విలువైన ప్రేమ

చినుకులు తగిలిన నేల మెరుగుపడుతుంది కానీ నేల నాణ్యత చూసి చినుకు పడదు, నీ ప్రేమ సోకి నా విలువ పెరిగిందే కానీ నా విలువ చూసి నువ్వు నన్ను ప్రేమించలేదు...

The quality of the land touched by raindrops improves. Otherwise, the raindrops won't consider the quality of the land they shower upon. Just as your love improved my life, but you didn't love me for something valuable in me...

💞

లెక్కలు నేర్చిన రాతిరి


ఈ రాత్రికి లెక్కలు బాగా వచ్చినట్టు ఉంది, భావాలను గుణించి మన మధ్య దూరాన్ని మరింత హెచ్చిస్తోంది...
I believe the night understands mathematics, as it multiplies the feelings and is dividing us by distance...

💞

నా చూపు నీ వైపు


చీకటిలో ఉన్నాను, ఎన్నో వెలుగు జిలుగులు నా చుట్టూ, కానీ చీకటి మట్టుకే నాకు కనిపిస్తోంది, ఎందుకంటే నా చూపుదూరంగా ఉన్న రాతిరి నింగి వైపు, వేచి ఉన్నా నీ వెలుగు కొరకు...

I find myself amidst numerous lights, but despite their glow, I am in the dark. My attention is fixed on the far night dark sky, eagerly anticipating the radiance of your light..

💞

వేప తేనె


వేపలోనూ తీపి ఉందని తేనెటీగకి తెలిసినట్టు, నీ కఠినమైన ఆలోచనలతో అల్లుకున్న మనసులోని ప్రేమ ఉందని నాకు తెలుసు..

Taste neem honey, so sweet and pure,
Like the bee, finding sweetness for sure.
From a plant that's tough, sweetness is an art,
Just like your tough thoughts, entwined with a love-filled heart...

💞

మిగతావన్నీ నీ హృదయంలా కనిపిస్తాయి అంతేకానీ సరి తూగవులే


కొన్నింటిని రూపంతో పోల్చి చూడలేము, తూకం వేయనిదే తెలియదు, ఈ లోకంలో నీ హృదయం పోలిన హృదయాలు ఎన్నో ఉండచ్చు కానీ నాపై ప్రేమతో నిండినది నీది మట్టుకే, మిగతావన్నీ నీ హృదయంలా కనిపిస్తాయి అంతేకానీ సరి తూగవులే..

Few things cannot be judged by appearance alone; they should be weighed to discern what is shallow and what is heavier. Dear, there are many hearts similar to the one you possess, but only yours is filled with love for me, and the rest are shaped like yours yet remain shallow..

💞

ఏమైందని అడుగుతాను



కొమ్మకు పండుకు వారధి కట్టింది ఎవరో,
భూమికి జాబిలిని కనిపించేలా పెట్టింది ఎవరో,
పరుగులు తీసే నదికి దారి చేసింది ఎవరో,
అతడే నీ ప్రేమను నాకు పరిచయం చేశాడు,
అతనినే అడుగుతాను ఆ సంగతి ఏమైందని....

The architect who built the bridge between branch and fruit, the orchestrator who arranged the moon's visibility from Earth, and the creator who crafted pathways for rivers to flow – this same individual introduced your love to me. I intend to inquire about the progress of it directly from him...

💞

ముందడుగే


ఎన్ని అడుగులు ముందుకేస్తే నీకు చేరువ అవుతానో తెలియదు కానీ ఒక్క వెనకడుగు వేస్తే చాలు నన్ను నేను కోల్పోతాను, అందుకే ఆ ఒక్క వెనకడుగు తప్ప నీకు చేరువ అవుతున్నందుకు మరిన్ని అడుగులు ముందుకే వేస్తాను... 

In the dance of our journey, the steps to reach you remain unknown. Yet, a single backward move is a risk to lose who I am. Thus, I embrace the joy of countless forward strides, guided by the fact of drawing closer...

💞



కోపంలో రోజా


కోపంలో ఉన్నప్పుడు నీ ముక్కుపై మొలిచే ముళ్ళతో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే కాసేపయ్యాక అందులోంచి రోజాలు కూడా పూస్తాయి కాబట్టి...

I'm okay with the thorns on your nose when anger flares; later, roses will bloom from that, a beauty so fair...

💞


ఓ నివాసిని నువ్వే మా సుహాసిని


గోరింట తిన్నదేమో మీ అమ్మ ,
పుట్టగానే పండించావు మా హృదయాలు,
విరజాజులు తేనెలో నిన్ను అద్దాడేమో ఆ బ్రహ్మ,
నీ నవ్వులే పూలకు పాఠాలు, 
తమ ఉద్యోగానికి భంగం అని నిన్ను భూమికి పంపేశాయేమో ఆ నింగి తారకలు,
ఓ నివాసిని నువ్వే మా సుహాసిని....

❣️

What is perfection?

If fluency is perfection you can't stand by the tunes of wind,
It should laugh at you,
If shaping right is perfection,
You can't stand by a plant,
It should make fun of you,
Perfection is just a metric not a quality of one,
Everything is perfect as long you know how to see it...

Small brain


I realized I have a small brain, carried away by intelligence, not knowing how to be resilient, carrying too many thoughts, which are of zero weight, thinking I know them, not knowing myself. What a joke this is all. So, I realized I have a small brain, but also realized that it can grow now to become a humble brain.

ఆకు పువ్వు

ఆకులు ఎంత కఠినమో పూలు అంత మృదువు, నీ ఆలోచనలు ఎంత తీవ్రమో నీ మనసు అంత అనువు,
పువ్వును కాపాడేందుకు పోషించేందుకు ఆకు కఠినంగా, మనసును భద్రపరచడానికి గాయాలను తప్పించడానికి ఆలోచన తీవ్రంగా ఉండాల్సిందే...

Leaves are tougher, not soft like flowers,
Your thoughts aren't always as sweet as heart showers.
But for safety and care, in a simple song,
It's the way it must be, steady and strong....

💞


హృదయం గాజుగోళం


నీ హృదయం బంధించిన గాజు గోళం,
ఆ గోళం లోనే ఉంది దాని తాళం,
పగలగొడితే తీయగలరు కానీ ఆ తాళం వ్యర్థం, నీకు నువ్వుగా నీ హృదయాన్ని ఇచ్చేంతవరకు అది కాదు ఏ మనసుకు ప్రేమ మకుటం...

Your heart is akin to a locked glass box with its key nestled within. None can open it without breaking it, and once broken, the key is powerless. Your love becomes no one's crown unless you unlock yourselves...

💞

పొగలేని అందం


సూర్యుడిలో నిజమైన అందం ఏంటంటే,
 పొగ లేకుండానే మండుతూ వెలుగు ఇస్తుంటాడు, ప్రియతమా నీ చిరునవ్వు లోని అందమూ అలాంటిదే, ఎవ్వరినీ మాయ చేయకుండా వెలుగునిస్తూ ఉంటుంది..

The allure of the sun lies in its smokeless radiance. Much like you, my dazzling star, you consistently radiate the beauty of a smile, never casting a shadow on anyone's vision...

💞

కొంటెతనపు సుడిగాలి


నీ కొంటెతనపు సుడిగాలిలో చిక్కుకున్న బుడగను కాను ఆ సుడిగాలికి తోడై దాన్ని తుఫానుగా మార్చగల పెనుగాలిని...

I'm not just a bubble caught in your mischievous whirl; I'm the fierce wind that joins in, turning it into a thunderous storm..

💞

కడలి ఒడిలో పువ్వు నా మదిలో నీ ప్రేమ


కడలి ఒడిలో పువ్వును ఏ నిప్పు దహించగలదు, ఆ కడలినే ఎండకాచితే తప్ప అది సాధ్యపడదు...

Which fire can burn the flower in the deep sea, it is possible only if the fire can dry up the sea...

💞

చూసుకుంటా దాచుకుంటూ



చేతులు అందవని ఊరుకున్నా లేకుంటే మబ్బులన్నీ తోసేసి నిన్ను చూసుకుంటా, అక్షరాలకు మోసం చేయలేక ఊరుకున్నా లేకుంటే అన్నింటినీ తీసేసి నీ పేరులోని అక్షరాలనే దాచుకుంటూ..

💞

I am not able to reach; otherwise, I would wipe away all the clouds to see you. I am not able to cheat the letters; otherwise, I would remove all the letters except the ones forming your name..

నీ ప్రేమకు లొంగటమే నాకు తెలిసింది


వెన్నెలకు పొంగితేనే కడలి, వెలుగుకు వంగితేనే సూర్యకాంతి,
ఎప్పుడైనా సరే నీ ప్రేమకు లొంగటమే నాకు తెలిసింది..

The sea is the one that enthralls at the caress of moonlight; the sunflower is the one that bends in the direction of light. Just like the nature of these, anytime, what I know is to surrender to your love...

💞

ఒక్క రోజు కూడా వాలకుండా ఉండదు



గడ్డిపై వేకువ మంచు బిందువులా, నా ప్రేమ క్షణికమైనా సరే, ఒక్క రోజు కూడా వాలకుండా ఉండదు...

Like dew drops on grass, my love, though fleeting, never skips a day...

💞

నీ ప్రేమను ఎలా పొందను


నీ అందాన్ని కాగితంపై బంధించడానికి కావలసిన కుంచె మరియు రంగులు ఎంత మహిమగలవై ఉండాలో ఊహించుకోవడమే కష్టం అంటే,
నీ సౌందర్యాన్ని ఎలా వర్ణించను!
నీ ప్రేమను ఎలా పొందను ప్రియతమా!..

It is difficult to even imagine how magical the brush and colors must be to capture your essence on the canvas. How can I go beyond and depict your beauty and win your love! My dear.

💞

కలలకు మరుజన్మ ఉంటే చాలు


నీతో మరుజన్మ అక్కర్లేదు,
 నీతో ఉన్నట్టు కన్న కలకు ప్రతి రేయిన మరుజన్మ ఉంటే చాలు...

I don't want to be reborn with you, but it's sufficient that the dream of you with me experiences a rebirth every night...

💞

నవ్వు


ఒట్టేసి చెబుతున్నా ప్రియతమా! నీకు సందేహం కలగచ్చేమో కానీ నీ నవ్వు చూసి పొంగే మనసులెన్నో లెక్కించడం ఆపేసేయి, ఎందుకంటే అవి లెక్కలేనన్ని, ఎవరికైతే ఊపిరి ఉన్నదో నీ నీడ తాకిందో వారందరూ ఆ లెక్కనే...

If you are wondering at all, you should stop counting the people whom you've made better with your smile, as that number will be countless. Everyone who breathes and is touched by your presence is included. I promise...

💞


సూర్యుడు కూడా చీకటిని చూడగలిగే సమయం


భావాలను పంచుకోడానికి రాత్రి తగిన సమయం, కానీ ప్రియతమా నీతో మాట కలిపిన క్షణం చుట్టూ ఏమి కనిపించదు. నీ మోములో జాబిలి ఉదయిస్తుంది, చీకటి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు, ఆ సమయమే ఆరని పున్నమి, ఆ సమయమే నాకు మేలుకొలుపు, ఆ సమయమే సూర్యుడు కూడా చీకటిని చూడగలిగే సమయం...

Night is the perfect time for emotions to flow, but, dear, anytime with you, the sky turns dark, the moon shines on your face, and the wait for the end of the day gets over right at the moment when you say hi. That's the night with a full moon forever; that's the night which wakes me up, that's the night which the sun can witness...

💞

గుమ్మడికాయ మనోభావం

గుమ్మడి కాయ తీగను పైకి అల్లాలి అనుకోవడం మూర్ఖత్వం ఎందుకంటే తీగ దాని బరువును మోయలేదు, విరిగిపోగలదు. అదే విధంగా మనోభావాల బరువు ఎక్కువైనప్పుడు అణకువతో భావాలను పదిలం చేసుకోవాలి అప్పుడే మన అడుగు ముందుకు సాగుతుంది లేకుంటే విరుగుతుంది...

If you expect the ash gourd vine to crawl up the pole, then it's foolishness as the vine can't hold it's weight and it may break. Just like that, when you can't lift the weight of your emotions, try to stay low so that emotions cherish, and you grow...

💞

పువ్వు నీడ


పువ్వు నీడ ఎవరికి సరిపోతుంది కానీ దాని పరిమళం జీవితాంతం గుర్తుండిపోతుంది, ఎక్కడో ఉండి వినిపించే నీ మాట నీడ నా మనసుకు సరిపోదు కానీ అందులోని ప్రేమ జీవితాంతం నాతోటే ఉండిపోతుంది...

The mere shadow of a flower may not suffice for someone, yet its fragrance lingers in their memory for a lifetime. Similarly, the distant echo of your words falls short for my emotions, but the enduring love within them remains eternally with me...

💞

ఎడారి ఓడ


ఎడారిలో ఓడను కట్టి దూరాలకు చేరుకోలేవు, పిచ్చి మనసా తనపై ప్రేమను చూపి ఏమీ సాధించలేవు...

You can't travel by building a ship in the desert; you can't achieve anything by merely expressing love to her...

💞

నీ దాగుడుమూతలు సాగుతూనే ఉంటాయి


ఓ నెలవంక నిన్ను పున్నమిలో చూశాను, అమావాస్యలో మాయం అవ్వడం చూశాను, ఇప్పుడు నువ్వు ఎంత కనిపిస్తున్నావు అన్నది ముఖ్యం కాదు, ఎందుకంటే నీ దాగుడుమూతలు సాగుతూనే ఉంటాయి...

Oh crescent moon, I've seen you full and watched you fade away. It doesn't matter how much you show now, your cycle just keeps going...

💞

సగం మట్టుకే తూగాయు


నీ ప్రేమ తాకిన తరువాత ఇదివరకు నేను ఏదీ పూర్తిగా ఆస్వాదించలేదు, సగం మట్టుకే తూగాయి నా అనుభవాలన్నీ అని అర్థమైంది...

When touched by the grace of your love, it felt as if everything I had enjoyed until now weighed only half as much, and it only feels complete with you.


💞

పిచ్చి ప్రేమ


మసి పూసి ఆకాశాన్ని నల్లగా చేశా,దానిపై పాల చుక్కలు చల్లి తారకలను రప్పించేసా, ఎంత త్వరగా చీకటి పడితే అంత త్వరగా వస్తావని! అయినా ఓ వెన్నెల నన్ను పిచ్చోడిని అనుకోకు, నీ ప్రేమలో పడ్డ నాకు ఏది పిచ్చిగా అనిపించట్లేదు...

I took some ash and blackened the sky, sprinkled drops of milk on it, and created the stars. The sooner it gets dark, I wished, the sooner you will come. But don't think I'm mad, oh moon; being crazy is normal after falling in love with you...

💞

ఆలోచనల నుంచి ఉబికే జలపాతమే నీ కురులు


ఆలోచనల నుంచి ఉబికే జలపాతమే నీ కురులు, వాటివలే అందంగా ఉన్నాయి, ఇది చాలదా చెప్పడానికి భావములోను బాహ్యములోనూ నీ అందం అనిర్వచనీయం..

Your hair, being the waterfall of your thoughts, is inherently beautiful, reflecting your inner and outer beauty.

💞

ముల్లును కాక పువ్వునై


నీ కాలికి ముల్ల తొడుగునై నీతోనే ఉండి బాధ పెట్టడం కన్నా, దూరంగా ఉన్న ఒక పువ్వునై, ఎదురుచూస్తూ వాలిపోయి నీ తోటలో మరుజన్మకై తపిస్తుంటాను...

I would rather be a distant flower, hoping to flourish in your garden after falling, than be a thorned shoe and be with you always...

💞

నీడ చాలు


మేఘాలు తమ ఉనికిని పంచుకోవడానికి భూమిపై వర్షం కురిపించాల్సిన అవసరం లేదు. మేఘం ఎక్కడ ఉందో దాని నీడ ద్వారా భూమికి తెలుసు..

Clouds don't need to shed rain on Earth to share their presence. Earth knows where the cloud is by its shadow..

💞

సంధ్య నీడ


సంధ్య వేళకు కదిలే నీడ ఉంటే అది నీలా ఉంటుందేమో, అది ఆకాశాన్ని వెలిగిస్తుంటే నువ్వు నా హృదయాన్ని వెలిగిస్తున్నావు...

You are the only wandering shadow of Twilight that lights up my heart when the Twilight is busy lighting up the sky...

💞

హరివిల్లుల ప్రపంచానికి రాణివి


చెలి! మోసపోకు! నిన్ను మనిషిగా చూస్తారు, నిజానికి నువ్వు హరివిల్లుల ప్రపంచానికి రాణివి...

Don't fool yourself, as others see you as a human being, but you are indeed a queen in the world of rainbows...

💞

నీకే అంకితం



ప్రతిరోజూ నదిలో చేరే నీరు
ఏనాడు సంద్రంలో చేరుతుందో తెలియదు., ప్రతిరోజూ మొలకెత్తే చిగురు. ఏనాడు మహా వృక్షమౌతుందో తెలియదు., 
కానీ ప్రతి క్షణం ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది.. చెలీ! నీ ప్రేమ ఎలా మొదలైందో ప్రతిక్షణం ఆరాటంతో పోరాటంతో ఇంతలా ఎలా పెరిగిందో తెలియదు ఈనాడు నాలో ఒక భాగమైంది నాలో భావాలన్నింటిని సొంతం చేసుకుంది నువ్విచ్చిన ఊతమే నేను నీకు అంకితం చేస్తున్నా..!

Every day, the water that flows in the river, we don't know where it joins the ocean. Every day, the sapling that sprouts, we don't know when it will become a mighty tree. But every moment, effort is being made, and this is how your love began. I don't know how it grew amidst constant struggles. Today, you are a part of me, you possess all my feelings and emotions. I am simply giving back the support you've provided by dedicating this small achievement.

💜🫶💜

నీ ప్రేమకై నా కృతజ్ఞతలు




జీవితంలోని క్షణాన్ని కచ్చితంగా చిత్రించడానికి దానిని ఆపక్కరలేదు, ప్రియతమా నువ్వు నా కోసం ఆగనక్కరలేదు, ప్రేమించనక్కరలేదు, మాయం అయిపోవచ్చు, వెలుగు వేగంతో కదులుతూ దూరం కావచ్చు, అయినా సరే నీ ప్రేమను పదిలపరచగలను, గుండెలపై చిత్రించగలను, నా ప్రేమ నా కనుపాపలో ఉంది అందులో ఎన్నో జ్ఞాపకాలు దాగున్నాయి, నా ప్రేమికవై ఉన్నందుకు నా కృతజ్ఞతలు...

The perfect snap of life is when you don't ask it to stop for capturing perfect frame, my dear you no need to stop for me, don't care for me, don't love me, keep moving keep moving, slow or steady or faster or with light speed or just vanish, I can still capture your love and preserve it in my heart, love is in my lens and it captured your memories forever, thanks for being my love.

💜🫶💜

ఊడిపడ్డ పిడుగు



ఊడిపడ్డ పిడుగు ఉరిమే చూపులతో కాకుండా ఊసులతో తాకితే నీలా ఉంటుంది,
నీది ఎదురు చూడని పరిచయం ఎదను తాకే అనుభవం,
కలవు కావని ఎంత చెప్పినా కలగట్లేదు నమ్మకం...

You are a thunderbolt struck with pleasant words instead of a fiery gaze. 
Your introduction is unexpected and a heart-touching experience. 
However much I convince myself, I still can't believe that you are real.

💜💜

నీలా ఉన్నది ఏదీ లేదు


నీ చిరునవ్వును ఇంకా మెరుగుపరిచే రహస్యం ఉంటే అది ఒట్టి బూటకమే, ఎవరైనా నీ నవ్వును పోలిన దానిని చేయగలము అని అంటే, వారు ఈ లోకానికి అందని ఊహల్లో జీవిస్తునట్టే..

If someone promises a secret to enhance your captivating smile, they clearly haven't seen yours. And if they suggest they can recreate your mischievous grin, they must be weaving elaborate fantasies beyond reality!

💜💜💜

పవిత్రమైన ఆలోచన


నాకై మెదిలే నీ ప్రతి ఆలోచన ఎంత పవిత్రమైనదో తెలుసా, దాని ముందు వాన చుక్క కూడా బురద చుక్కలా కనిపిస్తుంది..

Do you know how holy is your emotion for me, before which even a drop of rain looks like a blob of dirty mud..

💜💜💜

అర్థం చేసుకునేదే ప్రేమ


ప్రేమ అనేది మార్పును తెచ్చే గుణం కానక్కరలేదు, కానీ కచ్చితంగా అది మార్పును అర్థం చేసుకునే సంస్కృతి..

love is not necessarily a quality that brings change, but definitely a culture that understands change..

💜💜💜

నీ అందానికి సెలవులు ఉండవు


నీ అందానికి సెలవులు ఉండవు ,
నీ కొలమానాల్లో ఎటువంటి మార్పు రాదు,
జీవించటానికి నీ శ్వాస ఆపే గాలి తప్ప నీ రూపం గాలిని అడ్డుకోదు...

Your beauty knows no holidays, there's no change in your proprtions, your shape doesn't obstruct the flow of air, except for the little air you hold onto to live...

💜💜💜

ఎన్నేసి హృదయాలో అన్నేసి ప్రేమలు


ఎన్నేసి హృదయాలు ఉన్నాయి నీలో, అన్నేసి ప్రేమలను పొందాను నేను..

You have many hearts in you, I have gained many loves from them...

💜💜💜

బంగారు వజ్రం



బంగారంతో చేసిన వజ్రం చూడటానికి విలువైనదిగా విచిత్రంగా ఉన్నా అసలైన వజ్రానికి సరితూగదు...

A diamond made of gold though looks rich and different, it is no match for a real diamond..

💜💜💜

మేఘం రాసిన కన్నీటి కావ్యమే సంద్రం


రాసింది మేఘం తన బాధలన్నీ నేలపై, పొంగిందేమో సంద్రం ఆ బాధ రూపమై...

The cloud etched its sorrow onto the land, giving rise to the ocean...

💜💜💜



నిర్మలం నీ రూపం


నీటితో పాటు తేలియాడే ప్రతిబింభం కాదు నీ రూపం, కదలాడే నీటి అలలని కూడా ఆపి ఉంచగల నిర్మలమైన ప్రతిబింభం నీ రూపం...

Your reflection is not the one that moves along with the water waves; your reflection is the one that can calm down the moving waves of an ocean...

💜💜💜

పిచ్చి ప్రేమ



వెనక్కి తగ్గి దారి వదలదు ఏ సంద్రము, దరికి రావద్దు అని పదే పదే తోసిపుచ్చే అలల పదజాలము, అయినా సరే వెళ్లగలిగేది ఇద్దరే, ఈత తెలిసి ధైర్యం ఉన్నవాడు, పిచ్చి ప్రేమతో అందులోనే మునిగి ఈత నేర్చుకునేవాడు....

No shore gives you the way to come in; the waves always keep us at bay and tell us not to come in. But still, the only ones who can go are the brave ones who know how to swim, the ones who learn swimming by diving into it with crazy love..

💜💜💜

రూపం లేని ఊహల్లో రూపం ఉన్న నువ్వు



రూపం లేని ఊహల్లో రూపం ఉన్న నువ్వు విచిత్రం కాదా రక్తం ఓడుతున్న నా హృదయంలో రూపం లేని ప్రేమ కదలాడుతున్నట్టు...

Your reality seamlessly melds with my virtual imaginings, much like virtual love finds its place in the chambers of the real beating heart..

💜💜💜

రెప్పల వేగాన్ని నిర్ణయించేది నా హృదయమే


నా కనురెప్పలను చేసింది బ్రహ్మే కానీ నిన్ను చూస్తున్నప్పుడు ఆ రెప్పల వేగాన్ని నిర్ణయించేది నా హృదయమే...

The creator crafted my eyelids, but it's my heart that controls their pace as I look at you...

💜💜💜

ప్రేమగా మారిపోదా


నేల వదిలి సంద్రమైన ఆకాశాన చేరిపోదా నువ్వే మేఘం అయితే, రాయి రప్ప పువ్వు మొగ్గ తారలుగా మారిపోవా నువ్వే నింగి వైతే, తలపులు నిండిన నా హృదయం ప్రేమగా మారిపోదా నువ్వే ఎదురొస్తే...

If you become the cloud, then the oceans will fly to stay with you. If you become the sky, the flowers, buds, and stones will become stars in the sky. My heart, full of feelings, will turn into love when I face you...

💜💜💜

దారి తప్పిన సూరీడు


పొద్దుతిరుగుడు పువ్వు కూడా సూరీడు ఏడని వెతికింది తూరుపున, కానీ పడమరన ఉదయించాడు, దారితప్పి వచ్చావేంటి అని అడిగితే తెలిసింది, నిన్ను చూస్తూ సూరీడు తూరుపును మరిచాడు...

The sunflower, too, sought the sun in the east, only to find the sun ascending in the west. When questioned about this unexpected course, the sun replied, 'I forgot the east while gazing upon her...'

💜💜💜

నా హృదయంలో చోటు లేదు


సముద్రం తన నీటిని నదికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంటే? తను ఇచ్చిన నీరే అయినా నది దానిని దాచుకోలేదు. కొన్ని తిరిగి ఇవ్వకూడదు ఇవ్వలేము, కాబట్టి నా ప్రేమను తిరిగి ఇవ్వకు; దానిని దాచడానికి నా హృదయంలో చోటు లేదు...

What if the sea decided to give back its water to the rivers? Even if the water was given by the river, it cannot take it back. Some things should not be given back, so don't give back my love. I don't have a place to keep it..

💜💜💜

మత్తు

గంజాయి పొగతో నిండిన ప్రపంచంలో నన్ను విడిచిపెట్టినప్పటికీ మత్తు కలగదేమో, చెలి ఎందుకంటే, నీ ప్రేమ నీ అందం చూసిన నా మీద, ఏ మత్తు పని చేయదులే, వాటికంటే మత్తుగొలిపేది మరేదీ ఉండదులే...

Even if you were to leave me in a world consumed by the haze of weeds, I will remain untouched as nothing else can intoxicate me more than your love and beauty...

💜💜💜

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...