నిన్ను నువ్వు మోసం చేసుకోకు .














అలలా నిన్ను తాకుతూ వెడలిపోతున్నా

కాని తీరంలా నన్నెపుడూ ఆదరిస్తావు

నీపై అడుగులు ఎన్ని పడుతున్నా

నాకోసమే నీవన్నటుగా నిలిచావు

ఎందరో వదిలిన చేదు గుర్తులను నేను చెరిపాననా

లేక అలల వలలతో నిన్ను బంధించాననా

ఇంత ప్రేమకు నీవు సాక్ష్యం కావచ్చేమో

కాని నేనెపుడు పొంగుతానో ఆగుతానో తెలియదు

నన్ను ప్రేమించకంటూ నీకు చెప్పలేను

రేయి మనసు తెలిసి దాగిపోయే వేకువలా వెడలిపో

నన్ను చేరకు నిన్ను నువ్వు మోసం చేసుకోకు .......


చేతికి సోగసునల్లింది .














మల్లె తీగలల్లిన కురులు చూసా

మనసు వాడి అల్లిన పాట చూసా

కడలి అలలు అల్లిన తీరాన్నీ చూసా

కాని నీవు అల్లిన ఈ పారాణి నా కనులనల్లింది

ఆ చేతికి సోగసునల్లింది ......


you are a poem

வரிகளில்லை — எழுத இயலாத ஒன்றாக அது. அழகாக ஒன்று, அன்பாக ஒன்று. பக்கங்களுக்குள் கட்டிவைக்க எந்தப் புத்தகத்துக்கும் இயலாதது. தங்கிப் போகப் பிற...