నీకై తపించాలని












ఎన్నాలకైనా వస్తుందా జాబిలీ

ఉదయించే కాలమౌతోంది

వదన్నా కూడా పరిచింది చీకటి

తను రాకుండా ఎక్కడో దాగిపోయింది

మాటిచ్చి మల్లెలు కూడా విరబూయనన్నవి

మంచు పాడే మత్తు పాట ఆపనన్నది

ఎటెళ్ళ లేక నేలనున్న

కళ్ళు మూసుకుంటూ నిన్ను చూస్తున్న

నువ్ వస్తావని కాదు

మనసిస్తావని కాదు

నీకై నేను కాస్తైనా తపించాలని

ఆ జ్ఞాపకాలను పదిలపరచాలని ..




ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️