నీపై కోపము



రగిలే అగ్నిపర్వతాన్ని ఎదిరించాలనే నీటి చుక్క చేసే ప్రయత్నం ఎంతో,
మంచుకొండను కరిగించాలనే అగ్గి పుల్ల లోని ఆవేశం ఎంతో,
నీపై ఉన్న నా కోపము అంతే......

My anger towards you will not last long, just like a water droplet trying to fight with a volcano or a matchstick attempting to burn down an ice hill...

💜💜💜

ఆకాశానికి గండి పెట్టి


చీకటిని మోసగించి వేకువను తెప్పించి నిన్ను మేలుకొలిపి మాట్లాడాలనే తపనతో నీపై ఉన్న రాతిరి ఆకాశానికి గండి పెట్టి కాస్త వెలుగు తెప్పించాను...

I tried to create a hole in the part of the night sky which is covering you, allowing some light to pass through, in an attempt to trick the nature into waking you up so we could talk...

💜💜💜


నీవంటి అందం


ఎప్పుడైతే నక్షత్రాన్ని విత్తనంగా నాటగలమో, అప్పుడే నీలాంటి అందం ఈ భూమిపై మొలకెత్తుతుంది..

When a star can be grounded as a seed, then only beauty like yours sprouts on this earth...

💜💜💜

మళ్ళీ విత్తనంలా మారిన చెట్టు




మళ్ళీ విత్తనంలా మారిన చెట్టు కథ మన ప్రేమ కథ..

Our story is like the story of a tree which became a seed again..

💜💜💜

మల్లె తీగకు బొగ్గు ముక్క పూస్తుందా


మల్లె తీగకు బొగ్గు ముక్క పూస్తుందా, నల్ల ముసుగు వేస్తే మనసు దెయ్యమైపోతుందా, నీ చక్కని హృదయాన్ని దాచే కఠినమైన మాట కూడా వాటి తీరే...

Can something as dark as charcoal sprout from a jasmine vine? Does love turn sinister when it wears a black mask? Even the determination you display to hide your beautiful heart resembles these contrasts...

💜💜💜

వేకువ లేనిదే జీవితాన్నే గడపలేము


దీపం వంటి సన్నిహితులు ఎందరో, కానీ నువ్వు నా వేకువ వెలుగులాంటిదానివి, దీపం లేనిదే చీకటిలో చూడలేము కానీ వేకువ లేనిదే జీవితాన్నే గడపలేము..

There are many closer ones like lamps, but you are my sunshine because while a lamp helps us see through the darkness, our survival depends on the sunlight..

💜💜💜

పువ్వు లేని జాబిలి


నీ నవ్వు కంటే అందంగా వికసించే పువ్వులను జాబిల్లిపై వికసింప చేయాలని అనుకున్నాడు దేవుడు, 
కానీ ఏ ఒక్క పువ్వు అంత అందంగా లేదు, అందుకే చంద్రుడిపై ఏ పూతోట లేదు, 
దేవుడు తన సొంత సృష్టి ముందు విఫలమయ్యాడు...

Flowers got a chance from God to flourish on the moon, but on one condition: only the flowers that are as beautiful as your smile are allowed to travel from Earth. So, the moon has never seen a flower flourish, and God failed before his own creation..

💜💜💜

ఎక్కడ ఉందో తెలుసా


మబ్బు కింద చందమామ ఎక్కడుందో తెలుసా? మాటలాడే వెన్న ముద్ద ఎక్కడుందో తెలుసా? కోటి తారలు చిన్న పువ్వుగా ఒదిగిపోయే చీకటి ఎక్కడుందో తెలుసా? చేప పిల్ల కళ్ళకి స్ఫూర్తి ఇచ్చిన అచ్చు ఎక్కడుందో తెలుసా?

Do you know about the moon that stays below the clouds ? Do you know about talking pat of butter? Do you know the elusive darkness where a million stars transform into a tiny flower? And, do you know the secret place where the mold once inspired the eyes of a baby fish?

💜💜💜

మరేదైతే ఏంటి


ఒకదానిపై ఏకాగ్రత ఉంటే చాలు మరేదేన్నైనా కాదనుకునట్టే...

When focus is on one thing then it's a no for everything else...

💜💜💜

నీ మౌనం బిగ్గరగా ఉంది కానీ వినిపించట్లేదు



గబ్బిలాల గుసగుసలు విని వాటి మనసును తెలుసుకున్నా సరే, నీ మౌనం బిగ్గరగా ఉంది కానీ వినిపించట్లేదు...

Listening to the whispers of bats, I understood their hearts, but your silence speaks louder and remains unheard...

💜💜💜


ఎన్నో నీడలు నీకై




ఎన్నో నీడలు నీ నీడగా సాగాలనే తపనతో వేచి చూస్తున్నాయి, కానీ నాలా ఏ నీడ కూడా చీకటిలో నీతోడు రాదు, నన్నే ఎంచుకో నీ నీడగా, అలా అయినా నీతో ఉండిపోతాను..

Many shadows are waiting to be your shadow, but no shadow like me will come with you in the dark. Choose me to be your shadow; I will at least stay with you forever that way...

💜💜💜

మరో ప్రేమకై చోటు ఎక్కడ ఉంటుంది


నీ నీడ వాలిన ఏ నేల కూడా వేరే నీడకు చోటు ఇవ్వనంది, మరి నీ ప్రేమ సోకిన నా మనసులో మరో ప్రేమకై చోటు ఎక్కడ ఉంటుంది...

Wherever your shadow has graced the land, it forbids other shadows from descending. Your love has taken root in my heart, leaving no room for another to flourish...

💜💜💜

వినిపించే నిశబ్దం


కనులు మూస్తే వినిపించే నిశ్శబ్దం నీది, 
కనులు తెరిస్తే ఎవ్వరినీ వినిపించుకోలేని సొగసు నీది...

When my eyes are closed, your silence speaks volumes, but when they're open, your beauty overshadows the words...

💜💜💜


నీ కోపం


నీ ప్రేమను ఎంత అర్థం చేసుకున్నానో తెలియదు కానీ కోపాన్ని బాగా అర్థం చేసుకున్నాను, కోపం వస్తే నువ్వు రగిలే ఇనుప కడ్డీ కాదు, వెన్న ముద్దవు, వేడి మీద ఉన్నా లోలోపల కరిగిపోతుంటావు, చల్లారేకొద్ది కమ్మగా మారుతావు...

I don't know how much I understood your love but I understood your anger, When anger flares, you're not like scorching iron; you're more like molten butter, melting within while still appearing furious on the outside, and eventually transforming into a flavorful essence as you cool down...

💜💜💜

అందపు వెలుగుల సుగందాన్ని ఆపగలిగేది ఎవరు



నీలి ఆకాశానికి నీడను ఇవ్వగలిగే గొడుగుతో మట్టుకే నీ అందుపు వేడి ఎవ్వరికీ తాకకుండా ఆపగలము కానీ ఆ గొడుగును చేసేదెవరు నీ అందపు వెలుగుల సుగందాన్ని ఆపగలిగేది ఎవరు..

An umbrella capable of shading the blue sky is the only thing that can shield others from being captivated by your beauty. But who possesses the power to make such an umbrella and contain the enchanting allure you exude?

💜💜💜

విధి రాత చితి రాత




విధి రాతకు పొంగిన ప్రేమలో చితి రాతను రాసాడేమిటో..

The flame that ignited love devoured it mercilessly...

💜💜💜

నింగి తేనెపట్టు


అందరిపై మబ్బునున్న చినుకులు పడుతుంటే, నాపై తేనె చుక్కలు కురిశాయి, ఏ తేనెటీగ నింగిలో తేనెపట్టు పెట్టిందో, ఆ తేనె రుచుల కన్నా నాకు ఆ తేనెటీగ పైన మనసు మళ్లింది...

While misty drizzle soaked everyone, drops of honey landed on me. I couldn't tell which bee built a hive in the sky, but my heart searched for that bee more fervently than for the sweetest honey...

💜💜💜

నీ అందాన్ని రాస్తూ ఉంటే


నీ అందాన్ని రాస్తూ ఉంటే అక్షరాలు గీతలుగా మారేనా, ఆ గీతలన్ని వంగిపోతు నీ రూపాన్ని దిద్దుకుంటూ సాగేనా,
ఆకాశపు తోటలన్ని తిరిగి తిరిగి గాలి రంగులన్ని తెచ్చేనా, ఆ నింగి అద్భుతాలకు ప్రతిరూపంగా నువ్వు కానీ నీ అందంలో ఉన్నవి వాటిలో లేదు..

As I began to describe your beauty, the words transformed into intricate lines, each taking on a graceful shape. The wind itself carried colors from distant galaxies. You are a genuine reflection of nature, enriched with qualities it yearns for...

💜💜💜

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...