తీరపు మనసును గాయపరిచిన కెరటం

ఎందుకో లేవనంది కెరటం,
తీరానికి మాట ఇచ్చి నింగి అంచులోనే ఆగిపోయిన కెరటం,
మనసులో తడి చేర్చుకుంటూ ఎదురుచూసే మట్టిని తాకలేక,
దాని కనులను తడిచేసిన కెరటం,
ఎండ వేడికి ఆవిరై తీరాన్ని తాకుతానంది,
కానీ మబ్బు నీడకు అక్కడే ఉండిపోయిన కెరటం,
సుదూరాలకు చేరుకొని దారి మరచిన కెరటం,
తీరపు మనసును గాయపరిచిన కెరటం...

మరచిపోతున్నా నిను మరచిపోవాలని

రాత్రంతా కలలా నా బుర్రలో,
పగలంతా చప్పుడు చేస్తూ నా గుండెలో,
అలా ఇలా తిరుగుతూ ఉంటే, 
మరచిపోతున్నా నిను మరచిపోవాలని....

ఏ ల్యాబ్ చూడని రియాక్షన్ మనది

H2SO4 లో మునిగినా కరిగిపోలేదు నా మనసు, కానీ కంటి చూపుకే విల విల లాడిందే, 
NACL లో పెట్టినా ప్రిసర్వ్ కాలేదు నా వయసు, నిన్ను చూసాక ఎన్ని జన్మలైనా వేచివుంటానంది, 
కెమికల్స్ లేని కెమిస్ట్రీ మనది, 
ఏ ల్యాబ్ చూడని రియాక్షన్ మనది, 
HE+SHE అనే కొత్త ఫార్ములాకు పేటెంట్స్ మనదే, న్యూక్లియర్ రియాక్షన్ లా ఎప్పటికీ ఆగదులే...

ఏమి చేసినా మరింత పెరిగేదే ప్రేమ

ప్రేమ మరకేమో అనుకొని వాడాను టైడ్,
మిల మిల లాడింది అవాక్ అయ్యాను,
అది బ్యాక్టీరియా అనుకొని,
డెటాల్ వాడాను,
క్లీన్ గా అయిపోయింది,
మిస్టేక్ అనుకొని,
నటరాజ అరేసర్ వాడాను,
కరెక్ట్ అయిపోయింది,
తెలిసింది ఏమి చేసినా మరింత పెరిగేదే ప్రేమ,
మెరిసేదే ప్రేమ అని..

మైమరపు నువౌతావు

నీలో ప్రేమ ఆకాశమంత,
చేరిందెవరో ఆ వెన్నెల తోట,
మురిపించే నవ్వులతో,
కవ్వించే అల్లరితో,
ను చేసే మాయాజాలం,
ఏ వర్షం చేస్తుంది,
నీ కన్నుల మెరుపులు,
ఏ మేఘం చూపిస్తుంది,
అనుకోగనే వాలే తలపుల్లో,
మొదటి వలపు నువౌతావు,
అనిపించగానే కలిగే హాయిలో,
మైమరపు నువౌతావు.....

కలలు కంటూ సాగిపోతోంది

నింగిలోని తీరాన్ని చేరలేక పోయింది,
నీళపై నావకు ఆశ పోయింది,
ఉదయించే సూరీడు కడలి అంచును తాకుతుంటే,
నింగి వాలెనేమో అని ఆశతో సాగింది,
ప్రతి పొద్దు పయనిస్తూ,
ప్రతి రేయి విలపిస్తూ,
మోసపోయిన మనసుతో,
ముందు సాగే ప్రేమతో,
ఎప్పటికి అందలెకున్నా,
ఎప్పుడు అన్న ప్రశ్న లేకుండ,
అలసిపోయేదాకా ఆవిరయ్యే దాకా,
కలలు కంటూ సాగిపోతోంది...

బోడిగుండంత సుఖం

ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం...
నూనె జారినంత సులభం మాట జారడం...
కొండను చెక్కడమంత కష్టం తనను తాను మార్చుకోవడం...
రాయిని జీర్ణించుకోవడమంత కష్టం ఒకరి మనసును అర్థం చేసుకోవడం...

నిను చూసి పాఠాలు నేర్చుకున్నవే

పువ్వు నేర్చిన పాఠం నీ కనులు, 
విచ్చుకుంటే వాటిలా విచ్చుకోవాలి,
చిరు గాలికి నేర్చిన పాఠం నీ మాటలు,
వాటిలా మెల్లగ తాకాలి,
రంగులు నేర్చిన పాఠం నీ సొగసు,
దానిలా రంజింపజేయాలి,
తీగ నేర్చిన పాఠం నీ రూపు రేఖలు,
వాటిలా అల్లుకుపోవాలి,
జగతిలో ప్రతి అందము నిను చూసి స్ఫూర్తి పొందినవే...

మిన్నంత తన మనసు

తెలియదు జాబిలికి తాను ఎంత అందమని,
చెక్కిళ్ళు పొంగితే తాను పౌర్ణమి అవుతుందని,
మచ్చలే తన మమకారాలు,
మిన్నంత తన మనసు,
మిణుగురంత తన కోరిక,
ఒంటరి జీవితం,
కానీ తన వెన్నెల అందరికోసం...

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...