గుమ్మడికాయ మనోభావం

గుమ్మడి కాయ తీగను పైకి అల్లాలి అనుకోవడం మూర్ఖత్వం ఎందుకంటే తీగ దాని బరువును మోయలేదు, విరిగిపోగలదు. అదే విధంగా మనోభావాల బరువు ఎక్కువైనప్పుడు అణకువతో భావాలను పదిలం చేసుకోవాలి అప్పుడే మన అడుగు ముందుకు సాగుతుంది లేకుంటే విరుగుతుంది...

If you expect the ash gourd vine to crawl up the pole, then it's foolishness as the vine can't hold it's weight and it may break. Just like that, when you can't lift the weight of your emotions, try to stay low so that emotions cherish, and you grow...

💞

పువ్వు నీడ


పువ్వు నీడ ఎవరికి సరిపోతుంది కానీ దాని పరిమళం జీవితాంతం గుర్తుండిపోతుంది, ఎక్కడో ఉండి వినిపించే నీ మాట నీడ నా మనసుకు సరిపోదు కానీ అందులోని ప్రేమ జీవితాంతం నాతోటే ఉండిపోతుంది...

The mere shadow of a flower may not suffice for someone, yet its fragrance lingers in their memory for a lifetime. Similarly, the distant echo of your words falls short for my emotions, but the enduring love within them remains eternally with me...

💞

ఎడారి ఓడ


ఎడారిలో ఓడను కట్టి దూరాలకు చేరుకోలేవు, పిచ్చి మనసా తనపై ప్రేమను చూపి ఏమీ సాధించలేవు...

You can't travel by building a ship in the desert; you can't achieve anything by merely expressing love to her...

💞

నీ దాగుడుమూతలు సాగుతూనే ఉంటాయి


ఓ నెలవంక నిన్ను పున్నమిలో చూశాను, అమావాస్యలో మాయం అవ్వడం చూశాను, ఇప్పుడు నువ్వు ఎంత కనిపిస్తున్నావు అన్నది ముఖ్యం కాదు, ఎందుకంటే నీ దాగుడుమూతలు సాగుతూనే ఉంటాయి...

Oh crescent moon, I've seen you full and watched you fade away. It doesn't matter how much you show now, your cycle just keeps going...

💞

సగం మట్టుకే తూగాయు


నీ ప్రేమ తాకిన తరువాత ఇదివరకు నేను ఏదీ పూర్తిగా ఆస్వాదించలేదు, సగం మట్టుకే తూగాయి నా అనుభవాలన్నీ అని అర్థమైంది...

When touched by the grace of your love, it felt as if everything I had enjoyed until now weighed only half as much, and it only feels complete with you.


💞

పిచ్చి ప్రేమ


మసి పూసి ఆకాశాన్ని నల్లగా చేశా,దానిపై పాల చుక్కలు చల్లి తారకలను రప్పించేసా, ఎంత త్వరగా చీకటి పడితే అంత త్వరగా వస్తావని! అయినా ఓ వెన్నెల నన్ను పిచ్చోడిని అనుకోకు, నీ ప్రేమలో పడ్డ నాకు ఏది పిచ్చిగా అనిపించట్లేదు...

I took some ash and blackened the sky, sprinkled drops of milk on it, and created the stars. The sooner it gets dark, I wished, the sooner you will come. But don't think I'm mad, oh moon; being crazy is normal after falling in love with you...

💞

ఆలోచనల నుంచి ఉబికే జలపాతమే నీ కురులు


ఆలోచనల నుంచి ఉబికే జలపాతమే నీ కురులు, వాటివలే అందంగా ఉన్నాయి, ఇది చాలదా చెప్పడానికి భావములోను బాహ్యములోనూ నీ అందం అనిర్వచనీయం..

Your hair, being the waterfall of your thoughts, is inherently beautiful, reflecting your inner and outer beauty.

💞

ముల్లును కాక పువ్వునై


నీ కాలికి ముల్ల తొడుగునై నీతోనే ఉండి బాధ పెట్టడం కన్నా, దూరంగా ఉన్న ఒక పువ్వునై, ఎదురుచూస్తూ వాలిపోయి నీ తోటలో మరుజన్మకై తపిస్తుంటాను...

I would rather be a distant flower, hoping to flourish in your garden after falling, than be a thorned shoe and be with you always...

💞

నీడ చాలు


మేఘాలు తమ ఉనికిని పంచుకోవడానికి భూమిపై వర్షం కురిపించాల్సిన అవసరం లేదు. మేఘం ఎక్కడ ఉందో దాని నీడ ద్వారా భూమికి తెలుసు..

Clouds don't need to shed rain on Earth to share their presence. Earth knows where the cloud is by its shadow..

💞

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...