సంధ్య నీడ


సంధ్య వేళకు కదిలే నీడ ఉంటే అది నీలా ఉంటుందేమో, అది ఆకాశాన్ని వెలిగిస్తుంటే నువ్వు నా హృదయాన్ని వెలిగిస్తున్నావు...

You are the only wandering shadow of Twilight that lights up my heart when the Twilight is busy lighting up the sky...

💞

హరివిల్లుల ప్రపంచానికి రాణివి


చెలి! మోసపోకు! నిన్ను మనిషిగా చూస్తారు, నిజానికి నువ్వు హరివిల్లుల ప్రపంచానికి రాణివి...

Don't fool yourself, as others see you as a human being, but you are indeed a queen in the world of rainbows...

💞

నీకే అంకితం



ప్రతిరోజూ నదిలో చేరే నీరు
ఏనాడు సంద్రంలో చేరుతుందో తెలియదు., ప్రతిరోజూ మొలకెత్తే చిగురు. ఏనాడు మహా వృక్షమౌతుందో తెలియదు., 
కానీ ప్రతి క్షణం ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది.. చెలీ! నీ ప్రేమ ఎలా మొదలైందో ప్రతిక్షణం ఆరాటంతో పోరాటంతో ఇంతలా ఎలా పెరిగిందో తెలియదు ఈనాడు నాలో ఒక భాగమైంది నాలో భావాలన్నింటిని సొంతం చేసుకుంది నువ్విచ్చిన ఊతమే నేను నీకు అంకితం చేస్తున్నా..!

Every day, the water that flows in the river, we don't know where it joins the ocean. Every day, the sapling that sprouts, we don't know when it will become a mighty tree. But every moment, effort is being made, and this is how your love began. I don't know how it grew amidst constant struggles. Today, you are a part of me, you possess all my feelings and emotions. I am simply giving back the support you've provided by dedicating this small achievement.

💜🫶💜

నీ ప్రేమకై నా కృతజ్ఞతలు




జీవితంలోని క్షణాన్ని కచ్చితంగా చిత్రించడానికి దానిని ఆపక్కరలేదు, ప్రియతమా నువ్వు నా కోసం ఆగనక్కరలేదు, ప్రేమించనక్కరలేదు, మాయం అయిపోవచ్చు, వెలుగు వేగంతో కదులుతూ దూరం కావచ్చు, అయినా సరే నీ ప్రేమను పదిలపరచగలను, గుండెలపై చిత్రించగలను, నా ప్రేమ నా కనుపాపలో ఉంది అందులో ఎన్నో జ్ఞాపకాలు దాగున్నాయి, నా ప్రేమికవై ఉన్నందుకు నా కృతజ్ఞతలు...

The perfect snap of life is when you don't ask it to stop for capturing perfect frame, my dear you no need to stop for me, don't care for me, don't love me, keep moving keep moving, slow or steady or faster or with light speed or just vanish, I can still capture your love and preserve it in my heart, love is in my lens and it captured your memories forever, thanks for being my love.

💜🫶💜

ఊడిపడ్డ పిడుగు



ఊడిపడ్డ పిడుగు ఉరిమే చూపులతో కాకుండా ఊసులతో తాకితే నీలా ఉంటుంది,
నీది ఎదురు చూడని పరిచయం ఎదను తాకే అనుభవం,
కలవు కావని ఎంత చెప్పినా కలగట్లేదు నమ్మకం...

You are a thunderbolt struck with pleasant words instead of a fiery gaze. 
Your introduction is unexpected and a heart-touching experience. 
However much I convince myself, I still can't believe that you are real.

💜💜

నీలా ఉన్నది ఏదీ లేదు


నీ చిరునవ్వును ఇంకా మెరుగుపరిచే రహస్యం ఉంటే అది ఒట్టి బూటకమే, ఎవరైనా నీ నవ్వును పోలిన దానిని చేయగలము అని అంటే, వారు ఈ లోకానికి అందని ఊహల్లో జీవిస్తునట్టే..

If someone promises a secret to enhance your captivating smile, they clearly haven't seen yours. And if they suggest they can recreate your mischievous grin, they must be weaving elaborate fantasies beyond reality!

💜💜💜

పవిత్రమైన ఆలోచన


నాకై మెదిలే నీ ప్రతి ఆలోచన ఎంత పవిత్రమైనదో తెలుసా, దాని ముందు వాన చుక్క కూడా బురద చుక్కలా కనిపిస్తుంది..

Do you know how holy is your emotion for me, before which even a drop of rain looks like a blob of dirty mud..

💜💜💜

అర్థం చేసుకునేదే ప్రేమ


ప్రేమ అనేది మార్పును తెచ్చే గుణం కానక్కరలేదు, కానీ కచ్చితంగా అది మార్పును అర్థం చేసుకునే సంస్కృతి..

love is not necessarily a quality that brings change, but definitely a culture that understands change..

💜💜💜

నీ అందానికి సెలవులు ఉండవు


నీ అందానికి సెలవులు ఉండవు ,
నీ కొలమానాల్లో ఎటువంటి మార్పు రాదు,
జీవించటానికి నీ శ్వాస ఆపే గాలి తప్ప నీ రూపం గాలిని అడ్డుకోదు...

Your beauty knows no holidays, there's no change in your proprtions, your shape doesn't obstruct the flow of air, except for the little air you hold onto to live...

💜💜💜

ఎన్నేసి హృదయాలో అన్నేసి ప్రేమలు


ఎన్నేసి హృదయాలు ఉన్నాయి నీలో, అన్నేసి ప్రేమలను పొందాను నేను..

You have many hearts in you, I have gained many loves from them...

💜💜💜

బంగారు వజ్రం



బంగారంతో చేసిన వజ్రం చూడటానికి విలువైనదిగా విచిత్రంగా ఉన్నా అసలైన వజ్రానికి సరితూగదు...

A diamond made of gold though looks rich and different, it is no match for a real diamond..

💜💜💜

మేఘం రాసిన కన్నీటి కావ్యమే సంద్రం


రాసింది మేఘం తన బాధలన్నీ నేలపై, పొంగిందేమో సంద్రం ఆ బాధ రూపమై...

The cloud etched its sorrow onto the land, giving rise to the ocean...

💜💜💜



నిర్మలం నీ రూపం


నీటితో పాటు తేలియాడే ప్రతిబింభం కాదు నీ రూపం, కదలాడే నీటి అలలని కూడా ఆపి ఉంచగల నిర్మలమైన ప్రతిబింభం నీ రూపం...

Your reflection is not the one that moves along with the water waves; your reflection is the one that can calm down the moving waves of an ocean...

💜💜💜

పిచ్చి ప్రేమ



వెనక్కి తగ్గి దారి వదలదు ఏ సంద్రము, దరికి రావద్దు అని పదే పదే తోసిపుచ్చే అలల పదజాలము, అయినా సరే వెళ్లగలిగేది ఇద్దరే, ఈత తెలిసి ధైర్యం ఉన్నవాడు, పిచ్చి ప్రేమతో అందులోనే మునిగి ఈత నేర్చుకునేవాడు....

No shore gives you the way to come in; the waves always keep us at bay and tell us not to come in. But still, the only ones who can go are the brave ones who know how to swim, the ones who learn swimming by diving into it with crazy love..

💜💜💜

రూపం లేని ఊహల్లో రూపం ఉన్న నువ్వు



రూపం లేని ఊహల్లో రూపం ఉన్న నువ్వు విచిత్రం కాదా రక్తం ఓడుతున్న నా హృదయంలో రూపం లేని ప్రేమ కదలాడుతున్నట్టు...

Your reality seamlessly melds with my virtual imaginings, much like virtual love finds its place in the chambers of the real beating heart..

💜💜💜

రెప్పల వేగాన్ని నిర్ణయించేది నా హృదయమే


నా కనురెప్పలను చేసింది బ్రహ్మే కానీ నిన్ను చూస్తున్నప్పుడు ఆ రెప్పల వేగాన్ని నిర్ణయించేది నా హృదయమే...

The creator crafted my eyelids, but it's my heart that controls their pace as I look at you...

💜💜💜

ప్రేమగా మారిపోదా


నేల వదిలి సంద్రమైన ఆకాశాన చేరిపోదా నువ్వే మేఘం అయితే, రాయి రప్ప పువ్వు మొగ్గ తారలుగా మారిపోవా నువ్వే నింగి వైతే, తలపులు నిండిన నా హృదయం ప్రేమగా మారిపోదా నువ్వే ఎదురొస్తే...

If you become the cloud, then the oceans will fly to stay with you. If you become the sky, the flowers, buds, and stones will become stars in the sky. My heart, full of feelings, will turn into love when I face you...

💜💜💜

దారి తప్పిన సూరీడు


పొద్దుతిరుగుడు పువ్వు కూడా సూరీడు ఏడని వెతికింది తూరుపున, కానీ పడమరన ఉదయించాడు, దారితప్పి వచ్చావేంటి అని అడిగితే తెలిసింది, నిన్ను చూస్తూ సూరీడు తూరుపును మరిచాడు...

The sunflower, too, sought the sun in the east, only to find the sun ascending in the west. When questioned about this unexpected course, the sun replied, 'I forgot the east while gazing upon her...'

💜💜💜

నా హృదయంలో చోటు లేదు


సముద్రం తన నీటిని నదికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంటే? తను ఇచ్చిన నీరే అయినా నది దానిని దాచుకోలేదు. కొన్ని తిరిగి ఇవ్వకూడదు ఇవ్వలేము, కాబట్టి నా ప్రేమను తిరిగి ఇవ్వకు; దానిని దాచడానికి నా హృదయంలో చోటు లేదు...

What if the sea decided to give back its water to the rivers? Even if the water was given by the river, it cannot take it back. Some things should not be given back, so don't give back my love. I don't have a place to keep it..

💜💜💜

మత్తు

గంజాయి పొగతో నిండిన ప్రపంచంలో నన్ను విడిచిపెట్టినప్పటికీ మత్తు కలగదేమో, చెలి ఎందుకంటే, నీ ప్రేమ నీ అందం చూసిన నా మీద, ఏ మత్తు పని చేయదులే, వాటికంటే మత్తుగొలిపేది మరేదీ ఉండదులే...

Even if you were to leave me in a world consumed by the haze of weeds, I will remain untouched as nothing else can intoxicate me more than your love and beauty...

💜💜💜

సొగసుల సౌధం


ఏదైనా గీయగల కలలకు అందని రూపం, ఏదైనా చూడగల ఊహకు అందని అందం, నీ సౌందర్యం ఓ సొగసుల సౌధం...

Your charm exceeds what dreams can draw and what thoughts can imagine; it's like a palace made of beauty bricks..

💜💜💜

ప్రేమలో స్నేహం




పంజరంలో ఉందని తెలిసి చిలుకతో స్నేహం చేస్తే, ఆ స్నేహానికి పేరు ప్రేమ, ఎగిరే చిలుక నేల దిగి నీ ప్రేమకై నడిచొస్తే, ఆ ప్రేమకు పేరు స్నేహం...

When you befriend a parrot in a cage, the name of that friendship is love. When the flying parrot love to walk with you, then that love is called friendship..

💜💜💜

మంచు పరుపులా మారిపోయింది

ఎవరు తాకి వెళ్ళిపోయినా 
మళ్ళీ తన రూపం తెచ్చుకునే నీళ్లవంటిది నా హృదయం, 
కానీ నీ ప్రేమ తాకిన తరువాత 
మంచు పరుపులా మారిపోయింది.,
నీ తాకిడిని దాచుకోడానికి 
మరలా స్వేచ్ఛగా ప్రవహించలేకున్నా..!

My heart resembles water, capable of regaining its shape when someone pokes and departs. However, when you touched it, it froze, transformed into a snow bed that preserved your impression, even though it can no longer flow as it once did..

💜💜💜

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...