మిగిలిపోయేది కాదు నా జ్ఞాపకం

మిగిలిపోయేది కాదు నా జ్ఞాపకం,
మిగిలిన జీవితాన్ని నడిపించేది,
కలిగితే కలతనిచ్చేది కాదు నా జ్ఞాపకం,
కలిగే కొద్ది కనులముందు నిన్ను నిలిపేది....

వెన్నెలమ్మకు కోపమెక్కువ

వెన్నెలమ్మకు కోపమెక్కువ రాతిరమ్మ రాలేదని,
జాబిలమ్మకు తొందరెక్కువా వెళ్లిపోయే రావద్దని,
అలిగే బుగ్గలు నిప్పులా బగ్గుమంటుంటే, 
విరిసే చేమంతి కసిరే మేఘమౌతుంటే, 
మెరుపులు ఉరుములు ఎదురు చూపులు..

ప్రశ్న లేకపోతే

ప్రశ్న లేకపోతే
నిజానికి చోటు లేదు అబద్ధాలకు తావులేదు..

విరహం

చిటపటలాడే చినుకు చడి చప్పుడే లేకుండా ఉండిపోతే మెరుపు కూడా మూగబోతుంది ఆకాశమంతా మౌనం అలుముకుంటుంది...

మరింత అందం

కనులతో చూసి నీ అందాన్ని కోరికగా మార్చగకుండా అక్షరంలో దాచి దాన్ని మరింత అందంగా చేయనా?

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️