ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది


అందరూ మళ్ళీ వెళ్లి మట్టిలోనే కలిసినట్టు, నా మనసుకు ఊపిరి ఆగినప్పుడల్లా నీ జ్ఞాపకాలలో కలిసిపోతూ ఉంటుంది, అందులోనే మళ్ళీ జన్మ పోసుకొని ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది...

Like all souls return to dust, my heart, when it ceases to beat, dissolves into memories of you. There, I am reborn, hopeful and waiting...

🩵

నేను

ఎలా గాలి తాకినా కదిలే చిగురుటాకు కాను నేను, ఒక దిశలో తాకితే తప్ప పలకని వేణువు నేను, ఒక దిశలో తాకితే తప్ప పలకని మొండి వేణువు కాను నేను, ఏ దిశలో తాకినా సంతోషంగా పలికే లేత చిగురుటాకును...

I am not a tender leaf  
That sways with the wind,  
Touching in any direction.  
I am the flute  
That responds only when  
The air flows just right.  
I am not as stubborn as the flute  
That waits for the perfect breath.  
I am like the tender leaf  
That dances joyfully  
With the touch of air in any direction...

తేనెపట్టు


ఏ జాతి తేనెటీగకి ఇంత నేర్పు ఉందో తెలియట్లేదు,
తేనెపట్టు చెట్టుకే కాదు కడుపులోనూ ఉంటుందని నిన్ను చేతికి తీసుకున్నాక తెలిసింది,
సమయం గడిచేకొద్దీ ఈ తేనెపట్టు నవ్వుల తేనెలూరిస్తూ మరింత పెరుగుతోంది...

I wonder what kind of bee could be so skilled,
To build a honeycomb, not in a tree, but within one's belly.
I only realized this when I held you in my hand.
As time passes, this honeycomb fills with honeyed laughter, growing ever larger...

❤️

గాలిపటం




గాలిపటం గాలికి తట్టుకోలేకపోతే,
బలమైన గాలిపటాన్ని తయారు చేయాలి,
అంతే కానీ గాలిని నిందిస్తే,
ఎప్పటికీ గాలిపటం ఎగురవేయలేరు...

ಗಾಳಿಪಟವು ಗಾಳಿಯನ್ನು ತಡೆದುಕೊಳ್ಳಲಾಗದಿದ್ದರೆ,
ಬಲವಾದ ಗಾಳಿಪಟವನ್ನು ಮಾಡಬೇಕು.
ಗಾಳಿಯನ್ನು ದೂಷಿಸುವವರು
ಯಾವಾಗಲೂ ಗಾಳಿಪಟ ಹಾರಿಸಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ....

If the kite cannot withstand the wind,
The flyer must make a stronger kite.
Those who blame the wind
Cannot fly the kite forever...

💡

చులకన

ఎగిరే గాలిపటానికి చులకన అయ్యాను నేను కింద ఉన్నందుకు, తనను ఎగురవేసింది నేనే అని మరచి, నింగితో సావాసం చేసింది తారకై అక్కడే ఉండిపోయింది....

I was disregarded by the soaring kite because I was on the ground while it was flying high, forgetting that it was I who made it fly. It mingled with the sky and stayed there, turning into a star..

उड़ते हुए पतंग ने मुझे नज़रअंदाज़ कर दिया क्योंकि मैं जमीन पर था जबकि वह ऊंची उड़ रही थी, यह भूल गया कि मैंने ही इसे उड़ाया था। यह आसमान में मिल गया और वहीं रह गया, एक तारे में बदल गया।

🩵

చిరుపాదం



మురిపాల జలపాతమా,
మురిసింది ఈ నేలమ్మ,
చిరునవ్వు చిరు పాదమా,
నువ్వు కదిలొస్తే నది కృష్ణమ్మ...

❤️

బంగారం రాయి

బంగారాన్ని రాయికి రుద్దితే రాయి మెరుస్తుంది కానీ బంగారంగా మారదు..

Rubbing the gold on the stone makes it shine like gold, but it cannot turn the stone into gold..

💡

దుఃఖంతో చేసిన మనసు

దుఃఖంతో నిండిన మనసును ఓదార్చగలము,
కానీ దుఃఖంతో చేసిన మనసును ఆదరించగలమే కానీ ఆర్చలేము...

💡

నమ్మరా

దీపం లేకనే వెలుగు చూసాను అంటే నమ్మరా, తన రూపం చూడకనే తలపులతో జీవిస్తున్నా, గాలి లేకనే శ్వాస తీసుకుంటున్నా అంటే నమ్మరా, తన మాట లేకున్నా  పలుకుల తాకిడి నాకు వినిపిస్తోందిగా...

మరక

నాపై ఎన్నో మరకలు,

అన్నింటినీ శుభ్రం చేయాలని ప్రయత్నిస్తున్నాను,

కానీ నువ్వు చేసిన మరక నా గుర్తింపుగా మారింది,

నేను దాన్ని శుభ్రం చేయడానికి బదులుగా నన్ను శుభ్రం చేసింది,

మరి ఆ మరకను ఎలా చెరపగలను...

I have many stains,
And I am trying to get rid of them.
But the stain of yours has turned into my identity;
It is the only stain that cleanses me instead of me cleansing it.
Why would I wash it away?


🩵

శిఖరం

నా చూపులు శిశిరాన ఎండుటాకులా రాలుతోంది నీ శిఖరాలపై...

🩵

ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది

అందరూ మళ్ళీ వెళ్లి మట్టిలోనే కలిసినట్టు, నా మనసుకు ఊపిరి ఆగినప్పుడల్లా నీ జ్ఞాపకాలలో కలిసిపోతూ ఉంటుంది, అందులోనే మళ్ళీ జన్మ పోసుకొని ఆశతో ఎద...