ఉంటుంది లేదా పెరుగుతుంది

రెక్కలిచ్చి పొమ్మన్నా పోలేదు,
బరువు పెంచి దిగమన్నా దిగలేదు,
మాటలతో పొడిచినా చావలేదు,
ఎలా తిరిగి ఇవ్వాలి నీ ప్రేమను?
నీ ప్రేమకు మరి ఏ ప్రేమ బదులుకాదు కాబట్టి,
ఏమో ఇచ్చిన దానికంటే నువ్వే ఎక్కువిస్తే అది ఉంచుకొని ఉన్నది తిరిగిస్తాను...

I gave it wings to fly away, but it stayed.
I made it heavy with all the tears, but it didn't fall.
With words sharp as knives, I tried to lay it to rest, but it didn't die.
Nothing can make your love vanish or replace it.
Perhaps you can give a little more. For what I have taken, I shall return.
If you can't give more, it stays forever. And if you can, it grows forever...

💜💜

గాలికి కోరిక కలిగే అందం

నా కాగితంపై వీచే గాలికి కోరిక పుట్టింది కనులు కావాలని, నీపై రాసే ప్రతి అక్షరాన్ని చదవాలని ఎందుకంటే కాగితం నుంచి వచ్చే పరిమళం గాలిని సైతం ఆపేసింది....

The wind that is flowing over my paper seems to wish for eyes so it can see what I am writing, because the paper is so fragrant that the wind cannot even move away from it...

💜💜

పిచ్చి హృదయం

ఎందుకే నవ్వుతావు మనసా నీ పిచ్చి ప్రేమ హృదయం నుంచి తలకి ఎక్కిందా?
తునగలేదు పగలను లేదు ఒక చిన్న సంద్రమే పుట్టుకొచ్చింది,
అందుకే నవ్వుతున్నావేమో ప్రేమ పోలేదు సరికదా మితిమీరుతోందిగా...

Oh dear heart, why do you laugh? Has the madness shifted from your heart to head? Nothing has shattered, but a tiny sea has emerged.Love is not fading, instead, it grows with ardor. This is why you burst into laughter, a merriment forever..

💔

సంద్రం కలిగిన తీరు ఇదేనేమో

సంద్రం కలిగిన తీరు ఇదేనేమో,
నేల మనసులో నింగి కలిగించిన విరహానికి,
తల్లడిల్లి తన మనసు కరిగిపోయి ఆటు పొట్లు కలిగాయేమో,
నింగిని తను చూస్తునంతకాలం అలలు ఆగిపోవడం జరగదేమో....

Maybe this is the way the ocean was created? The heavy feelings that the sky created in the heart of the earth caused it to melt and resulted in everlasting tides. Until the sea reaches the sky, the tides will never stop..

💜💜
నావికుడి ధైర్యం సముద్రం యొక్క లోతు, ఓడ యొక్క బలం మరియు గమ్యం యొక్క దూరానికి సరిపోలాలి; లేకుంటే, అతను అలల మీద పొరపాట్లు చేసి చివరికి చేరుకోలేడు. నిజమైన ప్రేమికుడివి కావాలనుకుంటే, అటువంటి ధైర్యసాహసాలు కలిగిన నావికుడిగా ఉండు. 

The bravery of a sailor should match the depth of the ocean, the strength of the ship, and the distance of the destination; otherwise, he may stumble upon waves and fail to reach the end. If you want to be a true lover, be a sailor who possesses such bravery

💜💜
కలలు గాజు మేడలు,
కనులు తెరిస్తే ముక్కలు చెక్కలు,
నువ్వు మండుటెండవు,
వాటికి తగిలితే మిలమిలలు,
కానీ కలే లేక నీ వేడి తగలక,
మోటుబారే నా ఎదురుచూపులు..

Dreams are like glass buildings; they shatter when the eyes are open. You are like a bright sun, and when your rays fall on those shattered pieces, they can still shine a lot. But without your bright presence or dreams, my wishes are drying up.

💜💜

పడని కొండ చరియలు

ఎంతటి గాలి వీచినా పడని కొండ చరియలు నీ సొంతం...

No matter how strong the wind's speed is, you own the cliff that never falls down...

పూలు పారిపొవు నదులు వలసపోవు

మండుతున్న ఎండలకు భయపడి పూలు పారిపోవు,
గడ్డకట్టే చలికి ఉండలేక నదులు వలసపోవు, సహనంతో వేచి ఉంటాయి ఎందుకంటే
వాటికి తెలుసు మారే వాతావరణం కొత్త మెరుపులు తీసుకొస్తుందని,
ఓ సఖి నేను అదే సహనంతో వేచి ఉన్నాను,
ఎందుకంటే మన ప్రేమ గొప్పది,
ప్రతి అడ్డంకిని దాటి మళ్ళీ చిగురిస్తుంది...

Amidst the scorching sun, flowers don't run away,
And freezing winters won't make rivers migrate,
They wait and endure, for they know,
That the changing climate will bring a new glow.
So, my love, I too shall wait,
For our bond, I know, is true and great,
Our love shall survive, through every test,
And in the end, we'll thrive, at our best..

💜💜

విరహపు కలుగు

 నా విరహాన్ని సంద్రంలో నింపి,
తోకచుక్కని వత్తిలా ఉండమని వేడుకొని,
వెలిగిస్తా అఖండ దీపాన్ని,
నువ్వు చూడకున్నా నీ కనులను చేరుతుంది ఆ వెలుగు,
నీకు తెలియకనే నీకు తెలుస్తుంది నాలోని విరహపు కలుగు.... 

I want to fill the ocean with the emptiness in my heart,
I'll request the comet to become a wick and light a lamp so bright that your eyes will notice it without a peep,
and you'll understand how much void I'm feeling.


💜💜

నేరేడు పళ్ళు బాణం విసిరే కళ్లు

నేరేడు పళ్ళు బాణం వేయటం ఎప్పుడైనా చూసారా? తన కళ్లని చూస్తే అర్ధమవుతుంది..

Have you ever seen glistening grapes shooting arrows? It's unusual but I witnessed it, you wonder how? Look into her eyes then you will realize..

💜💜

పడవను కట్టే దారము

పడవను ఒడ్డున ఉంచే దారంలా నిన్ను నా హృదయానికి కట్టనివ్వు, ఇద్దరము కలిసి ఎగసిపడే ఆ అలలను ఆస్వాదిస్తాము , కానీ నువ్వు వెళ్ళిపోతే నన్ను ఎవ్వరు పట్టించుకోరు, దూరమౌతూ మాయమౌతుంటే నువ్వు గాలికి ఊగుతూ వేలాడుతున్న దారంలా మిగిలిపోవాలి నేను.. 

Let me be the cord that holds you tight to my heart like the thread ties the boat to the shore. Together, we'll watch the waves reach the land. But when you leave, I'll be cast away, For none will care to make me stay, Like the thread that's left to dangle and sway, As the boat drifts afar and fades away..

💜💜

దూరం లేకుంటే వృదా

చీకటికి కాంతికి దూరం లేకుంటే కిరణాల పయనం వృదా,
నింగికి నేలకు దూరం లేకుంటే చినుకు పయనం వృదా,
నీకు నాకు దూరం లేకుంటే ఈ విరహ వేదన వృదా,
ప్రేమకన్నా విరహమే చల్లగా ఉందనిపిస్తోంది ప్రతి నిమిషం నీతో నా ఆలోచన నిండిపోతోంది...

If there is no distance between darkness and light, the journey of rays is wasted.
If there is no distance from the ground to the sky, the journey of the raindrop is wasted.
If you are not far from me, this sweet pain of separation is wasted.
It seems that estrangement is cooler than love because every minute my thoughts are filled with you...

💜💜

మితం సమ్మతం

జలపాతం కింద పెరగదు ఏ చెట్టు,
కానీ దాని వాగే చెట్టుకు స్నేహమౌతుంది,
కొన్ని సార్లు ఎక్కువ ప్రేమ కూడా సాయపడదు, దాన్ని మితంగా చూపితే అల్లుకుంటుంది..

Trees won't grow under waterfalls, but the same water with controlled flow can nurture them. Sometimes, the more care given, the more damage is done, the required care given the love nourishes...

💜💜

గుండెకు మట్టి

సాధారణంగా పాదాలకు దుమ్ము అంటుకుంటుంది, కానీ నీ ప్రేమతో బరువెక్కిన నా గుండె పట్టు లేకుండా పడిపోయి మట్టి అంటించుకుంది..

Usually, feet catch dust, but now my heart has caught the dust, as it has become heavy with your love and fallen down without any hold..

💜💜 

పెంకు పగలాలి

గింజపై పెంకు పగలందే అది రుచిని అందించలేదు..

To give you the taste, the nut shell has to break..

💜💜

గాలి ఇరుకున పడితేనే రాగం

వీచే గాలిలో లాలన ఉన్నా రాగం ఎక్కడ ఉంటుంది,
గాలి ఇరుకున పడి పోరాటం చేస్తేనే రాగం పలుకుతుంది...

Melodies don't float in open skies,
Air must squeeze and struggle to harmonize...

💜💜

ధైర్యం పొరపాటును ఎదుర్కొన్నప్పుడు

ధైర్యం పొరపాటును ఎదుర్కొన్నప్పుడు పైకిరవడానికి ఒక అవకాశం వస్తుంది అంతేకాని దుఃఖించడానికి కాదు...

When courage meets mistake, a chance is born,
To learn and grow, and not to mourn...

💜💜

జిడ్డు బంధం

బంధం ఎంత సులువుగా ఉంటుందో అది మరింత జారిపోతూ ఉంటుంది, 
ఎందుకంటే జిడ్డుగల చేతులు ఎటువంటి తేలికపాటి వస్తువులను కూడా ఎక్కువసేపు పట్టుకొలేవు. కొంత బాధ, కొంత పోరాటం, కొంత సర్దుబాటు దాన్ని శాశ్వతంగా ఉండేలా చేస్తుంది...

With a touch too soft, the bond does slip,
Like an oily palm that cannot grip.
A dash of pain, a hint of strife,
Can hold it true, for all of life...

💜💜

సంకెళ్లుకు విడుదల

సంకెళ్లు నా నుంచి విడుదల కోరుతుంటే పట్టు వదలటం తప్ప ఇంకేమీ చేయగలను?

As the shackle pleads for freedom from my grasp,
What choice have I, but to relinquish the clasp?

💔

అలక

ఎంత వేడుకున్నా అలక మానకుంటే ఎలా, చెమ్మ తగిలినా తడవని పత్తిలా ఉన్నావు నిన్ను వేడుకునేదెలా, వేడుకోవడం మాని, నా కంటిని తడిపే సమయం వచ్చిందేమో ఇక...

Despite my earnest pleading, 
you refuse to relinquish your stubbornness. You are akin to cotton that repels water. 
How can I possibly sway you? 
Perhaps it's time for my tears to flow freely...

💜💜

చుక్కలన్ని అమ్మలక్కలై

చుక్కలన్ని అమ్మలక్కలై నీ గురించే మాట్లాడుకుంటున్నాయి ఎవరీ కొత్త జాబిలమ్మ అని, అసలైన జాబిలి బ్రహ్మకు మొర పెట్టుకుంది తన స్థానానికి రాజీనామా చెయ్యనని...

All stars are gossiping about this new moon, and the existing moon is pleading with Lord Brahma not to be replaced with you.

💜💜

నువ్వు

తనకు తానుగా వెలిగే తారా జువ్వ నువ్వు, గజ్జ లేకుండా సవ్వడి చేయగల అందె నువ్వు, తాడు లేకుండా తిరిగే బొంగరం నువ్వు, జాబిలమ్మ చుట్టూ ఉన్న వెలుగు పించం నువ్వు...

వజ్రాన్ని చేరాలంటే

వజ్రాన్ని చేరాలంటే బొగ్గులోని నల్లటి పొరలన్నీ దాటి చూడాలి...

To find the diamond bright and true,
Through layers of coal, one must break through,
Tough and black, they block the way,
But the prize is worth the toil each day...

💜💜

ఇనుపగుండు బరువు ఎంతైతే ఏముంది

ఇనుపగుండు బరువు ఎంతైతే ఏముంది,
పత్తి మూటపై పడితే మూట అనుగుతుందేమో కానీ విరిగిపోదు,
నీ మాట పడ్డ నా మనసు అంతే,
మెత్తగా మాటను చూసుకుంటుంది కానీ మోటుబారి చీలిపొదు...

Weighty iron ball falls on cotton sack,
Pressured it may be, but won't crack,
No matter how heavy, it doesn't matter,
Cotton cushions the fall, soft as a feather.

💜💜

కోతికి తెలుసు

కోతి చెట్టుపై పిచ్చిగా దూకడం ఆపకపోవచ్చు, కానీ ఏ కొమ్మ దాని అల్లరిని ఉల్లాసాన్ని భరించగలదో ఖచ్చితంగా తెలుసు..

Monkey may not stop jumping madly on a tree, but it is sure about which branch can bear its mischief and playfulness..

💜💜

నువ్వొక పరిపూర్ణ చిత్రం

నువ్వొక పరిపూర్ణ చిత్రం, సృజనకు తావెక్కడుందో వాటికంతా నువ్వే మూలం ...

You are picture perfect, You are a worthy source of inspiration in any creative space...

💜💜

కోరికలు ఉన్నాయి కానీ అంచనాలు లేవు

నువ్వు నా దేవతవి కాబట్టి నాకు కోరికలు ఉన్నాయి కానీ అంచనాలు లేవు, 
కోరికలు ఫలించినా, 
ఫలించకున్నా నా దేవత నీవే....

You are my goddess so I have wishes but not expectations,
Whether wishes come true or not you are still my goddess...

💜💜

ఎన్ని రంగులో నీలో

ప్రతి సూర్య కిరణం ఒకొక్క రంగులో ఉంటే ఉదయం ఎంత అద్భుతంగా ఉంటుందో, నిన్ను చూస్తుంటే నా కనులు అన్ని రంగులతో నిండిపోయాయి...

You filled my eyes with many colors like a heavinly sun having each ray in a unique color filling this world...

💜💜

వదులుకోలేను

బైట ఉన్న నా చర్మాన్నే వదులుకోలేను. అంతకన్నా లోతుగా ఉన్న నా హృదయాన్ని అందులోని నిన్ను ఎలా వదులుకోను?

I cannot shed my skin. How can I shed my heart and you in it, which are even deeper?

💜💜

తార్కిక ఖచ్చితత్వం కూడా సరిపోదు

నీ అందం లోతును ఆకర్షణను అర్థం చేసుకోవడానికి గణితశాస్త్రం యొక్క తార్కిక ఖచ్చితత్వం కూడా సరిపోదు..

even the logical precision of mathematics is insufficient to comprehend the depth and allure of your beauty...

💜💜

అలసట ఒక భయపెట్టే కల

అలసట అనేది ఆఖరి మజిలీ కాదు,
నీ గమ్యాన్ని మరింత తియ్యగా చేస్తూ భయపెట్టగల కల లాంటిది..

Getting tired is not the last resort. It's like a dream that can scare you, making your destination sweeter..

💜💜

దాగున్న నిజం

సూర్యకాంతికై ఎదురుచూసే నిద్రాణమైన విత్తనంలా నిజం ఒక్కోసారి కప్పబడి ఉంటుంది, వేకువ కిరణం తగిలినంతలో చిగురిస్తూ అద్భుతాలు ఊపిరిపోసుకుని వెలిగిపోతుంది....

Like a dormant seed awaiting the sunshine,
Truth lies hidden, shrouded in disdain,
Yet in the glow of the morning sun,
Its radiance shines bright, its beauty won...

💜💜

ఓలలాడే చిన్న పిల్లాడిని




నీ కథలతో ఓలలాడే చిన్న పిల్లాడిని నేను కానీ ఇప్పుడు ఆ కథలను నేనే రాసుకుంటున్నాను....

I was a small child who used to enjoy your stories but now I am penning those stories myself with the love you filled....

💜💜

రాతి హృదయం




నా హృదయం రాయిలాంటిది,
చిన్నపిల్లాడిలా సరదాగా తంతూ ఆడుకో,
నువ్వు ఉండగలిగేలా ఇంటిని కట్టుకో,
నీకు నచ్చినట్టు శిల్పిలా అందంగా మలుచుకో,
దానితో ఏమి చేయాలన్నా ఆ హక్కు నీ ఒక్కదానిదే...

My heart is akin to a stone,
Kick it playfully like a child,
Build a home with it where you can live,
Carve it like an artisan as you like, 
only you have the right to do anything with it...

💜💜

అమాయకపు జాబిలి



నిన్ను వెతికే మేఘం నేను,
వచ్చి నా వెనుకే దాగుతున్నావు,
ఎంత అమాయకురాలివి నువ్వు...

oh my innocent moon,
I am the cloud in search of you, 
but you are hiding behind me, unaware of my swoon..

💜💜

గడ్డి




గడ్డి మంచును ఆస్వాదిస్తుంది, వరదలకు వంగుతుంది, నలిగినప్పుడు చనిపోతుంది, కానీ అది లోతుగా పాతుకుపోయిన భూమిని తనకు తానుగా ఎప్పటికీ వదులుకోదు.

The grass enjoys the dew, bends during floods, and dies when crushed, but it never gives up on the earth to which it is deeply rooted by itself..

💜💜

క్షణికమైన వాన చినుకు కాదు

నీ ప్రేమ క్షణికమైన వాన చినుకు కాదు, అది అరుదుగా పడే గ్రహశకలంలా బలంగా ఢీకొడుతుంది, ఒక్కసారి పడితే తిరిగి పోదు, దాని ప్రభావం జీవితాంతం ఉండిపోతుంది చరిత్రలో నిలిచిపోతుంది....

Your love is not a raindrop fleeting,But it hits hard like a rare asteroid, Once it falls, its impact endures, Etched in history, forevermore...

💜💜

మోసం

తననే అందంగా మలిచానని దేవుడు ఇచ్చిన మాటకు పొంగిపోయేలోపే నిన్ను చూసి మోసమని తెలుసుకుంది ఆ జాబిలమ్మ ...

As the moon basked in the glow of God's promise that it was the most beautiful creation, her radiance paled in comparison to the sight of you, and she came to the heartbreaking realization that the promise was untrue.

💜💜

బంగారు వజ్రం

శక్తివంతమైన వజ్రం మట్టుకే బంగారు విలువను పెంచగలదు,బంగారం మట్టుకే ఆ వజ్రానికి అందమైన స్థానం ఇవ్వగలదు,అదేవిధంగా నువ్వు నా వజ్రానివి నేను నీ బంగారాన్ని..
 
The mightiest diamond lends gold its grace, While gold provides its beauty a perfect place.So too, my love, you are my precious gem,And I the gold that you adorn with them.

💜💜

నీది ఉత్తమమైన నిర్ణయమే

నువ్వు తీసుకున్న నిర్ణయాలలో నేను నీచమైన నిర్ణయంగా నిలిచిపోను,
నీ నిర్ణయం ఏదైనా ఉత్తమంగానే ఉంటుంది,
అందుకే నన్ను నేను ఉత్తమంగా మార్చుకుంటాను....

I cannot be the worst choice or decision of yours. What you choose is always the best, so I will strive to make myself the best.

💜💜

ఆనందంగా ఉండటం ఒక సాహసం

అందంగా ఉండటం సహజం,
ఆనందంగా ఉండటం ఒక సాహసం...

💜💜

ఆలస్యమెందుకు

ఆలస్యమెందుకు కనులు తెరిచినంతలో వెలుగు తాకదా,
నిన్ను చుసినంతలో తడి మనసు తేలిపొదా...

The instant eyes unseal, 
light floods in haste, likewise my sodden heart soars upon glimpsing your face..

💜💜

ముత్యాన్నికంటే సముద్రాన్ని ఎక్కువ ఇష్టపడతావు

It's foolish to ask the ocean to give way so you can pick up pearls. Instead, learn how to dive, and you will enjoy the ocean more than the pearl within it.

ముత్యం కోసం సముద్రాన్ని దారి అడగడం ఎంత మూర్కత్వం,
బదులుగా ఈత నేర్చుకో అప్పుడు ముత్యాన్నికంటే సముద్రాన్ని ఎక్కువ ఇష్టపడతావు...

💜💜

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...