హత్తుకునే చేతులు నీదైతే తప్ప


నా ప్రేమకు కఠినత్వాన్ని ఛేదించే శక్తి ఉంది, కానీ హత్తుకునే చేతులు నీదైతే తప్ప అది వికసించదు...

My love has the power to crack through the hardness but it won't surface unless the picking hands are yours..

💞

అద్దంలో నీడ


ఓ అద్దమా నీడ తానుగా ఎదురైతే తప్ప నువ్వు నీడను చూపలేవు, నా నీడ నన్ను విడిపోయింది కావున నీకు ఇదే సదవకాశం, తనని ఎదురుకో, నల్లని నీడను కూడా చూపగలవని నిరూపించుకో..

Oh, mirror, you can only cast a shadow when you confront a shadow itself. My shadow is anyway far from me, so it's your chance to face it and prove that a mirror can indeed cast a dark shadow, not just reflect..

💞



ఎంత దూరమో అంత ప్రేమ


అద్దం ఉన్న దూరాన్ని బట్టి విస్తారమైన సముద్రాన్ని లేదా మొత్తం భూమిని లేదా పాలపుంతని కూడా ఒడిసి పట్టగలదు. సఖీ నీ అపారమైన ప్రేమను ప్రతిబింబించాలంటే, నన్ను నేను మరింత దూరంగా ఉంచుకోవాలి. నీ ప్రేమ ఎంత విస్తృతంగా మారుతుందో, దాన్ని ప్రతిబింబించడానికి నేను అంత దూరం వెళ్ళాలి...

A mirror can even hold a vast ocean or this earth or a galaxy depends on the distance it is placed, to reflect your vast love I have to keep myself far and far, the more wider your love is becoming that far I have to go to reflect it..

💞

నువ్వు ఎక్కడ


తామర కనిపించకుండా దాని తూడు కనిపిస్తే చూడాలని ఎంత ఆసక్తిగా ఉంటుందో నువ్వు కనిపించకుండా నీ పాదం మట్టుకే కనిపిస్తే అలాగే ఉంటుంది. నిన్ను చూడటానికి ఆ పాదాలను కదలమని కాస్త విన్నవించుకోనా?

It sparks curiosity when the Lotus stalk is visible, even if the flower itself is not, much like your foot being visible without you. May I ask your feet to sway a bit and reveal your beauty to me?

💞

ఇంకెంత నడిపించాలో నా చూపులను



నా చూపులను కొన్ని వేల మైళ్ళు నడిపిస్తే కానీ నీ జానెడు కళ్ళ అందాన్ని తనివితీరా చూడలేకపోయాయి, మరి నీ అందమంతా తెలుసుకోవాలంటే ఇంకెంత నడిపించాలో తెలియట్లేదు నా చూపులను..

I need to endure an odyssey with my eyes to witness such profound elegance. It took me thousands of kilometers to traverse from the corner of one eye to the other, and I am uncertain about the distance required to define it further and explore the intricacies with elegance...

💞


కలలు ఎప్పటివైతే ఏముంది


కంటి బైట కలలు వస్తుంటే ఇక నిద్రతో పనేముంది, ఆ కలలకు కాలం ఉంటుందా నిన్న ఈరోజు రేపు అని, నువ్వు నా చెంత లేనపుడు అవి ఎప్పటివైతే ఏముంది..

What is the need for sleep when I can dream out of my eyes? Do those dreams have the concept of time, such as past, present, and future? No, it doesn't matter when you are not with me..

💞

కబలిస్తుందే కానీ సాయపడుతుందా



ఎర్ర పెదవి కాల్చినా నల్ల పెద్దది కాల్చినా చుట్టకు భేదమేముంది, ఆ చుట్టలోని పొగ నీకు కీడే చేస్తుంది, నీ పెదవి రంగు దానికి అంటదు కానీ దాని మసి నీకు కచ్చితంగా అంటుతుంది, చెడ్డవాడని మంచి వాడని దానికి భేదం ఏముంది అది కేవలం చుట్టే, చుట్ట లాగే ప్రవర్తిస్తుంది, అలాగే కీడెంచే వారితో సావాసం నిన్ను కబలిస్తుందే కానీ సాయపడుతుందా...

Whether it's red lips or black lips, the smoke from burning tobacco will harm you. The color from the lips won't stick to it, but its soot will definitely adhere to you. It doesn't differentiate between good and bad; it simply acts like tobacco—it's its nature. Similarly, associating with evil people will engulf you but not help you...

💞

వెన్నలకోసారి కల వచ్చింది



వెన్నలకోసారి కల వచ్చింది, వేకువ చూసినట్టుగా, రాతిరి వీడినట్టుగా, ఆ కల నాకు పంపి అడిగింది నిజమెంత అని, నా చెలి నను వీడటం నిజమైతే నీ కల కూడా నిజమౌతుంది అని విన్నవించాను...

Once upon a time, the moon had a dream, as if it had seen the dawn and left the night. It sent that dream to me and asked how true it was. I pleaded that if it is indeed true that my beloved is leaving me, then your dream will come true..

💞

ఎవరు పొగిడితే?


ఎవరు పొగిడితే పున్నమి వెన్నెలను ఇస్తుంది.,ఎవరు పొగిడితే వేకువ వెలుగునిస్తుంది., ఎవరు పొగిడితే తారక తళుక్కుమంటుంది., కనిపించని కవులున్నారేమో ఆ నింగిలో, మరి ఈ నేలపై నీకు కనిపించే కవిని నేనవ్వనా, నీ అందాన్ని ఆనందాన్ని వర్ణించి కనిపించని నీ ప్రేమకు ఇంధనం పోయనా?

Through whose praise does the moon shed its light, by whose acclaim does the sun rise, and through whose commendation do the stars twinkle? Perhaps invisible poets reside in the sky, but can I be your visible poet, extolling your beauty and joy, and bringing forth the invisible love that surrounds you?

💞

మన అడుగులను తుడుస్తూ తుడుస్తూ అలలు అలసిపోవాలి



తీరంపై ఎన్ని జ్ఞాపకాలు ముద్రించాలో తెలుసా, మన అడుగులను తుడుస్తూ తుడుస్తూ అలలు అలసిపోవాలి...

Do you know how many memories we have to print on the shore? The waves have to get tired by washing away our prints...

💞


తొంభై తొమ్మిది శాతం అందాన్ని చూసా


నిన్ను చూసాక ఈ భూమిపై తొంభై తొమ్మిది శాతం అందాన్ని చూసా అని అనిపిస్తోంది, ఇంక ఒక్క శాతం పోతే పోయింది అది చేరుకోలేని ఆకాశంలో ఉంది అనుకుంటా, నీకంటే మరింత అందంగా ఈ నేలపై ఏముండబోతుంది?

After seeing you, it feels like I've found 99% of the world's beauty, and the remaining 1% is up in the sky. What on this earth could be more beautiful than you?

💞

నాతో కలిసి వందేళ్లు ఉంటే చాలు


వేల సంవత్సరాలు జీవించగలిగే దేవతకి నాతో జీవితాంతం ఉండాలంటే కుదరదేమో, దేవి అందుకే కోరుకుంటున్నాను నాతో కలిసి వందేళ్లు ఉంటే చాలు, ఆపై ఉండాలని కోరుకోను...

I understand that living with me forever may be challenging for an angel, given your thousands of years of lifespan. My dear, could you please stay with me for a hundred years? That would be sufficient; I won't ask for more..

💞


తగ్గదు దానిలోని ప్రేమ సారం


చీకటితో మాసిపోదు నా అక్షరం,
వేకువతో వెలిగిపోదు నా అక్షరం,
నిరంతరం దానిది ఒకే అర్థం,
తగ్గదు దానిలోని ప్రేమ సారం...

Neither darkness can erase my words, nor morning can brighten them up; their meaning remains the same forever, and the essence of love never decreases..

💞

నీ జ్ఞాపకం శిధిలమైనా పదిలం


నువ్వు లేని హృదయంలో మంచుకొండ వెలసేనా ఆ మంచుకొండ లోతుల్లో నీ జ్ఞాపకం శిధిలమైనా పదిలంగా ఉండేనా...

The iceberg emerges in the heart without you; thus, though buried, the memories remain forever under it..

💞

ఆ కొంతని ఎంత అశ్వాదిస్తావో అది నీ ఇష్టం


మంచు తుంపర్లను వర్షం అనుకొని నిలిచిపోతే ప్రయాణం ఆగిపోతుంది, అరే వర్షం అని సంబరపడితే ఆ ఆనందం కొన్ని క్షణాలే ఉంటుంది, అది కొంతసేపటి అనుభవం, ఆ కొంతని ఎంత అశ్వాదిస్తావో అది నీ ఇష్టం...

If, by mistake, you perceive snowflakes as rain and tread cautiously, the journey may come to a stop. Opting to celebrate it, the ensuing happiness remains brief—a momentary encounter where the depth of your enjoyment is at your discretion..

💞

పూతోట అందంతో గడ్డి పరక పోటీ పడగలదా


మత్తులో తూలినా సరే నీ అందాన్ని మరువగలరా ఎవరైనా?, నీ వెలుగు చూసి సిగ్గు పడుతున్నాయి మిణుగురులు, చూసావా ఎపుడైనా? పూతోట అందంతో గడ్డి పరక పోటీ పడగలదా? నీ అందం ముందు ఎవరైనా నిలబడగలరా?..

even In the haze of intoxication, your beauty remains unforgettable. Did you ever fathom the millions of fireflies blushing in awe of your radiance? Who dares to stand unswayed before you? Like a single blade of grass failing to diminish the allure of a garden, your beauty persists undiminished..

💞


నీ పలకరింపు


నీ పలకరింపు ఉప్పు కొండలో ఒక చక్కర కణంలాంటిది - అది ప్రత్యేకంగా కనిపించకపోవచ్చు, కానీ రుచి వేరుగా ఉంటుంది. ఆ రుచి చీమకు మట్టుకే తెలుస్తుంది లేదా నాకు చీమ లక్షణాలు ఉన్నాయేమో...

Your wish is like one sugar crystal in a heap of sugar – it may not seem unique, but it tastes different. Either the ant knows, or maybe I am having the sense of an ant..

💞

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...