శివరాత్రి శుభాకాంక్షలు



మిత్రులకు శ్రేయోభిలాషులకు శివరాత్రి శుభాకాంక్షలు . ఆ త్రినేత్రుడు అందరిని చల్లగా కాపాడాలని వేడుకుందాం .




















చెలిమి గుర్తులను మరువలేను










మట్టికి కూడా తెలియని నీ లేలేత అడుగు జాడలు,

నా స్నేహపు తీరంపై ఇంకా చెరగలేదు చెరిగిపోదు,

అలజడి లా వచ్చే అ అలలను తాకనివ్వను ,

కన్నీటి ధారలా మోసం చేసే ఆ చినుకులను తాకనివ్వను,

ఇంకే అడుగును కూడా దానిపై పడనివ్వను,

ఎండబారిన నేలనై నే శిధిలమై పదిలపరుస్తా కాని,

అ ముచ్చటైన చెలిమి గుర్తులను మరువలేను,

ఇకపై ఆ చెలిమిని పెంచాలని వేడుకుంటాను...




ప్రేమికుల రోజు శుభాకాంక్షలు - నిన్ను నువ్వు ప్రేమించు



చేరువయ్యే బంధాలన్నీ ప్రేమ కావు.. చేరువకానివన్ని ప్రేమ కాకుండా పోదు.. నీలో కలిగే మార్పులను ప్రేమనుకొని మోసపోకు... ఓ యువత ఇంకా నీకు అంత నమ్మకం ఉంటే ప్రేమను వదలకు నీ ప్రాణాలను వదలకు...







హృదయమన్నది ప్రేమకే కాదు

సాధనకు శోధనకు

కలత అన్నది విరహానికే కాదు

ఓర్పుకు నేర్పుకు

ప్రేమను జయించి నిన్ను నువ్వు ప్రేమించు

నీవనుకున్న ప్రేమ నీదౌతుంది

నీతోపాటు ఓ ప్రాణంలా తోడుంటుంది...






***********మనసల్లుకున్న బ్లాగులు ***********




కడలి - సుభ - హాయినిచ్చే కడలి  తీరం కనులకు చక్కని చిత్ర కావ్యం 











విలువైనది స్నేహం










పసిపాపకు దూరంగా

ముసిముసి నవ్వులు కోల్పోయి ఉండగలను

పొద్దు వెలుగుకు దూరంగా

నా కనులను కొంత సేపు మోసం చేయగలను

ప్రేమకు దూరంగా

నా మనసును కొంత కాలం ఓదార్చగలను

కాని స్నేహానికి దూరంగా ఉండి జీవితాన్ని పోగొట్టుకోలేను

అది స్వార్ధమో తెలియదు నా అవసరమో తెలియదు

దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా

అ వరమే కరునించాలని కోరుకుంటున్నా ....




మంచి ఆలోచన











ఆయువు తీరని ఆలోచనకు అంతులేదు

నిదురతో వాటిని అంతం చేసినా

వేకువతో సరి ఉదయించు



జీవిత కాలపు వేగంతో పాటు

వాటిలో ఎన్నో మార్పులు

వాటి అదుపులో మనం ఉన్నంత వరకు

మనకు మనమే ఖైదీలు



రెక్కలు కట్టి ఎగురవేసిన

హద్దులనే దాటుతాయి

రెప్పలు దాటనీయకుండా దాచుకుంటే

మనలో బాధలుగా మిగులుతాయి



అవి ఎక్కువైతే ఏకాంతానికి దారి తీస్తాయి

తక్కువైతే మనశ్శాంతికి దోహదపడుతాయి

సమాజంతో కలిస్తే నలుగురికి సాయపడతాయి

సమతుల్యతతో ఉంటే గొప్ప మనిషిని చేస్తాయి




Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...