మరక

నాపై ఎన్నో మరకలు,

అన్నింటినీ శుభ్రం చేయాలని ప్రయత్నిస్తున్నాను,

కానీ నువ్వు చేసిన మరక నా గుర్తింపుగా మారింది,

నేను దాన్ని శుభ్రం చేయడానికి బదులుగా నన్ను శుభ్రం చేసింది,

మరి ఆ మరకను ఎలా చెరపగలను...

I have many stains,
And I am trying to get rid of them.
But the stain of yours has turned into my identity;
It is the only stain that cleanses me instead of me cleansing it.
Why would I wash it away?


🩵

శిఖరం

నా చూపులు శిశిరాన ఎండుటాకులా రాలుతోంది నీ శిఖరాలపై...

🩵

ప్రాణం పోయావా తనకు?


ಅಂಧಕಾರವೊಂದೇ ನಿನ್ನ ನಿಜವಾದ ಸೌಂದರ್ಯವನ್ನು ತಿಳಿದಿದೆ, ಓ ಕನಸೇ, ನೀನು ಏಕೆ ಸ್ವಲ್ಪ ಕರುಣೆ ತೋರಬಾರದು? ನೀನೇ ದೇವರಾಗಿ ಮಾಡಿಕೊಂಡು ಅವಳಿಗೆ ಜೀವ ನೀಡಬಾರದೇ?

केवल अंधेरा ही आपकी सच्ची सुंदरता को जानता है, हे सपने, क्यों नहीं थोड़ी दया दिखाते हो? क्यों नहीं आप स्वयं ईश्वर बनकर उसे जीवन देते?

இருளுக்கு மட்டுமே தெரியும் உன் உண்மையான அழகு, ஓ கனவே!, நீ ஏன் கொஞ்சம் கருணை காட்டக்கூடாது? நீ ஏன் உன்னை கடவுளாக்கிக் கொண்டு அவளுக்கு உயிரைக் கொடுக்கக் கூடாது?

Only darkness knows your true beauty, oh dream, why don't you show some mercy? Why don't you Make yourself a god and give her life?

చీకటికి మట్టుకే నీ అందం గురించి తెలుసు, ఓ స్వప్నమా కాస్త కరుణ చూపించు, నిన్ను నువ్వు దేవుడిగా మార్చుకొని ఆమెకు ప్రాణం ఇవ్వు...

🩵

కరువు

నేలకి కరువు కానీ నింగికి కాదు,
మనిషికి కరువు కానీ అందని తలపులకు కొదవ లేదు...

The earth may face drought, but the sky does not. Man may face scarcity, but there's no shortage of unattainable thoughts...

💔

చేపను ప్రేమించి

నీటిలో బ్రతకలేనని తెలిసి,
చేపను ప్రేమించి,
అర్థం లేని పోరాటం చేస్తున్నా,
నాకు నేను దూరం అవుతున్నా..

💔

ఆకర్షణ


నా దేహం భూమి ఆకర్షణకు లోబడితే, నా మనసు మట్టుకు నీ ఆకర్షణకు లోబడింది..

While my body is subject to the Earth's gravity, your love's gravity makes my heart beat...

जबकि मेरा शरीर पृथ्वी के गुरुत्वाकर्षण के अधीन है, आपके प्यार का गुरुत्वाकर्षण मेरे दिल को धड़काता है।

🩵

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే...

If it were possible to say which drop of water in the river stream first touches the sea, then it would be easy to find a way to win your love.

यदि यह पता लगाना संभव हो कि नदी के प्रवाह में कौन सी बूंद सबसे पहले समुद्र को छूती है, तो तुम्हारा प्यार पाने का रास्ता भी आसान हो जाएगा...

💔

చవక

అంత చవకనేమో స్వర్గంలో అందం, కుప్పలు తెప్పలుగా కొని నీకు అద్దేశాడు దేవుడు...

Perhaps beauty is so cheap in heaven that God bought it in heaps and applied on you...

🩵

అంగుళం దూరం

నీకు నాకు మధ్య ఒక అంగుళం దూరం భూమి చుట్టూ అంగుళం వెడల్పు పగులు లాగ అనిపిస్తుంది. చిన్నదే అయినా ప్రపంచాన్నే విడతీసినట్టు ఉంటుంది. మనము ప్రేమకు మించి ప్రేమించాము, ఇప్పుడు అంతానికి మించి విడిపోయాము. మన మధ్య ప్రతిదీ విపరీతమే...

An inch of gap between you and me feels like an inch-wide crack around the Earth. It’s small, yet it feels as if it divides the world. I don’t know what would happen if we stayed this far apart. We loved beyond love, and now we are separated beyond the end. Everything between us seems to exist in extremes.

💔

చల్లని మెరుపు



చల్లని మెరుపు తగిలి, సిరిమల్లెకు ఊపిరి వచ్చిందేమో, ఆ ఊపిరి నీలా రూపు దాల్చిందేమో...

చెవిలో నాలుక

నా చెవిలో నాలుక ఎప్పుడు మొలచిందో తెలియదు కానీ నీ ప్రతి మాట తియ్యగా అనిపిస్తోంది, ఇలతో  పాటు కలలోనూ నాకు మరో జన్మ ఉందనిపిస్తోంది, నువ్వు నా కలలో వస్తుంటే ఇలనే కలగా మారుతోంది..

🩵

ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది

అందరూ మళ్ళీ వెళ్లి మట్టిలోనే కలిసినట్టు, నా మనసుకు ఊపిరి ఆగినప్పుడల్లా నీ జ్ఞాపకాలలో కలిసిపోతూ ఉంటుంది, అందులోనే మళ్ళీ జన్మ పోసుకొని ఆశతో ఎద...