ఒక్క మాట

నీ ఒక్క మాట విలువెంతో నా మనసునడిగి చూడు..
దాచుకుంది తనలో తన ఏకాంతానికి అదే తోడు...

నువ్వే

కలల తెరకు నిప్పు పెట్టినా ఆ జ్వాలలో నువ్వే,
నిదుర ముసుగులో మునిగిపోయినా ఆ మత్తులో నువ్వే,
వెలుగును విసిరి పారేసినా ఆ చీకట్లో నువ్వే,
అందరు ఉన్నా నువ్వే ఎవ్వరు లేకున్నా నువ్వే.....
💔

జై జవాన్

మట్టిలో భీజం మొలకెత్తుతుందో ఏమో కాని,
నీ మనసునున్న భక్తి మహాతేజం అవుతుంది,
నీ గుండెకు శ్వాస ఉండదేమో,
నా దేశం అన్న నిస్వార్ధం చాలేమో,
 కిందనున్న జెండా ఎగురవేస్తే కాదు,
మా నోటినున్న భక్తి తలకెక్కిన రోజే నిజమైన స్వేచ్ఛరా,
వీరుడా నింగికేగరా,
🙏
జై జవాన్
జై హింద్

गर्मियों

कल रात आप शांत थे,
लेकिन आप सुबह गर्म थे,
अरे, क्या हुआ, आकाश?
तुम भी मेरी पत्नी की तरह हो,
वह एक लड़ाई से पहले एक संकेत देता है,
तो आप हमें गर्मियों की चेतावनी दे रहे हैं?

(Translation credits to google)

కన్నీటి బరువు

నా కన్నీటి బరువు పూరేకు మోసేంత,
నా మనసు బరువు నీ ప్రేమలో ఇమిడేంత,
కొంతనో ఎంతనో నాపై ప్రేమ ఉంటే చాలు,
మిగిలిన ప్రేమను పూరేకు పై మోపుతాను...

నవీన పోకడ

బంధాలు సాంకేతికమైతే భావాలు అక్షరాలకే పరిమితం అవుతాయి... 

కులం

నా తోలు రంగే నీకు సమస్య అయితే చీకటిలో నీ రంగేమిటో చూసుకో,
నా కులం నీకు సమస్య ఐతే ఆకలికి రగిలే నీ పొట్టని ఆపి చూసుకో,
బేధాలు అన్నవి విభేదించడానికి కాదు గౌరవించడానికి అర్థం చేసుకోవడానికి,
ఒకరికి దారి చూపలేని ఒకరికి సాయపడని కులం అగ్రకులం ఎలా అవుతుంది?
చూసుకో మరి నీది దారి తప్పిన కులమా లేక దారి చూపే కులమా....

అదిగో జాబిలి అందనంటోంది

వెంటాడే వెలుగు ఎంతో దూరమున్నా,
ఎందుకో ఆ భయం చెంత చేరకుండా,
ఎగసి పడే అలలు తాకలేవు,
తపించే మనసుకు దొరకవు,
ఎవ్వరికీ చిక్కకుండా,
చుక్కల్లో చిక్కుకొని,
అదిగో జాబిలి అందనంటోంది.....

నూతన సంవత్సర శుభాకాంక్షలు-౨౦౨౧

ఒక్క అడుగు ముందుకేసింది ౨౦౨౦,
అలాగే ఒక్క టీకా ముందుకొచ్చి,
ఆ ఒక్క క్రిమిని సంహరించి,
మన ఒక్క కష్టాన్ని తీర్చాలని కోరుకుంటూ,
నూతన సంవత్సర శుభాకాంక్షలు...

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...