ప్రేమను కరిగించకు.





నీ తలపే కదా తలిచాను...

దానికి చినుకుల సైన్యమెందుకు..

నీ మనసే కదా కోరాను..

దానికి మెరుపులా దాడి ఎందుకు..

కాదంటే నల్లని మబ్బులా నిలిచిపో..

కష్టమైతే వేడి గాలిలా వీచుకో..

కాని నా ప్రేమను కరిగించకు..

నాపై కురిసి కురిసి ప్రేమను కరిగించకు....

మసి చేయకు మెరపుల వచ్చి నా ప్రేమను మసిచేయాకు...

 

తెలియదు ఏ తేనెటీగకు తేనె చేయటానికి.





తెలియదు ఏ తేనెటీగకు తేనె చేయటానికి...

తెలియదు ఏ ప్రశ్నకు సమాధానము కష్టమని..

తెలియదు ఏ ప్రేమకు తనలో స్వార్ధముందని..

తెలియదు నాకిది తెలుసని చేసేంతవరకు..

కాని తెలిసినా తెలియకుంటారు మనషులు పరుల కష్టాలకు కారణమౌతారు....

 

ఏమనుకుందో ఈ రాతిరి





ఏమనుకుందో ఈ రాతిరి

నన్ను చూసి నల్లబారింది

మన ప్రేమ నిజము కాదని ఈ రేయికి దిగులేమో

ఏమనుకుందో ఆ చందమామ

నన్ను చూసి వెలిగిపోతోంది

మన ప్రేమ నిజమౌతుందని జాబిలికి ఆశ ఏమో

ఏమనుకుందో నా మనసు

నన్ను మత్తులోకి దింపుతోంది

నా  కలలో  నైనా ప్రేమ తెలుపుతావని కోరికేమో.. 

పలుకని బంగారమిది..





పలుకని బంగారమిది...
ముద్దు ముచట్లు ఇవి...
అరచేతి కి అందే ఆ కిటయ్య రూపమిది... 


అల్లరిని కనుపాపలో దాచేవు చిన్నారి...
కోపమంతా బుగ్గలో దాచేవు పొన్నారి...
నవ్వరా కాసింత ముత్యాలు చూపర...
తన్నరా  మా ఎదపై నీ గారాలు పొందేలా....

 

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు





సిరి నీవేకద సిరి నీవేకద శ్రీరామా ..

సిరి సంపదలన్నీ నీ నామమే కదా..

అది ఒక కాలము అయోధ్యా రాజ్యము...

ఇది కలి కాలము అన్యాయమే రాజ్యము...

విల్లులు అంబులు పనిచేయని రోజులయ్య...

ఏ మంత్రములు పనికిరావయ్య..



హిందువు నీవని ముస్లామాను కావని...

నరహరి నీవని క్రైస్తవుడివి కావని...

ఎన్నో కొత్త మంత్రాలు మనుగడలోనికి...

ఏమని పూజించను ఓ మనిషిగా నే ఏమని పూజించను...



భరత మాత కోసం బంధాలు విడనాడి...

పోరాడే యోధులు ఉన్నారు నీలాగ...

అదే నేలను కండాలుగా విడదీసే రావనులున్నారు..

ఏ రాముడు వస్తాడో ఎలా సంహరిస్తాడో..



నీ పుట్టిన రోజుకు నవ్వులు కావు..

మా కష్టాలే నీకు విన్నపాలు..

మళ్ళి రావయ్య ఈ రాజ్యమేలవయ్య...

అన్యాయాలు అక్రమాలకూ పరసురాముడిగా...

ప్రేమకు అభిమానాలకు కౌసల్య రాముడిగా..

భక్తికి ముక్తికి సీతా సమేతుడిగా...

దిగిరావయ్య రాజకీయ రాజ్యమును యేలవయ్య....

సిరి నీవేకద శ్రీరామా సిరి నీవేకద శ్రీరామా ..

సిరి సంపదలన్నీ నీ నామమే కదా.. 

ప్రాణము లేని గాలి చల్లగా వీస్తే నేమి .





ప్రాణము లేని గాలి చల్లగా వీస్తే నేమి ...

ప్రేమ లేని ప్రేయసి చెంత నుంటే నేమి....

మనసు లేని మాట గమ్మతుగా  వున్ననేమి ...

ఆ మాటకు బూటకపు నవ్వులు విరబూస్తేనేమి..

వెన్నలై విరబూసింది...





నీ కనులనున్న కాటుకను తీసి..

ఆకాసమును తడిమితే అది రాత్రిగా మారింది...

నీ నవ్వుల తోటలో ఒక మొగ్గను తీసి..

దాని పై విసిరితే అది వెన్నలై విరబూసింది.....

సంధ్యారాగం..





రేయికి ఇష్టం అయితే పగటికి దూరం...

పగటికి చేరువైతే చీకటికి మనస్తాపం...

ఇద్దరికి కానిది సంధ్యారాగం...

ఎవరికో మరి అది ఎవరికో....

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...