మేఘాలలో జ్ఞాపకం

మేఘాలలో జ్ఞాపకం చినుకాయనే, 
చల్లగా తడిపేసి తడిమేసి నను వీడి వెళ్లిపోయేనే...

తిరిగొచ్చినా మేఘము వేడెక్కేనే, జ్ఞాపకం అల్లాడి తల్లాడి కన్నీరు వదిలిపోయేనే...

నా గుండె పంట పండగలేక,
నా కంటిపాప ఏడవలేక,
నాలుగు దిక్కులు చాలక పైకి,
ఎన్నెన్నో రంగులు నలుపాయే చూపుకి,
ఓడిపోయేనా గుండెచప్పుడు,
వేగమెందుకో లేదు ఇప్పుడు,
ప్రాణం అయ్యో పాపమన్నది,
ప్రాయం పాటకు ఆడకున్నది,
విధిలేక బ్రతుకు నిలవలేక సమయం, రెండు  సాగుతున్నది....

No comments:

మూర్ఖత్వం

అగ్నిపర్వతాన్ని ఆర్పాలని అనుకోవడం, నీపై నా ప్రేమను అడ్డుకోవడం, రెండూ మూర్ఖపు ఆలోచనలు... The idea of extinguishing a volcano and stopping my ...