మూఢనమ్మకం

పద్ధతులను ప్రశ్నించేవాడు తార్కికవాదే అయితే  దానిని వివరించలేని వారు పలాయనవాదులే,
స్పష్టత లేని ఏ నమ్మకం అయినా మూఢనమ్మకమే...

కలనా జ్ఞాపకమా

నీ కల కలిగే తరుణంలో నీ జ్ఞాపకం అడ్డొస్తే ఎలా?

ఎంత ప్రేమ

పదే పదే ప్రేమ పొందినా ఇంకా ఎంత ప్రేమ ఉందనే ప్రశ్నలే నా ఎదురు చూపులు నువ్వు పంపే చిరు కానుకాలే వాటికి సమాధానాలు...

బంధం

కొన్ని బంధాలను మనసు ఒప్పుకుంటుంది,
కానీ మనుషులు ఒప్పుకోరు,
కొన్ని బంధాలకు పేర్లు అక్కర్లేదు,
కానీ పేరు లేనిదే సమాజం ఒప్పుకోదు,
కొన్నిటికి కారణం ఉండదు,
కానీ ఆధారం కావాలంటారు,
కొందరి ఆదరణ కావాలనిపిస్తుంది,
కానీ ఆ ఆవేదనకు ఆమోదం ఉండదు,
ఇలా నలిపివేసిన ప్రతి సారి వాడిపోయినా,
పువ్వులా వెదజల్లుతాయి సువాసనలను...

ఆ సంతోషానికి పేరేంటి

ఏ చినుకు వాలని ఎదపై ఒక్క చినుకు జారకుండా నిలిచిపోతే ఆ సంతోషానికి పేరేంటి?

బంధాలు రకాలు

కొన్ని కనువిప్పు కలిగించే బంధాలు...
క్షణాలలో విరుగుతాయి
💔
కొన్ని కనులు వెతికే బంధాలు...
క్షణాలలో కలుగుతాయి
😍

ఆ కలలు ఉదయాన్ని చూడనప్పుడే

నీ పరిచయం కానంతవరకు కలలున్నా అందులో దేవత లేదు,
నీవే నా ప్రేమని తెలిసాక కలలదేవతగా మారావు,
మరిచే తరుణం అంటూ ఉంటే అది ఆ కలలు ఉదయాన్ని చూడనప్పుడే....
❤️

పుట్టినరోజు శుభాకాంక్షలు

ఎదురుపడి నీ ప్రేమను పొందలేను,
మనసుపడినా మనసువిప్పి మాట్లాడలేను,
కానీ నీ క్షేమం కోరే ఒక్కమాట,
చిరునవ్వును తెప్పించే ఒక్కమాట చెప్పగలను,
పుట్టినరోజు శుభాకాంక్షలు ... :)
 (ఒక్కరోజు ఆలస్యంగా)

ప్రేమజువ్వ

ప్రతి ఉదయం అంత వెలుగు ఎదురుపడుతున్నా,
చీకటిలో వెలిగి ఆరిపోయే తారాజువ్వలోని ఆనందం వేరు,
మది నింపిన ఆత్మీయుల  ప్రేమ ఎంతున్నా,
ఒక్క క్షణమైనా నీ ప్రేమ తాకిపోతే కలిగే హాయి వేరు...

నిన్ను కాక ఎవరిని తేగలను

నీ అందం గుర్తుకొస్తే జాబిలి వంక చూస్తా,
నీ చిలిపితనం గుర్తుకొస్తే ఊసులు చెప్పే చిరుగాలితో స్నేహం చేస్తా,
కానీ నిన్ను అందాలి అంటే,
 నిన్ను కాక ఎవరిని తేగలను?
ఏ బొమ్మకు ప్రాణం పోస్తే అది నీలా మారగలదు?

మారాలి

ఆవగింజ అందం తెలియాలంటే మరో ఆవగింజలా ఆలోచించాలి,
గుమ్మడికాయ మనసు గెలవాలంటే మరో గుమ్మడికాయలా మారాలి,
పువ్వు ప్రేమ గెలవాలంటే తన సువాసనలు చూడగల ముక్కులా ఉండాలి....

నా కళ్ళు నా మనసును వెక్కిరిస్తోంది

ఆగలేని అందం పువ్వు దాటితే,
దాగలేని తీపి తేనె పట్టు దాటితే,
ఉండలేక ముత్యం కడలి దాటితే,
బొమ్మ లోని సొగసు ప్రాణం పోసుకుంటే,
ఈ అద్భుతాలన్ని నీలో నేను చూస్తూ ఉంటే,
నీ అందం నా ప్రేమను చిన్నబుచ్చుతోంది,
నా కళ్ళు నా మనసును వెక్కిరిస్తోంది....

కర్మ

నీకు నువ్వు చేసుకునేదే కర్మ.

వందశాతం

త్యాగం లేనిదే ఏదైనా వందశాతం పూర్తికాదు...

నువ్వు నా మదిని తాకిన మకారందానివే

మంచు తునక ఆహ్లాదం, 
ఇప్పుడు నీటి బిందువై మెరుస్తోంది, 
పత్తి గుత్తిలా మెత్తని ముద్ద మందారం, 
సన్నజాజిలా అందాలు అద్దుకుంటోంది, 
వెలుగంత రూపం కౌగిలిస్తే వెచ్చగా, 
ఇప్పుడు అంత వెలుగు ఒక కిరణంలో ఇమిడిపోతోంది, 
కనిపించే పగటి నీడ, 
ఇప్పుడు సంధ్య వేళ నీడలా కనీ కనిపించక కవ్విస్తోంది, 
ఎంత ఆనందమో నీలో కానీ అదే అందం, 
ఎంత సొగసో నీలో పురివిప్పుకుంటోంది లేలేత భావం, 
నీ నవ్వుకు అభిమానులు, 
ఇప్పుడు ఆ నవ్వుకు తోడు నయగారాలు, 
అప్పుడు ఒక అందం ఇప్పుడు మరొక అందం, 
అంతే కాని ఎప్పుడు నువ్వు నా మదిని తాకిన మకారందానివే...

స్నేహం ఓడిపోదు

ఎన్ని చినుకులు ధారపోసినా నేల నింగినంటదు,
ఎంత ఆవిరిని కానుకిచ్చినా,
నింగి నేల చేరదు,
దూరం తొలగకున్నా,
వాటి స్నేహం ఓడిపోదు,
పలుకులే కానుకలై ఒకరికొకరం ఇచ్చుకుంటే,
పరవశించే ప్రకృతే మన చెలిమి కూడా!

నా ఇష్టం నువ్వేనని తెలుసా?

ఒక నాటి కల నిజమైనా,
ఈ నాటి నిజం దూరం అవుతుంటే,
ఆ నాటి పట్టలేని సంతోషం ఎంతో,
ఈనాడు ఆపలేని దుఃఖం అంతే,
నీ ఇష్టం అంటూ వదిలేసినా,
నా ఇష్టం నువ్వేనని తెలుసా?

పుట్టినరోజు శుభాకాంక్షలు ర

ప్రతి రోజు నీ జ్ఞాపకం ఉదయిస్తుంటే నీ స్నేహం నాతోటే నడిచేది,
ఆ ప్రతిరోజుకి ఇది తొలి రోజు,
ఆ ప్రతి జ్ఞాపకానికి ఇది తొలి రోజు,
నా చెలిమి రోజు నీ పుట్టినరోజు....

పుట్టినరోజు శుభాకాంక్షలు 😊

నీ స్నేహం

చిరునవ్వు చేజారి పోనీకు,
చిన్న ఆశ నాలో అది నీతోటే ఉండనివ్వు,
కలలు ఎక్కువైతే వదిలిపోనీకు,
కలలు రావు నాకు కాస్త అప్పు ఇప్పించు,
కన్నీళ్లు వస్తే నీ దోసిల్లలోనే ఉంచు,
అదీ నాలా ముత్యమౌతుంది నీ స్నేహం దానికి పంచు,
చదివి చదివి అలిసిపోయినా మళ్ళీ చదువు,
నా అక్షరానికి కాస్త విలువ పెంచు...

చంద్రమా రామ్మ!

అలసట లేని నీ అందానికి చందం ఎక్కువ తొందర కూడా ఎక్కువ....
బారెడు ఉంటుంది చూపు తగిలే కొద్ది జానెడు అవుతుంది....
చంద్రమా రామ్మ!

తపన

నీ ఒక్క మాటకై నా తపన ముత్యమయ్యే ఆ ఒక్క చినుకు బొట్టు లాంటిది...

కనులు తడిపే భావన

కనులు తడిపే భావన ఏదైనా మనసు హత్తుకున్నదే అవుతుంది...
🧡

ముద్దబంతి సింగారం

మల్లెపూల పందిరిలో మొగలి రెకుల సోయాగం,
సన్నజాజి పాన్పుపై,
ముద్దబంతి సింగారం....

కదలని సూర్యుడు ఎలా ఉదయిస్తాడు?

☀️
కదలని సూర్యుడు ఎలా ఉదయిస్తాడు?
ఏంచేత సూర్యోదయం అన్నారు?
🌝
చంద్రోదయం అనడం సబబుగానే ఉంది కాని ఈ సూర్యోదయమే ప్రశ్నగా మిగిలిపోతోంది!

నీతో

వెన్నలను నిదురతో...
వేకువను మెలకువతో...
నిన్ను ఊహలతో...
నీ ప్రేమను మనసుతో...
💞

గతం లోతు

గతం ఎంత లోతున్నా అందులో దూకలేవు...

కలగడం తప్ప కలవడం ఉండదు

చిగురాకుపై ప్రేమొచ్చినా చిరుగాలి ఆగదు....
ప్రేమ వెళ్లిపోతున్న తాకిడికి చిగురాకు ఆడక మానదు....
ఇరువురి దారులు వెరైతే ప్రేమ కలగడం తప్ప కలవడం ఉండదు....
💔

నీ కాగితం పైన నా అక్షరం అందం ఆనందం

కాగితంపై రాసుకున్నాను... 
పూల రేకులపై రాసుకున్నాను... 
ఎండుటాకులపై రాసుకున్నాను....
మనసులోను రాసుకున్నాను...
ఎక్కడ రాసినా లేని అనుభూతి ఇక్కడ చూస్తే కలుగుతోంది...
నీ కాగితం పైన నా అక్షరం అందం ఆనందం...

నిదురపుచ్చే కల

నిదురలో కలలు కన్నా కాని కలలే నిదురపుచ్చడం కొత్తగా ఉంది...

అందం అంటే?

నిన్ను నువ్వే చూసుకొంటూ,
ఇంకేది కంటపడకుంటే,
అందం అంటే ఏంటో చెప్పగలవా?
కళ్ళు ఉన్నా ఏది చూడలేవో అదే అందం,
మనసు ఉన్నా ఏది పొందలేవో అదే అందం,
కనిపిస్తేనే అందం అంటే ప్రతి రూపం అందమే,
ప్రేమిస్తేనే అందం అంటే ప్రతి మనసు అందమే...

చిలిపి చెక్కిళ్ళ

చిలిపి చెక్కిళ్ళ చిగురులలో విరిసే మొగ్గ పేరేంటో...
సిగ్గు అని నువ్వు చెప్పినా అది అందం అని నేను చెప్తున్నా...

వెతికా మునిగా

పాటలకు సరికొత్త భావాలు లేక నీ మాటలో వెతికా...
నా కూని రాగాన్ని సరిచేసే తాలానికై నీ ఎద లయాలో మునిగా...
💞

గాజులు సవ్వడి

గొంతులేని గాజులు సవ్వడి మట్టుకే చేయగలవు,
కానీ నీ చేత చిక్కితే అవి పాటలు కూడా పాడగలవు...

ఏ లోకపు దేవతవు

నీ చెరలో నా చరణం,
నిను తప్ప వేరే పలకనంది,
ప్రతి పల్లవి తన రాగాన్ని మరిచి,
నీ పేరు జపిస్తోంది,
శృతినే సొగసుగా దాచుకున్నావు,
ఏ అందానికి పుత్రికవు,
గగనమే నిను మరో జాబిలిగా కోరుకుంటోంది,
ఏ లోకపు దేవతవు....

మిణుగురలమై ఎగిరిపోదాము

నిను చేరే తరుణం కోసం,
ఈ తారల చెరలను వీడి,
నీ మదిపై వాలే కోరిక కలిగే నాకు,
నీ ఉదయం అమృతం,
సూర్యోదయం ఒక శాపం,
కనికరించి ఈ రేయి నిలిచిపోతే బాగుంటుంది,
నిను చూస్తూ నేను,
నను చూస్తూ నువ్వు,
చీకటిలో మిణుగురలమై ఎగిరిపోదాము...

వెన్నెలలో రూపసివో

పున్నమిలో పూర్ణిమవో,
వెన్నెలలో రూపసివో,
చీకటిలో చంద్రికవో,
చెలీ నీ అందం ఎంతనో,
చెలీ నీ సొగసే పొంగెనో......

నా మాటకు భావం నువ్వే చెలి

వల వెయ్యలేదు...
కల కనలేదు...
నీ అడుగుకు నీడను కాలేదు...
నీ జడ గాలానికి చేపను కాలేదు...
నీ చూపులకు తుమ్మెద కాలేదు...
అయినా అనుకోకుండా కలిగిన నీ పరిచయం...
ఆ అనుభవాలను కానుకనిచ్చాయి...
నా జీవన రాగం నా మాటకు భావం నువ్వే చెలి...

దాగిన అరవిందం

నిసి మసిలో సిగ్గు దాచి...
దాగిపోయినా...
చినుకు చినుకుపై అడుగులేస్తూ...
మెరుపు వెలుగులో నిన్ను వెతుకుతూ...
మేఘాలు దాటి చూసాను...
అదిగో దాగిన అరవిందం...

🌕

ఏమిటో

కొమ్మకు మట్టుకే పూలు పూస్తాయంటే నీ సొగసుకు పూచినదేమిటో...
తీగలు మట్టుకే అల్లుకుంటాయంటే నా మనసుకు అల్లినదేమిటో...

పుట్టిన రోజు

తెలుగు రాసిన అక్షరం,
వెలుగు పొదిగిన దరహాసం,
ఉప్పెనంతటి ప్రేమాను రాగం,
మీ జన్మదినం మాకు పండుగ సమయం....

ఎప్పుడు నవ్వుతూ ఎన్నెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా శుభాకాంక్షలు :)

రోజు ఇచ్చిన ఆస్తి

రోజు ఇచ్చిన ఆస్తిలో,
వెలుగు వాటా ఎక్కువ,
చీకటి వాటా తక్కువ,
ఎందుకంటే వెలుగులో ప్రాణం ఉంది,
చీకటిలో సాంత్వన ఉంది,
వెలుగులో వేడి ఉంది,
చీకటిలో వెన్నలుంది,
వెలుగు తక్కువ కాకూడదు,
చీకటి ఎక్కువ ఉండకూడదు,
రెండు సమానమే కానీ సమానంగా ఉండవంతే....

పుట్టినరోజు శుభాకాంక్షలు

నీ పుట్టినరోజు ఎన్ని పుట్టాయో,
నీలో మనసు ప్రేమను పుట్టిస్తుంది,
నీలో అల్లరి స్నేహాన్ని పుట్టిస్తుంది,
నీలో అందం భావాన్ని పుట్టిస్తుంది,
నీలో అనుకువ అభిమానాన్ని పుట్టిస్తుంది,
నీతోపాటు ఇన్ని పుట్టిన నీ పుట్టినరోజు నిజంగా ఒక వేడుకే,
కుమారి లాలిత్యకు ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు.....
😍

ఎంత సొగసో

ఇసుక దిమ్మెల అంచున నువ్వుంటే ఎడారి సైతం తరంగాలను నీకై పంపదా....
ఎండమావులు ఏమరుపాటుగా పొంగి నీ పాదం అంచును అందుకోదా...
వడగాలుల హోరు సైతం వెండి వెన్నెల కాదా...

బంధాలు రకాలు

కొన్ని కనువిప్పు కలిగించే బంధాలు...
క్షణాలలో విరుగుతాయి
💔
కొన్ని కనులు వెతికే బంధాలు...
క్షణాలలో కలుగుతాయి
😍

నీ లోకంలో నేనే చక్రవర్తిని

ఒక్క క్షణం నీ కళ్లల్లో చూసి నన్ను నేను చూసుకుంటే నేనెంత గొప్పవాడినో తెలుస్తుంది ఎందుకంటే నీ లోకంలో నేనే చక్రవర్తిని....

Dedicated to all working IT moms

Dear mom...


You always compete with my steps along with your goals and aspirations,
Don't know how you are managing,
But it seems like you kept aside your world for me,
you became a toy for me,
Because you can't manage me anymore?,
Alerts that remind you of messages,
But I wonder how you are alert about my hunger without notifications,
You are careful in work because of managers,  
yes they are intelligent and serious,
I don't know why are you taking care of me without even asking, 
Am I a genius than them?,
but I realised I am your life time task,
Escalations are scary when you roll emails,
But you are escalating my tasks every second,
You don't know how scared I am,
I seen you smiling when shutting the system,
But why you always mumble to shut me down for sleep,
You are not even happy for a minor bug in your code,
But You enjoyed all the bugs in your body that I created,
After go live you give support for few months or years,
But your forever support for me is amazing,
It's ok may be I am a complex project so the care,
When I laugh you look like a queen,
When I cry you are the most worried,
How this is happening without even me paying you, are you getting any salary increment or decrement alerts if I do so?,
So many questions dear mom,
Many imbalances in your life keeping me strong,
Many sleepless nights you spared kept me healthy,
You left your job to keep my project well,
The things you held in heart are heavier than my weight in your tummy,
So much you are giving for me,
all I know is you love me a lot and I am your world...

Love you mom

సాధ్యమా?

తూరుపు వెలుగు అందుకుంటూ ఉనప్పుడు,
నీటిలో తొంగి చూసి ప్రతిబింబం వద్దనుకోవడం....
నీతో స్నేహం కలుగుతునప్పుడు,
నీ మనసు చూసి ప్రేమ రాదనుకోవడం....
సాధ్యమా?

కనిపించు వినిపించు

నువ్వు వినిపించినా కనిపించని వేణు గానం,
కనిపించినా వినిపించని రవి కిరణం...
💓

నీకై

చక్కెర వేస్తే ఏ వంట అయినా తీపి అయినట్టు....
నీపై నీకై రాసే ప్రతి అక్షరం బాగుంటుంది....

వైజాగ్ దుర్ఘటన

పొట్టకూటికై కొలిమి కట్టావు,
ఆ కొలిమిలోనే తలదాచుకున్నావు,
అగ్గి రాజుకోనంతవరకు రాజు నువ్వు,
రాజుకుంది చిత్తు కాగితం అయ్యావు,
అగ్ని పర్వతమైనా ఆగిపోవచ్చు,
కానీ ఇది రాకాసి పర్వతం,
బద్దలై ఆగిపోయినా బ్రతుకులు అతకలేవు,
బ్రతికి పోయినా బరువు దించలేవు,
ఓ మనిషి ప్రకృతిని శాసించకు ఆహుతి అవ్వకు 😔

వెన్నెల సూరీడు

ఉదయించే జాబిలికి వేకువ ఎదురైతే, 
జాబిలి ప్రేమకు సూరీడు కరిగిపోవాలి, 
వేకువ తాపానికి జాబిలి వెలిగిపోవాలి..

నీ పరిమళం

ఎటు గాలి వీస్తే అటు వాలిపోయే మనసే నాది,
ఆ గాలిలో నీ పరిమళం నను తాకుతుంటే ఆగిపోదా ఆ కొత్త అనుభవానికి,
వెతికా నలు దిశలా ఎక్కడ నీవని,
తెలిసింది నీవున్న మదిని తాకిన
నా శ్వాసదే ఆ పరిమళం అని....

ముద్ద మందారం అనుకొకు

ముద్ద మందారం అనుకొకు ఎదిరిస్తావా ముల్ల రోజా అవుతుంది చెలిమి చేస్తావా జాబిలౌతుంది...

కరోన కలకలం

గుండెను అరచేతిలో పెట్టుకొని బ్రతకడం కాదు అరచేతిని మూతి మీద పెట్టకుండా ఉంటే చాలు నీ గుండె పదిలం...

మొహమాటం

మొహమాటానికి మోహమాటాలు తొలి అడుగులు వేసే స్నేహం లో సహజం,
మొహమాటం అంటూనే మాట ఆగకుంటే అది ముదిరిపోయే స్నేహానికి సంకేతం,
నిర్మొహమాటంగా చెలరేగిపోతే అది మోక్షం పొందిన స్నేహానికి దర్పణం...

ప్రేమకంటే గొప్పది

నువ్వు లేకున్నా దిగులు పడదు,
నీకోసమే ఉండిపోదు,
నువెవరో దానికి తెలియదు,
నీ కులం దానికి అర్థం కాదు,
శ్వాసానిచ్చే గాలికి ప్రాణం ఇవ్వడం తప్ప ప్రేమించడం రాదు,
నువ్వుగా వదిలితే తప్ప అది నిన్ను వదలదు,
ప్రేమకు అతీతం ప్రాణ దానం,
ప్రేమకు అతీతం ఆ స్నేహా భావం...

ఆరాటం పోరాటం

ప్రేమలో ఆరాటం ఉండాలి కానీ పోరాటం కాదు....
ప్రేమకోసం పోరాడాలి కానీ ప్రేమతో కాదు....

నిదురకు నిచ్చెన వెయ్యి

కలతకు తగిన సమయం కాదిది...
పెదవి విరుపులు మానుకొని...
రెప్పల కిటకిటలు ఆపుకొని...
కనులకు కలల సాయం చెయ్యి...
నిదురకు నిచ్చెన వెయ్యి...

రుణం

జీవం మట్టుకే దేవుడు ఇస్తాడు ప్రాణం తల్లి పోయాల్సిందే....శ్రామికుల సేవకుల గర్భం లో మేము ఉన్నాము తలదాచుకొని....వారికి బిడ్డలం మేము ఋణపడి ఉంటాము... 🙏

బంగారు వజ్రం

దేని విలువ దానిదే అయినా,
వజ్రంపై బంగారు పూత పూసి,
దాని విలువ పెంచాము అనుకునే రోజులు,
దీనికి మెచ్చుకోవాలా లేక దిగులుపడాలా?,
చేయగలిగినా చేతులు కట్టేసిన ఆడవారి దుస్థితి,
నేర్పు ఉన్నా నేర్చుకోలేని అభాగ్యుల మనోగతి...

అందమైన అద్భుతం

నీ మనసు తగిలి ఆ మెరుపు, 
నీ నవ్వు తగిలి నాకు ఆ వెలుగు, 
నీపై ప్రేమ కలిగి నాలో మైమరపు.... 
నా జీవితంలోని అందమైన అద్భుతానికి శుభోదయం

స్నేహం ప్రేమ

నీకు అర్థం కానిది నాకు అర్థమైందేమో,
అందుకే నీకు తన ప్రేమ దొరకలేదు కానీ నాకు తన స్నేహం దొరికింది....

మరో ప్రాణంకై తపించేవాడే మనిషి

భయం ఉంది నేను సామాన్యుడినే,
జాగ్రత్తలు ఎక్కువయ్యాయి నేను పిరికివాడినే,
అమ్మమ్మలు తాతలు చెప్పడానికి ఎవ్వరు లేరు,
కానీ నాకోసం నేను చేసుకుంటున్నాను,
నేను సమర్థుడినే,
పోయేదేముంది ఓపిక లేదు అని అనే రోజులు,
పోయేది ప్రాణం అని తెలిస్తే ఎక్కడ లేని ఓపిక ఇప్పుడు,
డబ్బు ఉంది కాని హంగులు లేవు,
ఒక సబ్బు బిళ్ళ నా వెన్నుతడుతోంది,
అంటరానితనము ఉంది కానీ కులాలను చూడటం లేదు,
దాణం చేసేవాడే దేవుడు,
వైద్యం రాని వైద్యులు ఇక లేరు,
నిజమైన వైద్యులు ప్రాణాలు ఇస్తున్నారు,
చేదు పసుపు అమృతం,
పుల్లని నిమ్మకాయ వజ్ర కవచం,
కూరగాయలే రక్షణ వలయం,
గడప దాటకున్నా మెరుగైన జీవితం,
నవీణతకు వీడుకోలు ఉత్తరం,
ఎవరికి పని లేకున్నా నాగలికి పని ఇచ్చారు,
కర్మాగారాలు మూత పడినా,
రైతు కర్మకు సెలవు లేదు,
ఎండలో ఏదో ఉందని అందరూ తెలుసుకున్న తరుణం,
ఏసీలు నడవ కూడదని ఆదేశాలు,
అవసరం మించి మించకూడదు ఏది,
మితం ఏ సమ్మతం,
ప్రాణం కంటే ఏది విలువైనది కాదు,
చిన్నదంటూ పెద్దదంటూ ఏది లేదు,
చిన్న చూపు వద్దు,
పొట్టకూటికై పని చేసేవాడే మన పొట్ట నింపుతున్నాడు,
చదువుకున్నవాడు కాలక్షేపం చేస్తుంటే,
నిజమైన పౌరులు సేవలందిస్తున్నారు,
మన వంటలే మనకు గొప్ప,
అదీ ఒక సాధనే అనట్టు బడాయిలు,
ఎగతాళి చెయ్యడం లేదు,
కానీ అసలైన బాధ్యతను మరువవద్దు,
పౌరుడిగా ఏమి చేసావు గుర్తు తెచ్చుకో,
ఇంట్లో ఉండటం బాధ్యత కాదు నీ ప్రాణానికి భరోసా అంతే,
అంతకు మించి ఏమి చేసావు?
ప్రశ్నించుకో స్వీయ ప్రక్షాళన చేసుకో,
సాటి మనిషికై స్పందించు,
అందరిలో ప్రాణం ఉంటుంది కానీ మరో ప్రాణంకై తపించేవాడే మనిషి,
నువ్వు మనిషివేనా?
ఈ సవాలును గెలవగలవా?
నిరూపించుకో నిన్ను నువ్వు,
సాటివాడికై పలుకుతానని చేయందిస్తానని,
నిరూపించుకో నిన్ను నువ్వు,...

నువ్వుంటే

నిదురలో రావాల్సిన కలలు కళ్లముందుంటే కలలతో పనేముంది...
అడగకుండానే జాబిలి పలకరిస్తుంటే చీకటి వెన్నలకు విలువేముంది...

స్నేహానికి బొమ్మ గీశావు

ఎన్నో కలుగుతుంటాయి,
ఎన్నో జరుగుతుంటాయి,
నా చూపులో నువు వాలినపుడు,
నా తొలి స్నేహానికి బొమ్మ గీశావు...

భావానికి సెలవు

నీ తలంపు లేని రోజు నా భావానికి సెలవు...
నీ చెలిమి లేని రోజు నా ఆఖరి స్నేహం నువ్వే అవుతావు...

నీ స్నేహం

ఒక్కసారి జరిగితే అదృష్టం...
అప్పుడప్పుడు జరుగుతుంటే యాదృచ్ఛికం...
ప్రతి రోజు జరిగితే అది నీ స్నేహం...

దృతి

బొమ్మకు నీకు అనుబంధం ఉందేమో...
ముద్దుగా ఉంటావు మా మనసు దోచుకున్నావు...
ప్రేమకు లాలనకు నువ్వు పుట్టావేమో...
కష్టాన్ని మరిపిస్తావు నవ్వుతో మనసును దోచేస్తావు...
ముద్దు మూట కడితే దృతిలా ఉంటుందేమో...
మమ్మల్ని పసివారిని చేసి ఆడుకుంటావు...

నువ్వు

తెలుగు అక్షరం నీ నవ్వు,
ఆకాశం నీ మనసు,
ఆనందం నీ చెలిమి,
అనుబంధం నీ రూపం...

ఓ తెలుగమ్మాయి ఈ నాలుగు వరుసల కావ్యం నీకు అంకితం.

అత్యాశకు కొలత లేదు

నీ సంకల్పం చిన్నదైతే నీ ఆశ అత్యాశ అవుతుంది...
అంతే కాని అత్యాశకు కొలత లేదు...

ఎదురుచూపు

నువ్వు లేని సమయం గడిచిపోతుంది, 
కానీ అందులో జ్ఞాపకం మిగిలిపోతుంది, 
నీ మాట చేరని రోజు రాతిరి వస్తుంది, 
కానీ కలలు నీకోసం వేచివుంటాయి, 
ఏమి ఇచ్చావో ఎంత ఇచ్చావో, 
దాచలేనంత స్నేహాన్ని నాలో పొగుచేసావు...

చీరకట్టు ఇంక్యుబేటర్

ఊపిరు ఆడని సంస్కృతికి ఇంక్యుబేటర్ మీ చీరకట్టు,
వైరస్ పట్టిన సంస్కృతికి సానీటైజర్ మీ చీరకట్టు,
రోజుకొక్కసారి కడుతుంటే,
పాశ్చాత్య క్రిములు నశించి,
మన అంటీబాడీస్ వెలుగు చూస్తాయి,
ఇంటికొక దేవత అవతరిస్తూ,
నవ భారతం మళ్ళీ ఊపిరందుకుంటుంది...

చీరకట్టుకై యుద్ధం

చీర కట్టాలంటే,
ప్రపంచ యుద్ధమే జరగాలి,
లేకుంటే తీరిక ఏది?
రక్కసి జన్మించాలి,
లేకుంటే దేవతా మూర్తికి అవసరమేంటి?

చీరకట్టు

తోక చుక్క అరుదు,
నీలి నింగి జాబిలి అరుదు,
వడగళ్లు అరుదు,
హరివిల్లు అరుదు,
చీరకట్టు కూడా అరుదాయెరా,
 అంత కష్టమైనదా చీర కట్టు?
నువ్వైనా చెప్పరా శంకరా....

బుట్టబొమ్మ

బుట్టబొమ్మ,
వెన్నెలమ్మ,
చీర కట్టి,
జాబిలైతివే,
నీ నవ్వుతోటి,
వేకువను చిన్నబుచ్చావే...

ఆత్మవిశ్వాసం

దూరంగా ఉనప్పుడు,
చెక్కినట్టి కనులు చూసి,
ఎంత సొగసో అనుకున్నా,
మనసు నిండా నవ్వు చూసి,
ఎంత హాయో అనుకున్నా,
కానీ చేరువైతే తెలిసింది,
సొగసైన కనులు అలసటకు వాడుతాయని,
నిండైన మనసు ఒత్తిడికి లోనౌతుందని,
ఎలా ఉన్నా నీలో చెరగని ఆత్మవిశ్వాసమే నిజమైన అందమని..

కరోన

సామాన్యుడికి ఒక అవకాశం,
కవచం కాకు,
ఆయుధం పట్టకు,
ఆవేశపడకు,
నువ్వు ఉన్న చోటే దేశ సరిహద్దు,
గడప దాటనిదే శత్రువుకు బలం లేదు,
దేశభక్తిని ఇక చాటుకో పౌరుడా,
కనిపంచని గుండె చప్పుడై,
లోన ఉండి ఈ ప్రపంచాన్నే కాపాడు...
🙏

మరో కథ

నీ కథ నువ్వే అడిగితే ఏం చెప్పగలను, 
నీపై ఉన్న ఇష్టాన్ని మరో కథలా మార్చలేను....

నవ్వు

చిన్న నవ్వు చూపించి,
మరో చిన్న నవ్వు వెలిగించు,
మంచి మాట వినిపించి,
ఒక మంచి మనసు గెలుపొందు...

అమ్మ

ఉన్న ఒక్క పండు వాడిపోతే కొమ్మకెంత కష్టం,
ఆ కొమ్మ ఒక్కటే చెట్టున ఉంటే పిల్ల గాలి కూడా పెను భారం,
కానీ వాలిపోదు తూలిపోదు ప్రాణమంతా పొగుచేసి,
 తానే ఒక వృక్షమై,
నీడనిస్తూ ప్రాణమిస్తూ ఉండిపోతుంది,
ఆ కొమ్మ లోని అమ్మకు 🙏

తొడుగు

నాకు జత ఉంది కాని జాడ ఏది అంటే పాదాలకు మువ్వలు తొడుగు,
నాకు మాట ఉంది కాని అందమేది అంటే మెడకు హారం తొడుగు,
నాకు వయ్యారముంది కానీ వగలు పోలేనే అంటే నడుముకు వడ్డానం తొడుగు,
నాకు ప్రాణం ఉంది కాని తోడు ఏది అంటే మనసుకు ప్రేమ తొడుగు...

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...