होगा...

💞

చేపను ప్రేమించి

నీటిలో బ్రతకలేనని తెలిసి, చేపను ప్రేమించి, అర్థం లేని పోరాటం చేస్తున్నా, నాకు నేను దూరం అవుతున్నా.. 💔