తిరిగిరాదా నీ స్నేహపు రవళి











తిరిగిరాదా నీ స్నేహపు రవళి

పూర్వపు కాంతిని వెదజల్లుతూ

చీకటిని తొలచుకుంటూ

వెన్నల కన్నా మిన్నగా

మనసు కన్నా లేలేతగా

నా చేతికి పసిపాపలా తోచే నీ స్నేహం తిరిగిరాదా .....

కన్నుల కాంతులు మిరిమిట్లు గొలుపుతున్నా

నవ్వుల హరివిల్లులు గొడుగులా విరబూస్తున్నా

నీవు లేని ఈ కన్నుల పండుగ కాంతిలేని దీపం లా మూగపోతోంది

ఆ మౌనపు ఆరాధనే నిన్ను తిరిగి నా చెంతకు రప్పిస్తుందని ఆశిస్తున్నాను

నీకై ఎప్పటికి అదే కనులతో చిన్నారి భావనతో వేచి చూస్తుంటాను....


నా ప్రాణమే నీవైనావు









వాడిన పూలనే బ్రతికించే చిరు గాలి నన్ను తాకినా ప్రేమ చిగురించలేదు

చంద్రుడే కోరుకునే చిరుజల్లులు నన్ను తదిపినా ప్రేమ కలుగలేదు

నీవెవరో ఎక్కడనుంచి వచ్చావో నా మనసును తాకావు

తాకినంతలో ప్రేమ కలుగలేదు కాని నా ప్రాణమే నీవైనావు

నీవంటి ప్రేమ స్వరూపాలు ఉంటే చెప్పు కొన్ని వేల హృదయాలను కాపాడుతాను

వారికి నిజమైన ప్రేమనందిస్తాను .........




నా ప్రేమకు నీవే ఆయువు .....









ఎటూ తోచని చందమామ నింగిలో ఎదురైంది ఎందుకని ?

తానై వచ్చిన జాజికొమ్మ పొమ్మంటోంది ఎందుకని ?

ప్రేమ నిన్నిలా చూస్తుంటే నాకే జాలేస్తోంది

మనసే కాదని మధనపడుతుంటే ప్రాణమే పోయినట్టుంది

ఎద కూరుపులో అర్థంలేదని

నా మాటలే నిజము కావని

నీకేమైనా అందిందా సందేశం ?

చందమామకు వేరే దారి లేదని నాపై పన్నిన పన్నాగం

నమ్మకు తన మాటలు నా ప్రేమకు నీవే ఆయువు .....




సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...