నీలా మరో బొమ్మను కోరాను


నీలా మరో బొమ్మను కోరాను, 
నీ చిత్రం గీసిన చేతులకు, 
నువ్వే ఆఖరి చిత్రమట, 
అన్ని రంగులు అన్ని హంగులు, 
పెట్టి నిన్ను గీసాయట, 
వేరే బొమ్మకు ఆస్కారం లేక, 
కుంచె వదిలి వెళ్లిపోయాయి, 
అందుకే నీతోటే ఉండిపోతాను, 
నీ నింగి నీడలో ఉన్న వాటితో,
నేను ఒక రేణువై సర్దుకుంటాను ఉండనిస్తావా ?

I asked for another picture like you,
From the hands that drew your portrait.
You are the final masterpiece,
All the colors and moods have been used to paint you,
Leaving no room for a new imagination.
They set aside the brush and departed,
That's why I want to remain with you,
Among all who dwell under your sky.
May I please stay as a miniature being,
Will you allow me to linger?

💜💜💜

చల్లని తాపం


దేవుడు ఈ భూమిని తీసి సూర్యుడికి దగ్గర పెడితే వెలుగు లేనిది అవుతుందేమో ప్రపంచం ఆ భానుడిని చల్లబరుస్తుంది నీ చల్లని తాపం...

If God were to take this Earth and place it near the Sun, this world would become dark as the Sun cools down due to your cool nature...

💜💜💜

పెదవిపై మరుజన్మ


పువ్వు నుంచి విడిపోయి, చచ్చిపోయి, నీ నవ్వే పెదవిపై మరుజన్మ తీయాలని తేనెటీగ నోటిలోని తేనె చుక్క కోరుకోదా?

Separated from the flower, being dead, won't the honey drop in the mouth of the bee, wishing to fall on your smiling lips and be reborn again?

💜💜💜

ముద్దుల గడ్డం

బుజ్జగింపుకు భోజనశాల,
నీ ప్రతి మాటకు కదిలే ఊయల,
విరుపుల పెదవిని మోసే ముద్దుల మూట,
మోము లో పూచిన బంతి పువ్వట,
నీ వెన్న ముద్దంత ఉన్న గడ్డమట...

A cove of solace and appeasement,
A swinging cradle for your every word,
A cute nuzzle, the lower lip it bears,
A marigold flower bloomed on the face,
And a lump of butter, your chin embraced...

💜💜💜

ఎంతటి బరువైనా నీటిలో పడితే నెమ్మదించాలి


ఎంతటి బరువైనా నీటిలో పడితే నెమ్మదించాలి, అందుకే నువ్వు వేసే విరహ బాణాల వేగాన్ని నా కన్నీటితో ఆపుతున్నాను..

No matter how heavy one falls into the water, it should be slowed down. The distance between us is falling heavy on me, so I am slowing it down with watery eyes..

💜💜💜

మల్లె సరాలు



వెండి వెలుగులు నీ వెన్ను మెరుపులు,
ఆ మల్లె సరాలు నక్షత్ర మండలాలు,
చీకటి ఆవల ఏముందో అనే ప్రశ్న కంటే,
ఆ చీకటి కురుల వెనక ఎవరా అన్న ఆరాటం ఎక్కువైందే.....

Your back is throwing the silver shine,
The string of jasmine flowers is like constellations,
Rather than finding what is behind the night sky,
The desire to know who is behind the dark hair is increasing...

💜💜💜

మంచు దుమ్ము


నీ ప్రేమ కూడా పైన పడిన దుమ్ము లాంటిదే కానీ మట్టి దుమ్ము కాదు మంచు దుమ్ము, ఎంత పడితే అంత హాయి...

Your love is also like dust, not the dust of the soil, but the dust of the snow. The more it falls, the better it feels...

💜💜💜

నడక నేర్చిన సంద్రం దిశను మార్చే నది


నువ్వు నడక నేర్చిన సంద్రానివి, నేను దిశను మార్చగల నదిని, ఏ నేల ఏంచుకుంటావో ఏ లోయ ఎంచుకుంటావో ఎంచుకో, నీ వెంటే ఉంటాను నిన్ను చేరాలనే తపిస్తుంటాను...

You are the ocean that has learned to walk; I am a river that can change my direction. Choose whichever soil you want, whichever valley you want to settle; I will follow you and keep longing to join you...

💜💜💜

రెప్పల ఊయల


రెప్పలకు ఊయల కట్టి ఊగే నా చూపులకు ఇంత ఆనందం ఎందుకొచ్చిందో కనిపించిన నిన్ను నువ్వే అడిగి చూడు..

Ask yourself why my eyes are so happy after seeing you that they were waiting for you, swaying with the lid..

💜💜💜

దేవ శిల్పి తప్పిదం


దేవ శిల్పి స్వర్గానికి చేర్చాల్సిన శిల్పాలలో ఒకటి భూమిపై పడిందేమో, ఇది అతని అజాగ్రత్తే అయినా నాకు అదృష్టంలా వరించింది...

One of the sculptures that the divine sculptor was supposed to take to heaven fell on earth, but it was due to his carelessness, and it turned out to be lucky for me...

💜💜💜

సుగంధంగా మార్చేసావు


తుమ్మినపుడల్లా నా చుట్టూ ఉన్నవారు ఏమైంది అనకుండా ఎవరది అని అడుగుతున్నారు, ఆలోచిస్తే తెలిసింది నా శ్వాసలో నువ్వు ఉన్నావని, ఆ గాలిని కూడా సుగంధంగా నువ్వు మార్చేసావని...

When I sneeze, people around me are asking, "Who is it?" instead of asking, "What happened?" When I think about it, I know that you are in my breath, and you have changed the air into fragrance...

💜💜💜

గత జన్మ పుణ్యం



నా గత జన్మలో పుణ్యం చేసుకున్నానో ఏమో ఈ జన్మలో నిన్ను ఆరాధిస్తూ పడుకుంటున్నాను, కానీ ఇప్పుడు అత్యాశ నన్ను వెంటాడుతోంది ఇంకాస్త పుణ్యం చేసుండాలేమో అని!

I earned merit in my previous life; that's why I am able to admire you while sleeping in this life. However, I am feeling greedy now, thinking that I could have earned more merit.

💜💜💜

తప్పుచేసాను





కాగితంపై అక్షరం పడితే నీ అందం యొక్క ఆధారం బయటపడుతుందని గాలిలో రాసుకున్నాను కానీ చదివే కనులనే కాక అందరినీ ఆ పరిమళం తాకింది తప్పుచేసాను నీ ఉనికిని అందరికీ చెప్పేశాను...

Every eye that can read will come to know about your existence if I put words on the paper. So, I wrote about you in the air, but the scent reached everyone, irrespective of those who can only read. I am sorry I revealed your presence to all...

💜💜💜

నిదురలోను తపస్సు




ఘడియకి ఒక రోజు గడిచిపోతుంటే నీ మాటలు విని కొన్ని యుగాలు అవుతోంది, నిదుర పోకుండా తపస్సు చేసిన మునుల ఎందరో కానీ నీదురలోను నీకై తపస్సు చేసే నా సంగతి ఒక విచిత్రమే..

Every minute is passing like a day, and it's been hundreds of years since I heard you. Many sages have done penance without sleeping, but I don't know what's happening with me. I am praying for you even in my sleep...

💜💜💜

నీ చెంత ఉంటే కలిగే తాపం



వేల రకాల పూలు తోటలో ఉంటే ఏ పువ్వు పరిమళాన్ని ఆస్వాదించాలో తెలియక సతమతమౌతూ మనసు పడే కష్టమే నీ చెంత ఉంటే కలిగే తాపం...

If there are thousands of varieties of flowers in the garden, it is difficult to know which flower to enjoy the fragrance of. The same struggle happens when I am with you...

💜💜💜

చీలిపో



నేల చీలితే చిగురు తొడుగుతుంది,
నా మనసు కూడా చీలిపోని,
ప్రేమ పెరుగుతుంది...

Shoots sprout only when the soil can crack,
Maybe my heart is breaking to strengthen the love...

💜💜💜

లెక్కలేవు తగ్గిపోవు




మన్ను తిన్న విత్తనాలు,
నా మనసు తిన్న నీ మాటలు,
లెక్కలేదులే లెక్కలేదులే..
తీపి చుట్టూ ఈగల ముసురు,
నీ మనసు చుట్టూ నా మాటల ముసురు,
తగ్గిపోవులే అవి తగ్గిపోవులే...

The seeds eaten by this earth,
Your words eaten by my heart,
Countless, they are, countless they are...
Like flies around sweet sugar syrup,
My words around your heart,
Never to depart, never to depart...

💜💜💜

నీటిలో మట్టి




ఎంత కలుపుకున్నా నీటిలో మట్టి అడుక్కు చేరాల్సిందే,
అలజడికి మళ్ళీ కలిసినా అడుక్కు చెరాల్సిందే,
చెలి నీలో నేనుండటమే చాలు నీ పెదవి చుట్టూ తిరిగే తూనీగలా కాకున్నా నీ పాదమడుగున దుమ్మలా అయినా సరే...

However much it mixes with water, mud has to settle at the bottom. Even if it jumps with joy at the slightest movement in the water, it still has to settle down eventually. Dear, it's enough for me as long as I am in you. It doesn't matter whether I am like a honey bee flying around your lips or like the dust under your feet.

💜💜💜

వెలుగు గోడ



ఇటుకతో గోడకట్టి ఆపితే సరే తిరిగి వెళ్ళిపోతాను,
కానీ వెలుగుతో అడ్డుగోడ వేసావు,
ప్రియతమా అది నన్ను ఆపడానికా లేక స్వాగతించడానికా...

If you stop me with a brick wall, I may go back.
But if you build the wall with light,
Dear, is it to stop me or to welcome me…

💜💜💜

మాటే అద్భుతం




కదిలిపోయే మేఘం ఆగి ఈ గడ్డిపోచను పలకరించడం అద్భుతం అనుకుంటే మరి ప్రేమ కురిపిస్తే ఏమనాలి?

It's a miracle that a running cloud stops and greets this grass leaf. What is it called if it showers love?

💜💜💜

తన గాలి లేని హృదయం




తన గాలి లేని హృదయాన్ని కుట్టి ఏమి చేసుకుంటావు,
తన జ్ఞాపకంగా ఉండిపోనివ్వు...

What will you achieve by stitching your heart, devoid of the air she once filled it with? Let it remain as a memory of her...

💔

దూరం సులువు



నన్ను దూరం పెట్టాలి అంటే చాలా సులువు,
నీలో ప్రేమను ఒప్పుకొని వెళ్ళిపో అను,
సూర్యుడు కళ్ళు తెరిచి చూసినా కనిపించనంత దూరం పోతాను,
అదే ప్రేమ దాచి వెళ్ళిపో అని అంటే,
చీమ కళ్ళ మధ్య ఎంత దూరం ఉంటుందో అంత దూరం కూడా కదలను...

It's so easy to keep me away:
Admit your love and ask me to stay away.
I will go so far away that not even the eyes of the sun can reach.
But if you ask me to stay away, hiding the love,
I won't even move as far as the distance between the eyes of an ant...

💜💜💜

కన్నీటి విధిలో భాగం

చినుకు తడపని నేల, 
ఆ నేల భువిలో ఉందా?, 
ఉండేది ఒకటే హృదయం, 
అది కూడా కన్నీటి విధిలో భాగం...

Is there a land in this world that is untouched by raindrops?
There used to be such a heart,
But it is also a part of the fate of tears...

💜💜💜


కన్నీరు ఉండచ్చు కానీ భయం కాదు

నా కన్నీటితో నిండిన సరస్సు పుట్టుకొని రావచ్చేమో కానీ భయంతో నిండినది కాదు, ఎందుకంటే నీ ప్రేమలో మనసు గాయపడచ్చు ఆ బాధ ఎలా ఉంటుందంటే, తోటను చేరకుండా ఆపే కంచె లాగా ఉంటుంది కానీ రాయి కింద పడి నలగినట్టు కాదు, కంచె వెనకాల ఏముందో కనిపించే దాకా విశ్రమించను దాటే ప్రయత్నం చేస్తూనే ఉంటాను, కానీ కనిపించకుండా మొత్తం మూసేస్తే దానిపై విశ్రమిస్తానే కానీ వదిలి పోను...

In the realm of my love for you, tears fill the lake, not fears. Though love can bring pain, it resembles a fence that prevents me from entering the garden, rather than someone crushing me under a stone. I'll persist in crossing the fence as long as it lets me catch glimpses beyond. If not, I'll rest upon it, refusing to depart..

💜💜💜

చేరువ కావడానికి మరొక్క అవకాశం



ఎంత పెద్దదో ఈ రాత్రి నువ్వు లేకుండా, ఓడిపోయేనా నా ఆశ విధి లేకుండా, అయినా ఇది ఓటమి కాదు, నీకు ఇంకా చేరువ కావడానికి మరొక్క అవకాశం...

How lengthy this night is without you! My hope is lost without any choice, but this is not failure; it is just a hurdle to cross to stay closer...

💜💜💜

ప్రేమలోని పంచభూతాలు



గాలి అదృశ్యమైన వాటిలో ఒకటి, అలాగే నీ ప్రేమ కూడా.
కానీ గాలిని అనుభవించినట్లుగానే నీ ప్రేమను అనుభవించగలము.
నీరు రుచిలేనిది, అలాగే నీ ప్రేమ కూడా.
కానీ నీళ్ల లాగ దాహం తీర్చగలిగేది నీ ప్రేమ ఒక్కటే.
వేడి ప్రమాదకరమైనది, అలాగే నీ ప్రేమ కూడా.
అయినప్పటికీ, వేడి వలే నీ ప్రేమ శక్తికి మూలం.
భూమి కఠినమైనది, అలాగే నీ ప్రేమ కూడా.
కానీ నీ ప్రేమలాగే బరువును భరించగలిగేది ఇది ఒక్కటే.
నీ ప్రేమలాగే ఆకాశం చేరుకోవడం కష్టం.
కానీ దానిని ఎలా చూడాలో తెలిస్తే, అది నీ ప్రేమలాగే అత్యంత మనోహరంగా కనిపిస్తుంది...

The air is one of the invisible things, and so is your love.
We can feel the air, just as we can feel your love.
Water is tasteless, and so is your love.
But water is the only thing that can quench thirst, just like your love.
Heat is dangerous, and so is your love.
Yet, heat is the source of energy, just as your love is.
Earth is one of the hardest substances, and so is your love.
It is the one thing that can bear weight, just like your love.
The sky is difficult to reach, just like your love.
But if you know how to see it, it becomes the most charming thing, just like your love...

💜💜💜

బ్రతిమాలుకుంటున్నాను



మాటలు రాని మేఘాన్నే ఎంతో అడుగుతా కురవమని, కానీ కురవదు, అయినా అడుగుతూనే ఉంటా, అలాంటిది ఊసులు పంచుకునే ఆకాశం నువ్వు, నిన్ను అడగడం కాదు నువ్వు నాతో ఉండాలని నేను నీ ప్రేమ నిండిన ఆకాశం కిందే ఉండాలని బ్రతిమాలుకుంటున్నాను..

I used to request the speechless cloud for rain, but it never showered when I asked. Yet, I still ask and keep asking. However, you are a speaking sky, endowed with a voice to express. I won't request from you anymore; instead, I humbly beg for your presence and wish to remain under your vast sky of love forever... 

💜💜💜

నీ అందం



మట్టి కూడా మొగ్గలా విరబూసే చోటు నీ పాదముంటే, మిణుగురులు చీకటనుకొని వెలుగుతూ మోసపోయే చోటు నీ కురులు అంటే,
మంచు ఆటవిడుపుకు వెళ్ళే చోటే నీ మేని అంటే,
తోటి మగువల అందాన్ని చిన్నబుచ్చే చూపులే నీ మొత్తం అందమంటే...

Your feet are the place where the soil blooms like a bud, and your black hair is the place where fireflies unknowingly turn on thinking it's night. Your body is the playground where snow goes for recreation. Your entire beauty is a gaze that diminishes the beauty of other women..

💜💜💜

నీ బుగ్గలు

బుగ్గల పండగకి దేవత నువ్వేగా ,
బూరెలు కూడా ఓడిపోయే బుగ్గలు నీవేగా ,
నూనెలో వేగకున్నా ఉబ్బిన పూరీలు ,
తాకితే చేతికి అందేటి పువ్వుల చెక్కిళ్ళు,
పడితే చినుకు కూడా ఎగురుతూ ఆడుకోదా,
నీ బుగ్గపై ముద్దులు అమ్మితే స్వర్గమే కొనవచ్చుగా,
పాలరాతి చిట్టి బొమ్మ ఎంత అందమైనా ఓడిపోదా,
ఎంగిలి ఎంత అదృష్టం చేసుకుందో దాని చుట్టే ఉంటుంది,
బుగ్గ దాటి ఏముందో నీ కళ్ళు కూడా చూడలేకుంది,
సాగే సంసారాన్ని మరవాలంటే నీ సాగే బుగ్గలు తాకితే చాలు,
నీ ముద్దు మురిపాలతో అన్ని మరచిపోవచ్చు .... 

నీ అందాల సరస్సులో నేను ఒక చేపనై ఈదాలి





రోజా రేకులతో నిన్ను అద్ది ఆ సారంతో పసుపుకు మెరుగులు దిద్దాలి, నీపై గాలిలో ముంచి మొగలి సువాసనలు పెంచాలి, నీ స్పర్శని చూపించి పత్తికి మెత్తదనపు పాఠాలు నేర్పాలి, నీ అందాల సరస్సులో నేను ఒక చేపనై ఈదాలి...
I shall smear you with rose petals and enhance the beauty of turmeric with that essence. I shall let the scent of screwpine waft through the air around you, intensifying its fragrance. I shall showcase your touch and impart gentle lessons to cotton. Oh, dear lady! I desire to swim in the lake of your beauty like a fish...

💜💜💜

రూపం

దేహం చేరిన ప్రాణంలా నా అక్షరం నిన్ను చేరింది తనకొక రూపం దొరికింది...

My words have reached you, just as life has reached the body and found its own form...

💜💜💜

నా ఇష్టం

నీ ప్రేమ దొరక్క విరిగిపోయిన హృదయంలా కాకుండా, నీకై వేచి వాడిపోయిన పువ్వులా మిగిలిపోవడం నాకు ఇష్టం...

I want to remain like a withered flower, waiting for you, not like a broken heart without your love...

💜💜💜

నా ఆరాధనకు ఆఖరి అంఖం



నిన్ను చూడాలి అనుకునప్పుడల్లా భయంతోటే చూస్తాను,
ఎక్కడ నీ అందం మరో అందాన్ని చూడనివ్వకుండా ఆపుతుందని,
అనుకున్నట్టే అయ్యింది నీ రూపం నా ఆరాధనకు ఆఖరి అంఖం అయ్యింది..

Whenever I yearn to glimpse your presence, fear embraces me.
Where your beauty eclipses all others,
It unfolded as foreseen—your form became the pinnacle of my devotion.

💜💜💜

అంత ఎక్కువ స్వేచ్ఛ కోల్పోతావు

ఊయలను నేలపై పెట్టేస్తే ఎటువంటి ఆధారం అవసరం లేదు కానీ అది ఏమాత్రం ఊగదు, ఎంత ఎక్కువ ఆధారపడితే అంత ఎక్కువ స్వేచ్ఛ కోల్పోతావు...

If the cradle is placed on the ground, it does not need support, but it does not swing at all. The more dependent you are, the more freedom you lose...

💜💜💜

తెలుపవా నువ్వెలా వచ్చావు ఈ భూమికి?

తెలుపవా నువ్వెలా వచ్చావు ఈ భూమికి? తాను అప్పు తీసుకున్న ఆవిరిని అంతా కురిపించలేదని, కొన్ని చినుకులు తక్కువ అయ్యాయని, నింగి ఒక తారను బదులుగా నేలకు ఇచ్చేసిందా? ఇది కాకుంటే మరో అద్భుతమా? ఇలా ఏ అద్భుతం జరగకనే నువ్వు ఈ భూమిపై ఉన్నావు అంటే నమ్మకం కుదరదే...

Do you know how you came to this land? Did the sky pour out a few drops less from the vapors it borrowed, and give a star to the earth instead to balance the debt? If not this, then some other miracle? I can't believe that you are on this earth without any miracle happening like this...

💜💜💜

అధరం




మధురామృతాలను పంచే కల్పవృక్షము నీ అధరము,
పంచభక్ష పరమాన్నాలు వడ్డించగల కంచమే నీ అధరము,
మనసు చేరడానికి అడ్డుగా వేసిన కంచనే నీ అధరము,
మాటలను చిలికి వెన్నను వడ్డించే ఆ కవ్వమే నీ అధరము,
వాటి అచ్చు తగిలితే చాలు విచ్చుకునే చూపులలోని ప్రాణమే నీ అధరము,
చలిని మరిపించి వెచ్చనీ తాపమిచ్చే ఆ కంబళి నీ అధరము..

Your lips are the kalpavruksha that can give the eternal nectar.
Your lips are the plate that can serve an infinite variety of dishes.
Your lips are the fence to reach your heart.
Your lips are the stick that can churn the butter.
Your lips are the life in the eyes that shines when touched.
Your lips are the warm blanket that can save from the winter waves..

💜💜💜

నోరు ఎండిన చేప

నోరు ఎండిందని చేప అంటే లోకం నవ్వదా..

The world laughs at a dry mouthed fish..

💜💜💜

నా స్నానపు గది తూము

నా స్నానపు గది తూముకు పట్టిన జుట్టు పరవళ్ళు తొక్కే గంగనైనా ఆపగలవు, భౌసా ప్రభుత్వం కట్టించే ఆనకట్టలు తెగకుండా ఉండాలంటే వాటి తలుపులకు బదులు జుట్టు అల్లిస్తే సరిపోతుందేమో...

తీగ తొడిమ

తీగ ఏదో తొడిమ ఏదో చెప్పడం సులువే...

It is easy to differentiate the vine from the stalk...

💜💜💜

చీమను పెట్టకుండా నన్ను పెట్టాడు

తీపిని పెట్టిన చోటల్లా చీమను పెట్టాడు, కానీ నీ తియ్యటి మనసు దగ్గర మట్టుకు చీమను పెట్టకుండా నన్ను పెట్టాడు...

He kept ants at all places where sweetness existed, but he kept me near your sweet heart instead of the ant...

💜💜💜

వెన్న పరుచుకున్న నేల

నిన్ను చూస్తుంటే మట్టి నేలపై పూచిన పువ్వులా తోచట్లేదు, వెన్న పరుచుకున్న నేలపై వెన్నల ధారకు వికసించిన మల్లె పువ్వులా ఉన్నావు..

Looking at you, you do not look like a flower that has flourished on sandy soil; you look like a jasmine flower that has flourished on butter-spread land, shimmering with the stream of moonlight...

💜💜💜

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...