ఏమి చేసి నిన్ను చేసాడో
తామరకు వరమిచ్చాడో,
కలువను చూపులో దాచాడో, సొగసును కొలత లేకుండా ధారపోసాడో,
ఏమి చేసాడో తెలియదు కాని నిన్ను అలా పుట్టించాడు....
అలా తోచింది
మళ్ళీ ఆ రోజులు తిరిగిరావ కానీ ఇలాంటి తీపి ఆవేదన నేనెప్పుడూ అనుభవించలేదు,
ప్రతి క్షణం పాత క్షణాలకు అంకితం కానీ సరికొత్త అనుభూతులకు ఎల్లప్పుడూ స్వాగతం...
దూరమా? చేరువ?
దూరమున్నంత సేపు మరింత దెగ్గరౌతుంటే,
పెదవి నవ్వుతోంది,
కన్ను తడుస్తోంది,
ఎందుకో తెలియని సంశయంతో మనసు కొట్టుకుంటోంది....
మానవత్వానికి చిరాయువు
కోటికేగినా కాటికి భయము లేదు,
కొంచమున్నా కాటికి జాలి లేదు,
మసి కానిది ఏమున్నది అంటే,
మనిషిలో మానవత్వానికి చిరాయువు...
నీ అందం
పడుతూనే ఉన్నా నేల తాకని జలపాతం,
వేస్తూనే ఉన్నా లెక్క తగ్గని బాణం,
వేసవి లోను కరగని మంచు శిల్పం..
నీ అదుపులో ఉన్నది ఏంటి?
నీ ప్రవర్తన ఇంకొకరిపైన ఆధారపడితే మరి నీ అదుపులో ఉన్నది ఏంటి?
నీ ప్రేమ ద్వేషం ఇంకొకరివల్ల కలిగేదైతే నువ్వు కలిగించగలిగేది ఏంటి?
కాపీ పేస్ట్
నిన్ను కాపీ చేస్తే క్లిప్ బోర్డుకే ప్రేమ పుట్టింది,
నిన్ను కట్ చేస్తే కీబోర్డులో కంట్రోల్ తప్పింది,
మిషిన్ కే మతిపోగొట్టే నీ అందం,
మనిషిని నాలో పుట్టదా ప్రేమ కొంచం,
హిడెన్ కీస్ తో కిస్ ఇవ్వనా,
షార్ట్ కట్టు లో లైన్ వేయనా,
స్విచ్ ఆఫ్ అయ్యే నా లైఫుని,
రీస్టార్ట్ చేసి ప్రాణం పోయవా...
నిదురలో పడ్డ శ్రమ
పని వేళల్లో పన్నీరు చల్లినట్టు చల్లగా నిదుర వస్తుంది ఎందుకో,
రాతిరి నిదురలో పడ్డ శ్రమంతా తీరడానికి ఏమో...
Subscribe to:
Posts (Atom)
వెన్నెల
చప్పుడే లేకుంది, అయినా తెలిసిపోతుంది, నీ నవ్వు, పున్నమి లాంటిది, నీవైపు చూడకున్నా, ఆ వెన్నల నన్ను తాకుతూ ఉంటుంది... Silent yet I know, your ...