ప్రశ్నకే కలిగే విరహం









పడిలేచే అలలకే ఆశ తీరకుంటే

తీరాన్ని ముద్దాడుతూ పదే పదే కవ్విస్తుంటే

చినుకు తడిపిన తాపానికి

తల వంచి పువ్వులే సిగ్గుతో చూస్తుంటే

కళ్ళముందు మెదిలే నీ రూపం

పెదవులను తాకే నీ భావం

ఎక్కడ నీవెక్కడ అన్న ప్రశ్నకే కలిగే విరహం ....


శ్రీ భీమలింగేశ్వర స్వామి దివ్య చరిత -బెల్దోన , గాధేకల్



ఆధునికుడికి ఆధ్యాత్మిక చింతన 





"శ్రీ  భీమలింగేశ్వర స్వామి దివ్య  చరితను" అనువదించి అందరికి అందుబాటులోకి తెచ్చిన వీడి పేరు రెడ్డి కిరణ్ . వీడు అంటునానేమిటి అనుకోకండి నా స్నేహితుడు కనుక ఆ మాత్రం చొరవ. 





సాఫ్ట్ వేర్  ఉద్యోగిగా ఉంటూ కొంత కాలాన్ని దీనికి వినియోగిస్తూ నాకు ఎంతో ఆదర్శంగా నిలిచాడు 


అందరి మనలను సంపాదించాడు . ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలని ఈ ప్రయత్నం . 


మరిన్ని వివరాలకు కొంత కాలం వేచివుండాలని  మనవి.  










కీర్తిగడించినారెందరో  కీర్తిమంతులెందరో


అట్టి కీర్తినే మకుటమెక్కించిన నీ కీర్తి చిరస్థాయి ....... 



నీకోసం నా స్నేహం














నీ కళల్లో ఏముందో తెలిపేదేలా స్నేహం

వెలుగే విరబూసిందని

చెప్పే నా మాటల్లో సంతోషం నీవంటూ

మనసే కడలయ్యిందని

ఎనాల్లో దాగున్న ఆ చిన్ని ఆశ

నీతోటి తీరింది

నన్నే తడిపింది

అవునన్నా కాదన్నా

నువ్వంటే నాకిష్టం

నీకోసం నా స్నేహం వేచుంది ప్రతి క్షణం...... పపిత .


నిన్ను నువ్వు మోసం చేసుకోకు .














అలలా నిన్ను తాకుతూ వెడలిపోతున్నా

కాని తీరంలా నన్నెపుడూ ఆదరిస్తావు

నీపై అడుగులు ఎన్ని పడుతున్నా

నాకోసమే నీవన్నటుగా నిలిచావు

ఎందరో వదిలిన చేదు గుర్తులను నేను చెరిపాననా

లేక అలల వలలతో నిన్ను బంధించాననా

ఇంత ప్రేమకు నీవు సాక్ష్యం కావచ్చేమో

కాని నేనెపుడు పొంగుతానో ఆగుతానో తెలియదు

నన్ను ప్రేమించకంటూ నీకు చెప్పలేను

రేయి మనసు తెలిసి దాగిపోయే వేకువలా వెడలిపో

నన్ను చేరకు నిన్ను నువ్వు మోసం చేసుకోకు .......


చేతికి సోగసునల్లింది .














మల్లె తీగలల్లిన కురులు చూసా

మనసు వాడి అల్లిన పాట చూసా

కడలి అలలు అల్లిన తీరాన్నీ చూసా

కాని నీవు అల్లిన ఈ పారాణి నా కనులనల్లింది

ఆ చేతికి సోగసునల్లింది ......


మౌనాన్ని వీడుతావా.












చల్లని గాలిని రమ్మంటాను వెచ్చని కౌగిలి అందిస్తావా

కురిసే మేఘం తెపిస్తాను పైట గొడుగును చేస్తావా

మంచు ముసుగును వేయిస్తాను మురిపాలన్నీ ఇస్తావా

జాబిలీ భామను నిలిపెస్తాను నవ్వుల వెన్నల కురిపిస్తావా

ఏది కోరినా రపిస్తాను నీ మౌనాన్ని వీడుతావా......


వింత జీవి కవి














బాధలోనూ సుఖమెరిగే వింత జీవి కవి...


సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...