నీ చిత్రాన్ని దాచుకోవడమే
పెళ్లి వేడుక
చీకటంతా ద్రుష్టి చుక్కయ్యి వెన్నలమ్మ బుగ్గ చేరితే,
ఆ బుగ్గకున్న సిగ్గు బరువుకు తల వాలిపోతుంటే,
అది ఎంత పెద్ద వేడుకో....
నాతో వచ్చింది నీ రూపం కాదు నీ మనస్సు
వెనుతిరిగిన సంతోషం ఎంతో సేపు లేదు,
తడిమి చూస్తే తెలిసింది నాతో వచ్చింది నీ రూపం కాదు నీ మనసని...
కన్నీరు
ఉప్పునీటి గాధేమిటో సంద్రాన్ని కాదు నా కన్నీటిని అడుగు,
అన్ని కలుపుకుంటే ఉప్పగా మారేది సంద్రము,
అన్ని వదులుకుంటే ఉప్పగా మారేది కన్నీరు...
అందం అంటేనే నీది
నేరేడు పండుకు నారింజ రంగుకు చుట్టం కలిపిన అందం నీది,
రెమ్మపై చెమ్మకు మంచుపై ఎండకు పుట్టిన అందం నీది,
ఉప్పొంగే కడలికి ఊసులాడే పిల్లగాలికి ఆదర్శమైన అందం నీది,
అందం అంటేనే నీది...
Subscribe to:
Posts (Atom)
ఆకర్షణ
నా దేహం భూమి ఆకర్షణకు లోబడితే, నా మనసు మట్టుకు నీ ఆకర్షణకు లోబడింది.. While my body is subject to the Earth's gravity, your love's g...