ఓడిపోదు ప్రేమ





వెలుగే నీతో పయనించడం ఆగిపోయిందా...

నీ ప్రాణం నీ కోసం ఉండనంటోందా       ..

ఏదో ఎదలో భారం తెలియని ఒక లోపం..

మనసే చెదిరే సమయం దానికి ఎవరు చేస్తారు సాయం...





తూరుపు వెలుగు వెళ్ళకు..

సంధ్యారాగం ఆపకు...

చీకటి పడకు తారలేందుకు...

జాబిలే లేకపోతే...





మత్తు పూల వాసనలు ఎందుకు...

మంచు పలకరింపులు ఎందుకు...

వాన జల్లుల ఓదార్పులేందుకు ..

మేఘమే తరలిపోతే..



కాని ప్రేమకోసం నిలచెంతగా నాలో స్పృహ ఎక్కడో దాగుంది..

దాని మాట కోసం ఉండేంతగా నన్నే మార్చివేసింది..

నిలిచివుంట ఒక నీడనై ఎండ వేడిలో ఓ చెట్టునై..

కలిసిపోతా ఈ కాలంతో రగులుతు ఓ వెలుగునై...

 

No comments:

Sweetest

To be sweetest like you one should be the fruit from a tree that breathes on honey but not water