చిరుపాదం



మురిపాల జలపాతమా,
మురిసింది ఈ నేలమ్మ,
చిరునవ్వు చిరు పాదమా,
నువ్వు కదిలొస్తే నది కృష్ణమ్మ...

❤️

బంగారం రాయి

బంగారాన్ని రాయికి రుద్దితే రాయి మెరుస్తుంది కానీ బంగారంగా మారదు..

Rubbing the gold on the stone makes it shine like gold, but it cannot turn the stone into gold..

💡

దుఃఖంతో చేసిన మనసు

దుఃఖంతో నిండిన మనసును ఓదార్చగలము,
కానీ దుఃఖంతో చేసిన మనసును ఆదరించగలమే కానీ ఆర్చలేము...

💡

నమ్మరా

దీపం లేకనే వెలుగు చూసాను అంటే నమ్మరా, తన రూపం చూడకనే తలపులతో జీవిస్తున్నా, గాలి లేకనే శ్వాస తీసుకుంటున్నా అంటే నమ్మరా, తన మాట లేకున్నా  పలుకుల తాకిడి నాకు వినిపిస్తోందిగా...

చిరుపాదం

మురిపాల జలపాతమా, మురిసింది ఈ నేలమ్మ, చిరునవ్వు చిరు పాదమా, నువ్వు కదిలొస్తే నది కృష్ణమ్మ... ❤️