అందమైన పడతులు...







ఆరని పారానికి అందాల పాదాలు...

తీరని విరజాజులకు నల్లని కురులు...

అధిన రంగులకు చక్కని చెకిల్లు...

మత్తుగొలిపే ఎరుపునకు తియ్యటి అధరాలు...

ప్రేమను మోసే ఎద జతలు...

నాజూకు నయగారాల ఒంపు సొంపులు...

గల గల గాజులకు చిక్కని చేతులు...

వెలుగు మరిపించే కాటుకకు లేడి కనులు...

కునుకు తీయని కలలకు అందమైన రూపు రేఖలు..

ఆత్మీయమైన ఈ ప్రపంచానికి అందమైన పడతులు...

అబద్ధం నిజమైతే అది మంచిదే...



ఇక్కడ గీతలు వంకర అన్నది ఓ అబద్ధం...

కొలబద్దతో పరిశీలించండి...





నిజము తెలిసి మనసు దూరమైతే ప్రేమ అన్నది ఎక్కడ .....

రూపమేరిగి కనులు దూరం చేస్తే చెలిమి అన్నది ఎక్కడ.....

బాధలున్న పెదవే నవ్వకుంటే ఆనందం ఎక్కడ...

కులము మతము జాతి బేధము అన్ని నిజమైతే మనుజుని మనుగడ ఎక్కడ....

అబద్ధమే ఓ ఆశ పదే పదే చెబితే అదే నిజమవ్వదా...



చెబుదాం ఓ అబద్ధం మనమందరం ఒక్కటని...

చెబుదాం ఓ అబద్ధం మనలో జాతి మతం లేదని...

చెబుదాం ఓ అబద్ధం దేశానికే నా ప్రాణమని...

చెబుదాం ఓ అబద్ధం అది నిజమవ్వని...



నిజమైన జీవితానికి అబద్ధాలే తుది మెట్టు..

మనసుకు మమతలకు అబద్ధాలే ఓదార్పు...

గడిచినదంతా అబద్ధాలే  అని మరచిపోతే నిజమైన లోకం మన ఎదుట..

లేనిదంత అబద్ధము  అని చెప్పినపుడే ఉన్నది నిజమౌతుంది..



నేనే ఓ అమ్మనైతే...





పూతోటనై పూలకు ఓ అమ్మనై...

చిగురాకులనే చేతులతో కాపాడుకుంట...

ఈ ప్రకృతై  పచ్చని అందమై....

ఈ నేలను నా ఒడిలో నిదురింపజేస్త..

ఆ బ్రమ్హే పూజించే దేవతా రూపమై...

నా బిడ్డలా తలరాతను సరిచేయమంటా...

కలలకు అమ్మైన అ చీకటి నిధురై...

వేకువ ఒచ్చేవరకు తోడుంట...

నీటి చుక్కను మోసి ముత్యము చేసే అల్చిప్పనై...

అ ముత్యమును వెలకట్టలేని సంపదగా చేస్తా...

పేద జీవితాన ఆకలి నిండిన హృదయాలకు...

ప్రేమ పంచే పిడికిలి ముధనౌతా వారినవ్వులకు కారణమౌతా...

చినుకును పుట్టించే మేఘమై ...

కరువులేకుండా కాసులను కురిపిస్తా...

రెండు హృదయాల ప్రేమకు కారణమైన మనసునై...

అ ప్రేమను చివరిదాకా పెంచి పోషిస్తా..

దేశమాతనై వీర సైనికుల ఆత్మలకు ఓ స్వతంత్ర చిహ్నమౌత ...

అమ్మ





తీరని రుణమంటూ ఉంటే..

అమ్మరుణము ఒక్కటే..

మనలో ప్రాణం ఉందంటే..

కారణం ఆ దేవతే...



ప్రేమకు మించిన ప్రతిరూపం..

అ దేవుడే కోరెను అమ్మ గుణం..

కోరకుండానే వరములిచ్చే మానవ రూపం..

తెలియని మనకోసం బరువును మోసే నిస్వార్ధం..

తనను మరచి మానకై  పరితపించే అమ్మ ప్రాణం..

స్వాతంత్రదిన శుభాకాంక్షలు.





కధలివస్తోంది భారత దేశం...

వెలుగు ఆరని దివ్య తేజం..

యుగయుగాల ప్రస్తానం..

ఇది ధర్మానికి పెద్ద పీటం..



అన్యులకు సామాన్యులను..

గొప్పవారిని బడుగులను..

బెధమేలేక ఆదరించే..

గొప్ప దేశం భరత దేశం..





వేదాలను చూసిన దేశం...

దేవుడు చేసిన సుందర సౌధం..

శాంతికిదియే నిలయం..

గొప్ప నేతలు పుట్టిన దేశం..





మతాలకు తావులేని మానవత్వం..

అన్ని బాషలు కలిగిన కమ్మని రాగం..

యువతనే సారధులుగా ఉన్న భవిష్యత్ ప్రపంచం..

మన అందరి చేతిలో మెదిలే స్వప్నం..

కదలి రండి కాపాడుకుందాం...

ముందు వెనుక..







కన్నీరు కార్చే కనులేవ్వరివో...

తీర్చే మనసు ఎవ్వరిదో...

ప్రేమను కోరే బందాలనడుమ...

ద్వేషం కోపం ఎందుకనో..



దేవుదిచిన్న నిమిషాలలో..

ప్రతినిమిషం ఈ గొడవేగా..

తాను నేర్చిన పాటాలలో...

జీవితం ఎక్కడ కానరాదుగా..





ఎదురు చూసినా పలకరింపులే...

నవ్వుతు వాలుతూ ఓదార్పులే...

వెన్నకి పోయి ఈసడింపులే..

తనకే అంతా అంటూ చెప్పే మాటలే..





చివరికి ఏమని తెలియదు పాపం...

ప్రస్తుతానికే ఇస్తారు విలువలు...

ఊపిరాగినా తెలియదు నేరం ...

కనీటి వీడ్కోలు అర్పిస్తారు...





అన్ని తెలిసిన గునమేవ్వరిదో...

మోక్షాన్ని పొందిన ఘనతేవ్వరిదో.....

కొంత సేపటికే ఈ ప్రాణం...

తీరిపోయినా మిగిలే వ్యర్ధం...

సుసికళ...



తగిలిన వాటిని చల్లగా చేస్తూ తాను కరిగిపోతు.....

ప్రకృతి చేసిన ఓ రూపమై....

మనసు కలిగి వాటికీ కనులు కలిగి....

భాధనూ చల్లని నీరుగా చేస్తూ....

ప్రేమకు తనను తనే బహుమతి చేస్తున్న మాట ఒచ్చిన మంచు రూపము...

మనుషులలో ఓ ప్రేమ రూపము....

నవీన పోకడ..



నడుము తాకు కురులు కాస్త మెడను తాకెను..  

చక్కనైన కట్టు చీర బాగా చురుకాయెను..

మాటలోని మాధుర్యం కఠినమాయెను....

మేని చాయలు ఎంతో మెరుగాయెను...

పత్తి లాంటి పాదాలు మొద్దుబారెను..

సిగలోని పూలు జడ పట్టిలాయెను..

చేతికుండు గాజులు చెవిపోగులాయెను..

ఆడదాన్ని ఉనికి చెప్పు గజ్జెలు మూగబోయెను.

సిగ్గుపడే చెక్కిళ్ళు కరువాయెను...

కళ్ళు దిద్దు కాటుక జడరంగులాయెను...


ఏమిటది ఏమిటి... కనుకోండి చూద్దాం??





పగలే రాతిరి తారకలు...  

రెయిన మధ్యానపు ఎండలు..

వాడిపోని పూలు...

సంకెళ్ళు లేకనే బంధించబడిన కైదీలు...

ఎవరు అది ఎవరు ఏమిటది ఏమిటి??

.


ట్రాఫ్ఫిక్ లోకం...





నడక నడుమే చాలదు..

గాలికూపిరి ఆడదు...

మన జీవితం లో ఒక్కరోజును తీసివేసే...

కొంత సేపటి యమలోకం...

అది ట్రాఫ్ఫిక్ లోని గంధర గోళం..



సూదిలో తీగను దోపచ్చు..

ఇంకా మనమే దూరేయచ్చు..

కాని దారులు ఉన్నా దూరలేని..

ఏ మార్గము లేని మాయ మార్గం...



మనపాపాలే గొట్టాలలో పొగలై వెంటాడుతుంటే..

కదలలేక ప్రళయ నాదాలే మోగిస్తూ..

ముందున్న వాడె నారాయనడిలా కనిపించే..

ఓ మంచి వేదం ట్రాఫ్ఫిక్ లోకం..



భయము...





మన ఆలోచన మనచెంత లేనపుడు...

మన కర్తవ్యానికి మనమే తోడు లేనపుడు...

కలిగే భావనే ఈ చీకటి...

ఆ నిదురలో ఒచ్చే కలలే ఈ భయము...


స్నేహమనే స్వార్ధం...





స్నేహంపై నమ్మకం ఉంటే ...

స్వార్ధం దరి చేరదు...

కాని ఎంతటి నిస్వార్దులకైనా..

స్నేహం అనే ఓ స్వార్ధం ఉంటుంది...


ఓ వనిత నీకొక్క మాట.....





ఓ వనిత నీకొక్క మాట భయపడకు....

చేజారుతున్న జీవితాన్ని తుది ముట్టించు...

అలుపన్నది లేదు నీకు గెలుపన్నది నీ పేరు...

నిజమంటూ ఒకటుంటే నిర్భయంగా పోరాడు...



అందరికి కలలు వారి నిదుర చేతులో...

నీకంటూ కలలుంటే నీ చేతలలో...

నీవే ఒక పువ్వై నలిగిపోతావో...

లేక ఆ పువ్వునే మాలగా ధరిస్తావో....



అందరికి కారణం నీవైనపుడు నీకెందుకు తోడు...

నీ నీడ కదలితే చాలు కష్టాలే కడతేరు...

కదలిపో ఓ మహిళా మహా సంద్రమై...

కబళించు అన్యాయాన్ని ఓ ఉప్పెనై...

ఎంత భావము ఉండునో?





కవికెన్నడు  కాకూడదు ఏది భారము...

తగిలిన రాయి కూడా ఓ ఆలోచనగా మారాలి....

చిరిగినా కాగితము లో కూడా అక్షరము చోటు ఉన్నప్పుడు...

మనకున్న ఆలోచనలో ఎంత భావము ఉండునో??..

సరిచేసుకోవాలి అనుక్షణం.





శిధిలమైన మనసులో శికరమంటే ఆశలు,

కొంచమైన కోరికలతో మితిమీరె ఆలోచనలు,

బ్రతుక నేర్చుటకు వేసే అడుగులలో ఎన్నో తప్పటడుగులు,

ప్రేమను చేరే ఆలోచనతో కుంగిపొయే పెంచిన మమకారాలు,

ఎంత జేరిగిన ఆగకూడదు ఈ జీవితం,

తప్పు చేసిన సరిచేసుకోవాలి అనుక్షణం......



చేపను ప్రేమించి

నీటిలో బ్రతకలేనని తెలిసి, చేపను ప్రేమించి, అర్థం లేని పోరాటం చేస్తున్నా, నాకు నేను దూరం అవుతున్నా.. 💔