నిన్ను నువ్వే అనుమతించుకో

నువ్వు అనుకున్నది చేయడానికి నీ ఆలోచన నిన్ను అనుమతించాలి కానీ మారేది కాదు..

పరదా దాటి నా చూపు నీ కోసం

మేఘం పరదా వేసినా జాబిలి కనిపించకుండా ఉండదు, 
రోజు ఆ వెన్నెలలో తడిసే మనసు మేఘాలను దాటి దానిని చూడక మానదు...

కొలవలేనిది? 😉

జుట్టు పెరగడాన్ని,
ప్రేమ పెరగడాన్ని,
ఎవ్వరు కొలవలేరు...

నింగి హంగులన్నింటికీ నీవు ప్రతిబింభమే

చినుకు వాలి తడిపితే చక్కని సొగసు, 
రంగు వాలి నిను తడిపితే ఇంద్ర ధనస్సు, 
ఏది నిన్ను తాకినా అందమే, 
ఆ నింగి హంగులన్నింటికీ నీవు ప్రతిబింభమే...

కదలిక లేదు

జాబిలికి కబురు పంపినా, 
వేకువకు లేఖ రాసిన,
సంధ్య వేళ రెండు ఉత్తరాలకు,
జాబు లేదు జవాబు లేదు,
ఎరుపు కమ్మిన నీ అందం చూస్తూ వాటికి కదలిక లేదు...

నీకెందుకు ఆ పట్టుదల?

ఓ నీటి బుడగా! నీకెందుకు ఆ పట్టుదల?!
చిన్న అలికిడికే పగిలిపోతావు,
అంత దూరం ఎగరలేవు,
గాలి ఉన్న ఆశతో బ్రతుకుతుంటావు,
ఎవరి ఆనందానికి బలి అవుతావో తెలియక,
నీ దారి నీ చేతిలో లేక,
బ్రతికే నీ కొద్దిపాటి జీవితంలో
ఏం సాధించాలని నీకు ఆ పట్టుదల??!

నువున్నావాని తెలిసి

నిధిలా దొరికావు,
నిజమై నిలిచావు,
కథనే రాశావు,
కనుమరుగయ్యావు,
స్నేహమా ఎవ్వరు లేని నిశబ్దాన్ని భరించగలనేమో కానీ,
నువున్నావాని తెలిసి నీ అలికిడి లేని నిశబ్దాన్ని భరించలేను..

చీకటి వెనుక దాగలేవు

ఓ జాబిలి చీకటి వెనుక దాగున్నావాని బ్రమ పడకే నీ వెన్నలను ఏ చీకటి ఆపలేదు నీ అందాన్ని ఆకాశము దాచలేదు..
ఆడదానికి ఆభరణం దాచుకోడానికి కాదు అలాగే చీకటి నిన్ను దాచాలనుకోదు...

ఓటమిని గెలుపుని మరొకరి చేతిలో పెట్టకు

ఓడినపుడు
ఆశపడే స్థాయి లేదనుకోకు..
గెలిచినపుడు సాధించాననుకోకు..
నీ ఓటమిని గెలుపుని మరొకరి చేతిలో పెట్టకు..
సాధన చేయాలి పోటీ పడాలి ఆటను ఆస్వాదించాలి ఫలితాన్ని ఆహ్వానించాలి..

ముక్కలైన మనసు

పగిలిన అద్దంలో ప్రతి ముక్క మరో అద్దం ఔతుంది..
అలాగే ముక్కలైన మనసు వాలే ప్రతి చోట కొత్త ప్రేమ చిగురించాలి మరింత ప్రేమను అందుకోవాలి..

కవిత్వం అనంతం

అది తరంగాలు చేరుకునే తీరం, మనోభావాల చిన్న కుటీరం, 
ప్రేమను ద్వేషాన్ని సమంగా చూపే అద్దం, 
కవికి మరో లోకం, 
అదే కవిత్వం అది అనంతం..

చెలిమి చంద్రమా

వెతికి వెతికి అందాన్ని కూర్చి నిన్ను చేసాడు..
నీ అందాన్ని వర్ణించే మనసు నాకిచ్చాడు..
చెలిమి చంద్రమా నీ వెన్నెల ఇంత అందమా..

ప్రేమ సంతకం

గతములో కలిగినా సరి కొత్త జ్ఞాపకం..
మనసులో దాగినా కనుల ముందే నీ రూపం..
కలవరింతకు తొలి వరం..
కౌగిలింతకు తొలి స్వప్నం..
ఏకాంతానికి తొలి నేస్తం..
నీ చెలిమి చేసిన ప్రేమ సంతకం..

కలిగిన ప్రేమ కరిగిపోయింది

మంచు శిల్పాన్ని దాచుకునేంత చల్లని మనసు కాదేమో!
అందుకే కలిగిన ప్రేమ కరిగిపోయింది,
కలలు కన్న కనులు నిన్ను ఆరాదించలేదేమో!
అందుకే చూడలేనంత దూరం వెళ్ళిపోయింది,
నీ ప్రేమ నాతోనే ఉండాలని కోరుకోలేదేమో!
అందుకే స్వేచ్ఛతో వదిలిపోయింది..

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...