గుచ్చుకున్నా గుండెలో దాచుకుంటా

వెన్నలే తగిలినా కందిపోయే బుగ్గలు,
కానీ కొండనే కరిగించే పదునైన చూపులు,
నువ్వు సౌందర్యానివో లేక ఆయుధానివో,
ముళ్ళు పువ్వు కలిసిన రోజావో,
గుచ్చుకున్నా గుండెలో దాచుకుంటా,
వాడిపోనీకుండా కనుపాపలో ఉంచుకుంటా...
❤️💔

నీ సొగసు

జాబిలితో పాటు నువ్వూ పుట్టావేమో,
నిన్ను ఆ మెరుపుల మేఘం కన్నదేమో,
మరో లోకంలో నీ సౌందర్యానికి భావం ఉన్నదేమో,
ప్రతి చుక్క ధారపోసిన తళుకులు ఒక్క నీలో నిండెనేమో..

ఉప్పెన

ఒక్కసారిగా ఉప్పెనలా నువ్వు,
అందులో తడిసి మెరిసే తీరపు మట్టిలా నేను,
నాపై రాసుకున్నవన్నీ నీలో దాచుకుంటావు,
నీలో దాచుకున్నవి నాకై వదిలిపోతావు,
అందరికి కఠినంగా ఉప్పగా ఉండచ్చేమో నీ ప్రేమ,
కానీ నాకెప్పుడూ ఒక తియ్యని తాకిడే...
❤️

కలుగులో దూరిపోయింది

తన నిరీక్షణ మీ ఉదయంతో అంతం అవుతుందనే ఆశతో,
మీ మనసును మెప్పించలేని నా కవిత్వం కలుగులో దూరిపోయింది...

ప్రేమని చెప్పడం సాధ్యమా

ప్రేమకు ప్రేమని చెప్పడం సాధ్యమా,
ప్రేమకు రూపం ఇవ్వడం సాధ్యమా,
నా మనసును అమ్మగా చేసినా నీ ప్రేమను పుట్టించడం సాధ్యమా?
❤️

నీ శోభకు సాక్ష్యం లేదు

ఆ తెల్ల కాగితం చూసావా రంగులు అద్దుకోలేని అభాగ్యం తనది,
చిత్రకారుడుకి నీ అందం చూసి చూపు మరలలేదు,
ఆ బండని చూసావా శిల్పంగా మారలేని విధి తనది,
 నీ సొగసు చూసిన శిల్పికి చెయ్యి కదలలేదు,
అక్షరం లేని కవిత చూసావా,
నీ వయ్యారాన్ని వర్ణించడానికి కవికే భాష కరువైంది,
అందుకే ఎక్కడ వెతికినా నీ శోభకు సాక్ష్యం లేదు ఉండదు....

వెన్నెల

చప్పుడే లేకుంది, అయినా తెలిసిపోతుంది, నీ నవ్వు, పున్నమి లాంటిది, నీవైపు చూడకున్నా, ఆ వెన్నల నన్ను తాకుతూ ఉంటుంది... Silent yet I know, your ...