అందమైన నువ్వు


ఉదయపు వెచ్చదనంతో, 
రాతిరి చల్లిన మత్తుతో, మంచంపై విరిసిన పువ్వు, 
నా కనులముందు అందమైన నువ్వు...

Made from the morning warmth, seasoned with the night's essence, a raising flower on the bed, a beautiful girl in my heart...

कोमल धूप से विकसित, रात के सार से सुगंधित, बिस्तर पर खिलता हुआ फूल, मेरे दिल में एक भूल... 

💞

గాజు ప్రేమ


గాజు పగిలేకొద్ధి పదునుగా మారుతుంది, అదే విధంగా నా మనసు విరిగేకొద్ది నీపై ప్రేమపై ధ్యాస మరింత పెరుగుతూ ఉంటుంది..
As the glass breaks it becomes sharper, just as my heart breaks, the obsession with love for you grows stronger..

💔

భూమిపై తిరగాడింది జాబిలి


జాబిలి భూమిపై తిరగాడిందని తన జాడలు నీలో చూస్తుంటే తెలుస్తోంది...

I got to know that the moon once roamed on earth by looking at its traces in you...

तुममें बचे निशानों को देखकर मुझे पता चला कि चंद्रमा कभी धरती पर घूमता था...

💞

హృదయానికే హృదయం


నా హృదయానికే హృదయముందని, నిన్ను చూసినప్పుడే నన్ను వదిలిపోయిందని, నీ మాటలో ప్రేమ పొంగినపుడు, నీ కళ్ళలో చూపు మెరిసినపుడు తెలిసింది...

When I felt the love in your words, when your gaze sparkled, I realized that my heart had a heart, and it left me when it saw you..

जब मुझे आपके वचन में प्यार महसूस हुआ, जब आपकी निगाहें चमक उठीं, तो मुझे एहसास हुआ कि मेरे दिल में एक दिल था, और जब उसने आपको देखा तो उसने मुझे छोड़ दिया।

💞

ఎక్కడికి పోగలను


విశాలమైన సంద్రంలో బయటకి దూకిన చేప తిరిగి అందులోకే వెళ్ళాలి, ప్రేమ నన్ను చుట్టు ముడితే మరెక్కడికి నేను పోగలను అందులోకే వెళ్ళడం తప్ప....

एक मछली जो विशाल सागर से बाहर निकलती है, उसे वापस उसी में जाना पड़ता है, अगर प्यार मुझे घेर लेता है, तो मैं उसके अलावा और कहां जा सकता हूं...

In the vast ocean of love, a fish leaping out must return, for when love surrounds me everywhere, where else can I possibly turn?

💞

నిఘంటువు కూడా వివరించలేదు



ప్రతి నిఘంటువులో నీ పేరుకి అర్థం ఉంది కానీ నీ అర్థాన్ని వివరించలేదు, నీ సొంతం అయిన వాడికే ఆ అర్థం తెలుస్తుంది కాబట్టే నాకు తెలిసింది...

Every dictionary has a meaning of your name but it doesn't explain your meaning, only one who owns you knows that meaning so I know...

💞

నా మాట లో నీ అందం


హాయిగొలిపే ఎండుటాకుల అలజడిలా, నా అందం నా మాటలలో కనిపిస్తుంది, మెత్తని లేత పూరేకులా, నీ అందం నీ కోమలత్వంలో దాగుంది, నా మాటకు నాపై ప్రేమ కలుగుతుంది నీ అందంతో నీపై ప్రేమ కలుగుతుంది, మన ఇద్దరం ఒకటైతే ఆ తోటను ప్రతి ఒక్కరూ ప్రేమించరా...

My beauty lies in the sound of my words, akin to the rustle of dry leaves flowing in the wind. Your beauty lies in the tenderness you possess, resembling the soft petals of a flower. I am loved for my voice, and you are loved for your beauty. Together, we dwell in a garden cherished by all...

💞

ఒకప్పుడు నేను నీడను ఇచ్చే మేఘం


ఒకప్పుడు నేను నీడను ఇచ్చే మేఘం మట్టుకే, నీ చూపు ఎప్పుడైతే తగిలిందో వర్షాన్ని కురిపించసాగాను, నువ్వు సముద్రానివా? అయ్యిండవు! ఎందుకంటే సముద్రానికి రూపముండదు,అది నవ్వలేదు, మరి నువ్వు ఎవరివి? నేను ఎదురు చూసే ఆ ప్రేమ మాంత్రికురాలివి నువ్వేనేమో..

Earlier I was a cloud, useful only for providing shade. But when your gaze fell on me, I started raining. Are you the sea? I don't think so, because the sea cannot smile and has no shape. Then what are you? Maybe you are the love witch I was looking for...

पहले मैं बादल था, सिर्फ छाया देने के लिए उपयोगी था। लेकिन जब आपकी निगाह मुझ पर पड़ी, तो मैं बारिश करने लगा। क्या तुम समुद्र हो? मुझे नहीं लगता, क्योंकि समुद्र मुस्कुरा नहीं सकता और उसका कोई आकार नहीं होता। फिर तुम क्या हो? शायद तुम वो जादूगर हो, जिसकी मुझे तलाश थी।

💞


సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...