గుడ్డి నమ్మకం

కడలిని నమ్మి పడవ సాగదు,
పోటు ఎక్కువైతే మునగక తప్పదు,
నమ్మకం ఎప్పుడైనా వమ్ము కావచ్చు,
 అన్నిటికి సిద్ధపడితే ప్రయాణం సుగమం కావచ్చు,
నిజం గ్రహిస్తే మరో దారి ఉంటుంది లేకుంటే నీ గుడ్డి నమ్మకమే నీకు శత్రువౌతుంది...

తేలిపోతోంది

ఆగని ప్రవాహంలో ఎండుటాకు తేలిపోయినట్టు 
నను పట్టించుకోని నీ చూపుల ప్రవాహంలో నా ఎదురుచూపు తేలిపోతోంది...

శుభోదయం

వెచ్చని హృ(ఉ)దయానికి చల్లనిది నీ కబురు...

నీతో కలిగిన బంధం చూపుతోటి కాదేమో

ప్రతి ఉదయం వెలుగు తాకినా, సూర్యుడిని చూడాలని అనిపించదు, 
రోజు వస్తాడని చులకనేమో,
కానీ నీ కబురు అందినపుడల్లా, 
నిన్ను కలవాలని అనిపిస్తుంది,
నీతో కలిగిన బంధం చూపుతోటి కాదేమో...

ప్రకృతి

ప్రకృతి మారదు పరివర్తన చెందుతుంది,
సరికొత్తగా ఏది ఉండదు,
అది నీకు కొత్త అనుభవం అంతే...

సహజమైన అందాలు

 ఏ గంధం రాసుకొని వర్షపు గాలికి ఆ పరిమళం?

ఏ వెలుగు తాకి ఆ తారకు మెరుపు?

ఏ రంగు తాకి సంధ్యకు ఆ చందం?

సహజమైన అందాలు ఎన్నో అందులో నీది ఒక అందం

ప్రతిరోజు నీకు పుట్టినరోజే

నీ పరిచయం కలిగిన ప్రతి హృదయంలో నీ జ్ఞాపకం ఎప్పుడు పుడుతూనే ఉంటుంది,
ఈరోజే కాదు మేము తలచే ప్రతిరోజు నీకు పుట్టినరోజే...

కాలం ఇచ్చిన శాపం

కాలం తపస్సును భంగపరిచానేమో నాకు శాపం ఇచ్చింది, 
నానుంచి నిన్ను విడదీసింది, 
కానీ తనకి తెలియదు, 
తన శాపం కంటే గొప్పది నా ప్రేమని, 
నీకు చెప్పలేకపోయినా అది నాలో ఎప్పుడు ఉంటుందని..

స్వప్నం కాదు ఇది నిజం

నీలి చారల మేఘం, 
నిండు పున్నమి రూపం, 
మనిషి చెక్కని శిల్పం,
స్వప్నం కాదు ఇది నిజం...

నలుపే వెలుగు

నలుపే వెలుగౌతుందని తెలియదు నీ కనుల వెంటున్న కాటుక నలుపే ఈ చీకటికి వెలుగౌతుందని తెలియదు...

చేపను ప్రేమించి

నీటిలో బ్రతకలేనని తెలిసి, చేపను ప్రేమించి, అర్థం లేని పోరాటం చేస్తున్నా, నాకు నేను దూరం అవుతున్నా.. 💔