ఈర్ష్య/Jealousy

చలి మంట కూడా చెలికై వెతికింది మన సావాసం చూసి...
చిరు గాలి నను తాకక పోయింది అసూయ పడి...
నీ జతలో ఉంటే ఈర్ష్యకు అర్థం ఏమిటో తెలుస్తోంది...
అందుకే చీకటి ముసుగేసింది ఎవ్వరి కనులు పడనీయక ఒక వెన్నెలతో మరో వెన్నలను దాచింది...
-------------------------------------
Even the campfire is in search of it's pair...
Even the breeze didn't touch me out of anger...
With your company I now understand what jealous means...
That's why the night hiding this moon with another moon...

వలలో పడిన చేప/Fish In the Net

వెల కట్టలేని వలలో పడిన చేపను నేను...
వలలా కట్టిపడేయకుండా ఒడిలా చూసుకుంటోంది...
-------------------------------------------
I am a fish trapped in a valuable net...it feels like in a lap but not like killer net..

వజ్రం/Diamond

వజ్రం ఆభరణమైతే ఎంత అందంగా ఉంటుందో ఆయుధమైతే అంతే భయం కలిగిస్తుంది...
---------------------------------------------------------
Diamond is so beautiful as an ornament and it is equally dangerous as a weapon...

వర్షంలో మంచు తునక/ice drop in the rain

కుండపోత వర్షంలో కూడా ఒక్క మంచు తునక పడితే ఆ ఆనందమే వేరు..
అలా కొందరి పలకరింపుకు ఉన్న ప్రత్యేకతే వేరు..
----------------------------------------
A touch of ice drop in the rain will give even more pleasent feeling..
Just like that the greeting from special ones..

కంటిలో నలుసును పడనివ్వకు/don't let the dust fall in your eyes

లాగుతా తెగిపోకు మనసా, ప్రేమను పట్టుకుంటే అలుసౌతావు, సులువుగా ముడి విప్పుకో, కంటిలో నలుసును పడనివ్వకు..
---------------------------------------------------
My dear heart I am going to pull you, please be careful, don't tie yourself to love, it won't care you, go easy dettach from it,   don't let the dust fall in your eyes....

పరితపించు నిదానిస్తూ/slow down and keep yearning

దూరాలను కలపడానికి మెరుపులా మారావు, క్షణమే ఆ వెలుగు మళ్ళీ మాయమౌతుంది, మెరుపుతో కలిసి చినుకుల వంతెన కట్టావు, కొంత సేపే ఆ ఆనందం, మేఘం వెళ్ళిపోతుంది, పోరాటం చెయ్యడానికి నీకు ఆరాటం తప్ప ఆయుధం లేదు, పరితపించు పరితపించు నిదానిస్తూ నిదానిస్తూ...
----------------------------------------------------------
You became the lightning to make us close, but the light will not stay long, you built the bridge with rain drops, that happiness is short, the clouds will move away, to do the war you know how to struggle but you don't have any weapon, slow down slow down and keep yearning keep yearning...

అందానికి ప్రతిరూపం/The Replica Of Beauty

చినుకును శిల్పంగా మలిచితే నీ అందానికి ప్రతిరూపం కనబడుతుంది...
అది ఎంతవరకు సాధ్యమో కానీ అదొక్కటే నీ అందానికి వివరణ ఇస్తుంది...
---------------------------------------
Your beauty can be replicated by sculpting the rain drop...
Not sure about the possibility but it can only define your beauty...

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...