స్నేహము





లేదు కలవాడిలో స్నేహము తప్ప!



లేదు కలిమిలో కలవాడని స్నేహము తప్ప!
 
  

నీవు నేను ఒక్కటే





దిగులు నిండిన మనసుతో

ప్రేమకు తావులేని బంధాలతో

నాలుగు గోడల నరకంలో ఎలా ఉన్నావు..



అందమునంతవరకు ఆరాధిస్తారు

అది ఆవిరయ్యేవరకు ఆనందిస్తారు

కన్నీటి కనులు తప్ప కప్పిన సోగాసునే చూస్తారు

ఈ నిజమే నీకు తెలిసినా నిస్ప్రుహే వాడికి వదిలేసి

కాలుతున్న కాగితమౌతు  ఎలా ఉన్నావు...



అమ్మ ప్రేమ లేదు

తండ్రి లాలన లేదు

తోబుట్టువల నీడ లేదు

కట్టినమైన రాక్షసత్వము తప్ప!

ఎలా వున్నావు నీవెలా ఉన్నావు..



మాములుగా మల్లెల సొగసుకు మోసపోవు కదా!

చక్కని జీవితం ఇష్టం లేక కాదు కదా!

నిలువ నీడ లేకనా నీవారి కోసమా!

నీకోసమైనా సరే ఎలా వున్నావు నీవెలా ఉన్నావు..



నీకెంత ధైర్యం ఇచ్చినా

సాయం చేసే చేతులు నాకు లేవు

నేను నీలా కాకున్నా సమాజంతో కట్టబడి ఉన్నాను

నీవు అందానర్పిస్తే నేను స్వేచ్ఛను అర్పిస్తున్నాను

అందుకే నీవు నేను ఒక్కటే...

 
  

నీ సువాసనల స్నేహాని ఇస్తావని..





చలిగాలి ఒస్తోంది..

చల్లని చినికునే తెస్తోంది...

వెచ్చని కౌగిలిస్తావ పువ్వా.

తుమెద నీకై ఎదురుచూస్తోంది...

రాగాలన్నీ తీసుకొస్తోంది..

రంగులన్నీ దాచిపెడతావ  ఓ పువ్వా..



అ వానాకాలపు మేఘంలా నల్లని మనసే నా మనసు...

నీ వేడి తగలకుండా కురవనే కురవదు...

నీ కనుసైగ లేకుండా ఎక్కడికి వెళ్ళదు...

కాని అవి లేకునా కురిపిస్తునా నీకోసమే..

నా చల్లని చినుకు తగిలైనా చూస్తావని..

నీ సువాసనల స్నేహాని ఇస్తావని..
 
  

నీలో స్నేహం ఉందా అని సందేహించాను...





ఎంతగా చలిఉన్నా

నీ చలిని పోగొట్టే కంబలి నేనౌతాగాని

నా చలిని చలార్చేదెవరని అడగను



ఎంతగా చీకటైనా

వెలుగు చూపించే చూపునౌతాగాని

నాకు వెలుగు చూపెదేవారని ప్రశ్నించాను



నీకు ఎన్నో ప్రశ్నలున్నా

నీ జవాబు నేనౌతాగాని

నా ప్రశ్నలకు జవాబేదని అడగను



మనసులు కలవకున్నా

నీకు స్నేహమందిస్తాను కాని

నీలో స్నేహం ఉందా అని సందేహించను

 
  

సిరి నేవే నా స్నేహం అంటూ జీవిస్తువుంది..





నీ నవ్వులే చినుకుల వానై నాపై కురవాలి..
సంతోషం నీ కనులలో నాట్యం చేస్తూ నేనే చూడాలి..
చిరకాలపు ఈ స్నేహం చిరు మొగ్గై తొడగాలి..
ప్రతి నిమిషం నా తోటలో పూవుగా మారాలి...


చేతికందని పువైనా చేయి చాపితే వదలవు...
పరిమలాలతో స్నేహంలా పలకరిస్తూ ఉంటావు...
మగువకేన్నో అర్థాలు మనసులోనే దాగుంటారు...
ప్రేమతో స్నేహం చేస్తే జీవితాంతం తోడుంటారు.
అందులో నీవొక అందమైన రూపం...
ఆగని గుండెలో దాగివున్న ప్రాణం..




కాలమిచిన స్నేహం నీవు..
నా పాటలోని అర్థం నీవు..
కస్టానంతా కన్నేటిలా దూరం చేసే మమతవు నీవు..
నీకంటూ ఒక లోకం నా మనసులో వున్నది...
రేయి పగలు నీకోసం వెతుకుతూ వున్నది..
సిరి నేవే నా స్నేహం అంటూ జీవిస్తువుంది..
సిరి నీవే నా లోకం అంటూ గుర్తుచేస్తోంది... 
  

నీలి రోజా..





నీలాకాశంలో చిగురించి...

నీలి కడలిలో వాన చినుకై...

వన్నె తగ్గని ముత్యమై..

నీలి మనసులకు ప్రేమ గుర్తుగా..

నీలి రోజావై  పోయావ...

  

మా తెలుగు తల్లివా లేక రాజకీయ బానిసత్వానికి తల్లివా?





కడుపులో బంగారు..

కనుచూపులో కరుణ...

చిరు నవ్వులో సిరులు...

వారికివే వరాలు అందినవన్నీ ఆస్తులు...

కడుపులో బంగారు ఉన్నంత వరకు అ గర్బాన్నే తొలచి వేస్తారు..

కనుచూపులో కరుణ ఉన్నంత వరకు నిన్నే హేళన చేస్తారు...

చిరునవ్వులో సిరులు ఉన్నంత వరకు ఎవరికీ వారు పంచుకుంటారు...

ఎవరికోసమిక నీ ఎదురు చూపులు ఎవరి మీద నీ ఆశలు..

తెలుగు తల్లి నీవెవరి తల్లి ?

మా తెలుగు తల్లివా లేక రాజకీయ బానిసత్వానికి తల్లివా?..  

ఓడిపోదు ప్రేమ





వెలుగే నీతో పయనించడం ఆగిపోయిందా...

నీ ప్రాణం నీ కోసం ఉండనంటోందా       ..

ఏదో ఎదలో భారం తెలియని ఒక లోపం..

మనసే చెదిరే సమయం దానికి ఎవరు చేస్తారు సాయం...





తూరుపు వెలుగు వెళ్ళకు..

సంధ్యారాగం ఆపకు...

చీకటి పడకు తారలేందుకు...

జాబిలే లేకపోతే...





మత్తు పూల వాసనలు ఎందుకు...

మంచు పలకరింపులు ఎందుకు...

వాన జల్లుల ఓదార్పులేందుకు ..

మేఘమే తరలిపోతే..



కాని ప్రేమకోసం నిలచెంతగా నాలో స్పృహ ఎక్కడో దాగుంది..

దాని మాట కోసం ఉండేంతగా నన్నే మార్చివేసింది..

నిలిచివుంట ఒక నీడనై ఎండ వేడిలో ఓ చెట్టునై..

కలిసిపోతా ఈ కాలంతో రగులుతు ఓ వెలుగునై...

 

మా స్నేహ లోగిలిలో నీవే ముద్దు ..





వదిలిపోయే నల్లని మేఘాలు దాగకే చందమామ...

కొత్త లోకం కాదిది వింత లోకం అసలే కాదిది..

నేల నిన్ను చేరదు నీవు నేల నంటవు...

భయపడకు ఇటు చూడు నీతోడు మేమందరు...

తారలమై నీ చుట్టు మా స్నేహ లోగిలిలో నీవే ముద్దు .. 

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...