మంచి మాటల గొంతుంటే చాలు

బోసి మెడలో హారాలు లేకున్నా మంచి మాటల గొంతుంటే చాలు,

మువ్వలు తెలియని పాదాలైనా తోడొచ్చే గుణముంటే చాలు,

రతనాల గాజులు లేని చేతులైనా ప్రేమను చూపే స్పర్శ చాలు,

కాటుక లేని కనులైన వాటికీ సైగ చేసే తెలివుంటే చాలు....


చీకటి ధర్మం..





అంతా చీకటైతే దూరమే తెలియదు...

చెరువైనా కాకున్నా దుక్కమే ఉండదు...

వేలుగునుండి కూడా మిగిలినదేమిటి..

ఆ చీకటేగా అది నిజమేగా..



ఆశల పెన్నిధి నను పెంచెను..

స్వర్గాన్నే చూపించెను...

ఇదే నా ప్రపంచమంటూ..

నిదురలో కూడా చీకటిని చూపించక...

కలలంటేనే తెలుపక కధలు చెప్పెను..



తీర వొకనాడు తెలియని మైకం...

తెలిసినా కనుగొనలేని వింత లోకం..

చూసినవేవి లేని ఓ మాయ పర్వం..

తను ఉన్నానంటూ గుర్తు చేస్తూ..

నన్ను పలకరిస్తూ నాతో ఓ నిదురగా ముచ్చటించే....



తెలిసినది అది చీకటని ..

అందులోనూ హాయి ఉందని...

స్వర్గానికి అర్థం తెలిపేల అది ఓ కళ అని..

వెలుగు దూరమైతే తన వాడికి చేర్చుకునే అమ్మ అని...





నేను ఒంటరిని కాలేను





తూరుపు దిక్కున వెళుతున్నా నాతో వేలుగంటి స్నేహము తోడొచ్చెను ......

పడమర వైపు పరగేడుతున్న చీకటి నక్షత్రాలే పలుకరించెను......

ఉత్తరము చూసి అనువైనదని పోతున్నా దక్షిణము నా వెన్నంటే ఒచ్చెను....

ఎక్కడికి పోయిన ఒక తోడు ఉండగా నేను ఎక్కడికి పోను....

నేను ఒంటరిని ఎలా అవుతాను..

వంకర మూతి.





చిన్ని మూతి వంకర మూతి...

నవ్వుతు పలికే ముత్యాల మూతి....

ముచట్ల రాగాలు తెలిసిన మూతి...

గారాబాలకు ముద్దుల మూతి....

మంచి మూతి ఇది వంకర టింకర మూతి...

నీరు చూడని తామర

ఆ మాట కరువైనా మది కలవరపడదా,

ఆ మత్తు లేకుంటే నిదుర నొచ్చుకోదా,

స్నేహము లేని బంధము,

నీరు చూడని తామరలాంటిది,

ఒకటికి మరొకటి తోడు లేకుంటే,

ఏది సాధ్యము ఏమి సాధ్యము....


నా పలి





గాలి తెరపై అక్షరాలే చాలక నీటిపై....

అది నిండినా చాలదని నిప్పు సెగల నిటూర్పులపై....

కాలినా అది తీరనిదై నేల పలకపై.....

కుదరదని తెలిసి మేఘాల పై....

కాని అరిగిపోని పలి నా పలి చాలని మాట అది నాలో మాట.... 

వేకువ





రేయంతా మబ్బులు కూడగట్టిన వెలుగు...

ఒక్కసారిగా ఈ వేకువై ఒస్తుంటే...

కలలోన నే కూడగట్టిన స్నేహ భావం..

ఓ వెల్లువై ఈ ఉదయమై నను పలకరించే... 

దీప







వెలుగును ఒక రూమపుగా చేసి...

కాంతిని నీ పేరుగా మార్చి...

విద్యను నీ మేధస్సులో దాచి..

నిధానమునే నీ నడకగా చేసి...

చిరనువ్వును నీ దినచర్యగా...

స్నేహమే నీ బలముగా...

మెత్తని మనసును స్త్రీగా నా స్నేహముగా మలచెను ఆ దేవుడు...



తిరిగి రాదా ఆ స్నేహము ?







తన స్పర్శ వదిలిపోయిన చేతులు తనకై ప్రార్దిస్తూ...

మనసు లో మిగిలిన జ్ఞాపకాలే నాకు ప్రాణము పోస్తూ..

మిగిలిన ఈ జీవితము తను లేకనే నడపాలనే ఉద్దేశమే నాలో స్ప్రుహకోల్పోయెను....



మనసులో ప్రేమ ఉన్నా కన్నీటితో వదిలేయగలను...

ఆ ప్రేమ ఎంత దూరంగా వున్నా విరహముతో దిగులును మెప్పించగలను...

వదిలిన ఈ స్నేహాన్ని కొన్ని రోజుల జన్మల బంధాన్ని ఎలా మరువగలను ఏమి చెప్పి నను నేను ఆదరించగలను....





ఎనెన్నో పరిచయాలు నన్ను అలుకున్నా..

బంధాల నడుమ పువ్వై పరిమళించిన స్నేహము..

నా తీగ వదిలి పోతుంటే ఆపతరమా దానిని నిలుపుట సాధ్యమా...





ఇంత ఓదార్పుకు  అర్థమే ఉంటే తన స్నేహమే దిగిరాని...

లేకున్నా నా ప్రాణము నిస్సారమై మిగిలిపోని ఓ మంచి స్నేహము లేని ఓ కుంటి జీవితముగా మిగిలిపోని. ..

వదిలిన అందము...





అందమనే తుమ్మెద వదిలిన పువ్వా నీవు....

కలలే ఆగిపోయిన నిదురలో ఉన్న  చీకటివా నీవు....

మేఘము తెర తొలిగే లోపే రేయి బారిన పడ్డ వెలుగు కిరనమా నీవు...

ఎవరు నీవు వీడిన అందమా లేక విధి వంచితమా....





తూరుపు నీడలు వదిలి పడమర వాలిన సూర్యాకాంతివా...

నేలను తాకి తాకి అలసి ఆగిపోయిన జలపాతానివా ...

రెమ్మల చాటున వాడిన చిగురు తొడుగువా...

ఎవరు నీవు వీడిన అందమా లేక సువాసన లేని సుగంధమా...





నవ్వులు రాలిన మనసు కార్చే కాన్నీటివా....

కురులే వద్ధనిన కమిలిపోయిన పూల రేకువా...

తిన్నెలో నూనె అందక వెలిగే దీపానివా...

ఎవరు నీవు వీడిన అందమా లేక ముత్యము కాని నీటి బొట్టువా...





ఎవరైనా సరే అందము కొంతవరకే ప్రాణము ఉనంతవరకే...

దిగులు చెందక నవ్వులు పండించి లేని అందముకు నీవే ఆదర్శమవ్వు...

నిను పొగడని  ప్రతి మాటకు అందనంత అందమై మిగిలిపో...

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...