మేఘ సందేశం
మోయవే నా మాటలన్నీ చేర్చవే నా ఊసులన్నీ మాయమైన స్నేహానికి మరపురాని నేస్తానికి ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మేఘమా పో మేఘమా తన కనులు చూసి పలకరించు చినుకు చల్లి చెలిమి కోరు పరవశించి నాట్యమాడే అందమంతా నాకు చేర్చు ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మేఘమా పో మేఘమా కడలి చేరు తీరమంత వెతికి చూడు తన అడుగు జాడలు ఉన్నవేమో చిరునామా మరి తెలియునేమో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మేఘమా పో మేఘమా దూరమంటూ ఆగిపోకు అంతటి స్నేహం ఎక్కడా దొరకదు తన చెలిమిని నీకు పంచుతాను వేగమంది తనను చేరు ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మేఘమా పో మేఘమా దారివెంబడి పూలు ఉంటాయి వాటి మత్తులోకి జారిపోకు మాయ చేసే మనుషులుంటారు మోసపోయి దారి మరచిపోకు కేరింతలు కవ్వింతలకు ఆదమరచి కురిపించకు దాచినదంత తనకే ఈ భారమంతా అ స్నేహానికే ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మేఘమా పో మేఘమా |
Subscribe to:
Posts (Atom)
సంద్రాన్ని తాకే మొదటి చుక్క
సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...