భావోద్వేగం

భావోద్వేగంలో ఉన్న అందం ఏంటంటే అది ప్రతి పరిస్థితిలోను జీవం పోసుకుంటుంది...

the beauty of an emotion is that it thrives in every situation...

💜💜

జిగురు కూడా నిలవని సోగసు

వేకువకంటే వెలుగు చిందిస్తూ,
జిగురు కూడా నిలవని సోగసుతోటి,
వయ్యారాలు ఉబికే ఊటలా ఉన్న, 
శీతల శిల్పమా అందాల శిఖరమా,
నిన్ను చూసి వర్ణించడం మాని ప్రేమించడం మొదలుపెట్టానే....

You outshine the dawn's first light,
smoother than silk that no glue can smite,
Beauty springs forth from your being,
An icy masterpiece, truly stunning,
When I saw you, I forgot writing and started loving..

💜💜

కన్నీటి పంట

కన్నీటితో పండించగల విత్తనం ఉంటె,
వేల మూటల పండించగలనేమో...

If there is a seed that can be harvested with tears, maybe I can harvest thousands of bales...

💜💜

చెడిపోయినా విలువే

పాలు చెడిపోయినా జున్నులా మారుతుందిగా, పాలకన్నా జున్ను మరింత విలువేగా, 
నీతో ఉంటే నేను అలానే చెడిపోతాను మరింత విలువలు పోగుచేసుకొని మారిపోతాను...

I get spoiled when with you, 
like spoiled milk becoming cheese, 
but more worthy..

💜💜

మాటలు రాని పండు

మాటలు రాని పండు తన రుచులను ఇచ్చి ప్రేమను తెలుపుతుంది, కానీ తనకు మాటలొస్తే బాగుంటుందని అనిపిస్తోంది...

Though the fruit remains silent on matters of affection, its sweetness when savored by my lips is an eternal declaration of its love for me,
But still I wish it can talk to me...

💜💜

విడదీయలేని బంధం

వజ్రం నుండి తన ప్రకాశాన్ని విడతీసేంత బలంగా విధి ఉననప్పటికీ, నా నుంచి నీ ప్రేమను విడదీయటం ఆ విధికి సాధ్యం కాదు...

Though fate may be strong, pulling diamond's shine away,
Love within me, forever will stay.
No fate can rip us apart,
This love in my heart, it shall never depart...

💜💜

సరదా

when the intentions are pure whatever you do is fun..

 ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉన్నప్పుడు మీరు ఏమి చేసినా సరదాగా ఉంటుంది...

💜💜

రవ్వంత చీకటి

రవ్వంత వెలుగు లేనిదే అందమైన చీకటి ఆకాశం నీటిలో ప్రతిబింబించదు,
నాలో దాగిన అద్భుతాన్ని చూడాలంటే నీతోడు ఉండాలి..

In the still of night, the sky so vast,
Its beauty awe-inspiring, unsurpassed,
Yet in the water's reflection, light must be cast,To reveal the heavens' glory, unsurpassed.And as I search within, my soul laid bare,To find the beauty that lies hidden there,It is your company, your love and care,
That reveals my true self, pure and rare.
💜💜

ఎన్నో రకాల పండ్ల చెట్టు

My love, you're a tree so fair, With moods that shift with seasons in the air, Each one unique, just like the fruits you bear, And with each change, my heart's left in a snare.

In spring, you're like the blossoms bright,
Your joyous laughter fills me with delight,
And as the summer sun warms your sight,
Your love is like a fruit so sweet and right.

But autumn comes, and so does change,
Your mood swings bring my heart within range, Of love that's tested, but never estranged, For even in winter, your heart's fire remains.

So let the seasons come and go, For I'll love you more than you could know,Your every mood is like a seed that grows,Into a love that forever flows.

💜💜

మల్లె తీగ తామర తూడు అయితే

మల్లె తీగ తామర తూడు అయితే,
అది వింతనో కాదో కానీ కనులకు అందమైనదే..

💜💜

మండుతున్న రంగును కోల్పోతావు

ఓ నిప్పురవ్వ! నీటితో ఆడాలని ఆరాటపడకు,
నీటి కోసం నీ మండుతున్న రంగును కోల్పోతావు..

O dear spark! Don't yearn to plunge into the deep blue,
For in the waters, you may lose your fiery hue..

💜💜

నిజమైన ప్రేమ

నిజమైన ప్రేమతో నీ ప్రయత్నాలను నడపనివ్వు, నీ కంటే ఎక్కువగా నీ ప్రేమను ఉండనివ్వు, నీ హృదయంలో అభిరుచిని రేకెత్తించే కారణాన్ని కనుగొను, మరియు నీ ఆరంభానికి ఇది కారణం కావచ్చు...

Let your actions be driven by a love so true,
A love that encompasses more than just you,
Find a cause that ignites passion in your heart,
And let it be the reason for which you start...

💜💜

ఢీ

పత్తి గుట్టను ఢీకొనడం మంచి అనుభూతినిస్తుంది...

Crashing into a pile of cotton always feels good...

💜💜

రహస్య అభిమానం

రహస్యంగా నిన్ను కొనియాడటం చాలా బాధాకరం కానీ అది చాలా ప్రశాంతమైనది, నీ గురించి ఏదైనా రాయచ్చు నీకది తెలియనంతవరకు...

Secret admiration is painful but it's peaceful at least,
I can write anything about you as long as you don't know that it's about you...

💜💜

సాకులు

సాకులు అన్నవి వైఫల్యాన్ని వివరించే కవితా మార్గం....

Excuses are poetic way of explaining a failure....

💜💜

ఓహో ఎంత అందమో

ఓహో ఎంత అందమో నీ చిరునవ్వుతోటి నా చూపుల నదిని నింపుతున్నావు...

Oh how beautiful you are, filling the river of my gaze with your smile...

💜💜
కలలో కాలం ఆగిపోతుంటే, ఇలలో వేగం పెరిగిపోతుంటే, ఏలోకంలో నా నివాసమో తెలియక అటు ఇటు ఊగుతున్నా, నిత్యం రగిలే అగ్ని పర్వతంపై పడిన చినుకులా మరలా ఆవిరై మేఘాలను చేరిపోతున్నా, అంతు చిక్కని ఈ చక్రంలో చిక్కుకొనిపోతున్నా..

the time is slow in the dreams, and the time is too faster in reality, I am swaying between the worlds not knowing where my abode is, like a drop fell on a forever erupting volcano, evaporating again to reach the clouds, and getting stuck in an never ending cycle ..

💜💜

తల్లిలాంటి ప్రేమ

నీ ప్రేమలో తల్లి మమకారం లేనప్పుడు ఆ ప్రేమను మరచిపో, ఉంది అని తెలిస్తే ఇంకేమి ఆలోచించకు...

Forget the love you built if you can't feel like a mother, don't think about anything else if at all you can sense that ...

💜💜 

ప్రేమ గొప్పతనం

ప్రేమలోని అనేక దశలు మధ్య ఉన్న సాంగత్యమే దాన్ని గొప్పతనాన్ని వివరిస్తుంది..

the natural bonding between different states of your love decides the richness in the bonding..

💜💜

విచ్ఛిన్నం చేయవచ్చు కానీ

ప్రతి బంధాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు కాని విచ్ఛిన్నం అయ్యాక కూడా పెరుగుతుందా మారుతుందా అనేది ముఖ్యం..

Every relationship can be broken but what matters is whether it grows or changes even after it is broken..

💜💜

ప్రేమించలేదు అనడం సాధ్యమా?

మహా వృక్షమైన విత్తనాన్ని చూపించి నేను ఎన్నడూ దాన్ని ప్రేమించలేదు అనడం నేలకు సాధ్యమా? నాలో పొదిగిన పెరిగిన భావాలనడుగు నీ ప్రేమ ఎంతని 

the soil cannot deny the fact that it never cared the seed when it already become a tree and there is nothing else to sprout. Look at me and my grown feelings to understand how much you loved me...

💜💜

కొండ దిగువున పూల తోటకు ఎన్ని ముప్పులో


కొండ దిగువున పూల తోటకు ఎన్ని ముప్పులో, ఏ చరియ పడి వాటిని నలిపేస్తుందో, అయినా ఆ నీడలోని ప్రేమకోసం ఆ ముప్పును లెక్కచేయవు...

No matter how many threats to the flower garden at the foot of the hill, wouldn't know which cliff falls and crushes them, still that threat does not count for the love in Hill's shadow...

💜💜, ఏ చరియ పడి వాటిని నలిపేస్తుందో, అయినా ఆ నీడలోని ప్రేమకోసం ఆ ముప్పును లెక్కచేయవు...

No matter how many threats to the flower garden at the foot of the hill, wouldn't know which cliff falls and crushes them, still that threat does not count for the love in Hill's shadow...

💜💜

బుడగ

బుడగను పగలగొట్టే ఉద్దేశం లేకపోవచ్చు కానీ తాకితే పగిలిపోతుంది, కొన్నిటికి అదనంగా శ్రద్ధ వహించాలి అది ఎవ్వరు చెప్పరు, అంత సున్నితంగా ఉండలేకుంటే   దూరంగా ఉందిపోతు అది ఎగురుతుంటే ఆస్వాదించాలి...

You may not harm the bubble but you try to touch, it's gone,
Few things needs extra care and gentleness that no one tells you,
If you can't be as gentle as that bubble, stay far and enjoy it floating freely...

💜💜

వంద సంవత్సరాల జీవితమే నాది

వంద సంవత్సరాల జీవితమే నాది కానీ వేల సంవత్సరాల తరువాత నీతో ఎలా మాట్లాడగలిగానో అర్ధం కావట్లేదు...

I don't know how did I talk to you after thousands of years when I got life span of 100...

💜💜

కోలుకోకు

అనేక శారీరక మరియు మానసిక పోరాటాల నుండి కోలుకోవడం చాలా సులభం, కానీ జీవితాన్ని  ఇచ్చే హృదయ స్పందన దాని ప్రేమ నుండి కోలుకోవాలని ఎవరు కోరుకుంటారు? ఎవరైనా అలా కోరుకుంటే అది జీవితానికే వ్యతిరేకం మరియు నేను అందులోంచి కోలుకోవాలని అనుకోవట్లేదు...

It's easy to recover from many physical and mental struggles but who wishes to get recovered from a life sharing heart beat and it's love? It's not at all recovery if at all one does and I don't want to recover...

💜💜

నన్ను నేను వెంబడిస్తా

నువ్వు నన్ను వదిలిపోతే నన్ను నేను ప్రేమకోసం వెంబడిస్తా ఎందుకంటే నీ తరువాత నేను బాగా ప్రేమించేది నన్ను మాత్రమే...

In case you leave me I will chase myself for love because after you the next one I love the most is myself...

💜💔💜

ద్రావకం

నా హృదయాన్ని కరిగించగల ఏకైక ద్రావకం నీ మౌనం..

Your silence is the only solvent that melts my heart...

💜💜

వేచి ఉండాలి

మబ్బులని తొలగించి ఆకాశాన్ని చూడలేము, అవి తొలిగేదాకా వేచి ఉండాల్సిందే...

We can't move the clouds and look at sky,
We have to wait for the clouds to move..

💜💜

తిరస్కరణే ఉత్తమమైనది

కొన్నిసార్లు బలహీనపరిచే ప్రేమ కంటే గొప్పగా మార్చే తిరస్కరణే ఉత్తమమైనది,
నేను నీ నుంచి రెండింటినీ పొందుతునప్పుడు అది ఉత్తమమైన ప్రేమే కదా?

Sometimes rejection makes you the best than the love that makes you weak,
When I am getting both from you isn't it the best love?

💜💜

గెలిచి ఓడటం

నాతో నీ పోరాటంలో నువ్వే గెలుస్తావు కానీ నీలోని నాతో నువ్వు గెలుపొందలేవు...

No doubt you win over me everytime but you can't win over the love on me within you...

💜💜

మాట పలకని జాబిలి

ఒక్క మాట కూడా పలకని జాబిలిని పదే పదే చూసే నాకు,
ప్రేమ కురిపించి మౌనమైన నిన్ను పదే పదే తలచుకోకుండా ఎలా ఉండను...

I keep looking at the silent moon which never shared a word with me,
How can I not think of you after feeling your love though you become silent..

💜💜

విరహంలోను వివేకాన్ని వదలకూడ

విరహంలోను వివేకాన్ని వదలకూడదు,
వివేకం ఉన్నా ప్రేమను అంచనా వేయకూడదు..

Wisdom should not be left even in despair,
And love should not be judged even if one is wise...

💜💜

కనులలో నువ్వు ఉన్నంత కాలం కలతే లేదు

కలలు చెదిరే సంఘటనలు ఎన్ని జరిగినా కనులలో నువ్వు ఉన్నంత కాలం కలతే లేదు...

No matter how many dream shattering situations arise, they doesn't last as long as you are in my eyes...

💜💜

రాతి గుండనే కావచ్చు

నీది రాతి గుండనే కావచ్చు, కానీ నిన్ను చెక్కే ఉలిని కాను నేను, నీపై రాయగల సుద్దముక్కను, రాయించుకోవలసిందే కానీ నన్ను ఆపలేవు...

may be you are stone hearted, but I am not a chisel to carve you, I am a piece of chalk that can write on you smoothly, and you can't do anything about it except accepting it...

💜💜

ఎందుకు బ్రతికుండాలో తెలియదు

చెట్టు నీడన లేకున్నా చెట్టు గాలి పీల్చుకుంటున్నా,
నేను బ్రతికే ఉంటా అని తెలుసు కానీ,
ఎందుకు బ్రతికుండాలో తెలియదు...

I am no more in the shadow of tree but I can still breathe it's air,
I know I can stay alive but don't know why I am living..

💔

సాయంత్రం చీకటిలో కలిసినట్టు

సాయంత్రం చీకటిలో కలిసినట్టు కొన్ని తెలియకుండానే ఆగిపోతాయి,
అలా ఆగినా సరే మరుసటి ఉదయం వస్తుందనే నమ్మకంతో ఉండాలి...

Few things ends like the evening turning into night,
But the hope is it will again start with a bright morning....

💜💜

దాహం తీర్చే నేను ఆకలికి పనికిరాను...

దాహం తీర్చే నేను ఆకలికి పనికిరాను...

I am helpful to satisfy the thirst but not the hunger..

💜💜

హృదయాన్ని ముక్కలు చేసి

నా హృదయాన్ని ముక్కలు చేసి మళ్ళీ మళ్ళీ కట్టాను ఏదోక రోజు అది పెద్దది అవుతుందని నేనెంత మూర్ఖుడినో, కానీ విలాసవంతమైన నీ ప్రేమ అందులో ఎలా సరిపోయింది దాన్ని గొప్పగా ఎలా మార్చిందో తెలియట్లేదు...

How foolish I am to build the heart again and again by breaking it into pieces thinking I can make it big one day but I don't know how your huge love got fit into it and made it big...

💜💜

మహిళా దినోత్సవ శుభకాంక్షలు

काव्यानि नाम्नी शतशो वदन्ति विश्वस्थ पौरुषाणि वीराः । नारीणां त्वं श्रेष्ठा सखी जायासि विष्णोर्वीर्येण समर्पितास्मि ॥

నిశబ్ధాన్ని వినే అదృష్టం

నిన్ను ప్రేమించే అదృష్టమే అనుకున్నా కానీ నిశబ్ధాన్ని వినే అదృష్టం కూడా ఉందని తెలిసింది...

I thought I am lucky for your love but I am lucky to hear your silence too..

💜💜

ప్రేమ పరాక్రమం

శక్తివంతమైనది కొన్ని సార్లు నీచంగా కనిపించవచ్చు, కానీ ఒకనాటి పరాక్రమవంతలు యుద్ధంలో కొందరి తలలను నరికినవారే...

Mighty might seem mean at times, but once mightiest are the ones who beheaded many in war...

💜💜

నీ నిశబ్దం కంటే చీకటైనది ఏముండగల

నీ నిశబ్దం కంటే చీకటైనది ఏముండగలదు,
రాత్రి కూడా ఒడిపోదా నాతో పందెం కడితే..

Bet night can fail to prove that it is the darkest,
To me what can be darker than your silence...

💜💜

ప్రేమను చూపించడానికి అనేక మార్గాలు

ప్రేమను చూపించడానికి అనేక మార్గాలు కానీ అత్యుత్తమమైనది నిజాయతీగా ఉండటం అలా నడుచుకోవడం...

There are many ways to love but the finest is being and staying honest...

💜💜

ఆకాశం అనంతమని ఎవరు అన్నారు

ఆకాశం అనంతమని ఎవరు అన్నారు ?
నీతో మాట్లాడని మాటలన్నీ దానివైపు విసిరితే ,
కనీసం ఒక నక్షత్రాన్ని ఉంచగలిగే చోటైనా ఉంటుందా?

who said sky is unlimited?
can it even have a space to keep a star,
if I throw all the unspoken words with you towards it..

💜💜

అహో ఇంత అందమా

పొంగే పాల నురగకు తెలియకుండా జీవమిచ్చాడా?,
మరో బ్రహ్మతో పోటీ పడి ఎక్కువ అందాన్ని దిద్ధాడా? ,
లేక కొత్త రంగును నేల దించాడా?,
అహో ఇంత అందమా అందెలు వేసుకొని ఆడుతుంటే కలలోనున్న పాత్రలు కూడా నిన్నే చూస్తున్నాయి నిదుర లేచినా కూడా...

did god unknowingly gave life to milk foam?,
did he compete with another creator and applied more beauty to you?,
did he brought a new color to earth?,
oh, what a beauty even the characters in my dream keep looking at you even after I got up...

💜💜

నిన్ను ఆరాదించలేని వాడితో నిన్ను చూడలేను

నీకెన్ని కురులున్నవో లెక్కపెట్టే ఓపిక లేకుంటే వీడిపో వాడిని,
నీ అందాన్ని వర్ణించలేని సోమరి అయితే మరచిపో వాడిని,
నీ చిన్న కను సైగను విస్మరిస్తే వదిలిపో వాడిని,
చెలి నాకు ఈర్ష్య లేదు కానీ నిన్ను ఆరాదించలేని వాడితో నిన్ను చూడలేను...

If he doesn't have the patience to count how many hair strands you have, forget him.
leave the lazy man who cannot describe your beauty,
get away from him who ignores even a little eye movement,
dear, I'm not jealous but I can't see you with someone who can't adore you...

💜💜

కలిసి కలవని ప్రేమలో తెలిసి తెలియని తియ్యదనం ఉంటుంది

కరగదు మట్టి నీరు తగిలితే కానీ మనసు కరిగిపోదా ఆ ఆ కలయికలో పరిమళం తాకితే,
ఏమనాలో తెలియదు కానీ కలిసి కలవని ప్రేమలో తెలిసి తెలియని తియ్యదనం ఉంటుంది...

sand won't melt with rain water,
but the fragrance from it so special,
I don't know how to call it,
but there is unknown sweetness in the relationship which is lovable without love...

💜💜

ప్రాణం పోయావా తనకు?

ಅಂಧಕಾರವೊಂದೇ ನಿನ್ನ ನಿಜವಾದ ಸೌಂದರ್ಯವನ್ನು ತಿಳಿದಿದೆ, ಓ ಕನಸೇ, ನೀನು ಏಕೆ ಸ್ವಲ್ಪ ಕರುಣೆ ತೋರಬಾರದು? ನೀನೇ ದೇವರಾಗಿ ಮಾಡಿಕೊಂಡು ಅವಳಿಗೆ ಜೀವ ನೀಡಬಾರದೇ? केवल अंध...