నాలో మాట
పోలికెందుకు
పువ్వుకు నీ నవ్వుకు పోలికెందుకు,
నువ్వు నవ్వితే అది విరిసిన పువ్వే...
చిరుదీపం కార్చిచ్చు
చిరు దీపంలో వెలుగు ఉండకపోవచ్చు కానీ ఎంతో సాంత్వననిస్తుంది,
కార్చిచ్చు ఎంతో వెలుగునివచ్చు కానీ భయాందోళనకు గురిచేస్తుంది,
కలిగే ఒక్క ఆలోచనని చిరుదీపంలా వెలిగించి ఆనందిస్తామో లేక కార్చిచ్చులా రగిలించి కాలిపోతామో మన చేతిలోని ఉంది...
రెండు వేకువలు
నా జీవితంలో రెండు వేకువలు,
చీకటిని తొలచివేస్తూ వెలుగొచ్చే వేకువ,
విరహాన్ని తరిమికొట్టి నిన్ను చూపించే జ్ఞాపకం మరో వేకువ...
మరచిపోతోంది
నిన్ను తలచినప్పుడల్లా,
చూడాలనే ఆసక్తి పెరుగుతుంది,
కానీ నీ అందాన్ని చూసి,
నీ గురించిన ఆలోచన ఎందుకన్నది మరచిపోతోంది...
తప్పేంటి
ఇలలో ఉన్నవాటిని కలలో చూసుకోవడం దేనికి? మదిలో ఉన్నవాటిని కలలో చూసుకుంటే తప్పేమిటి?
ప్రేమ తగలకుంటుందా
జ్ఞాపకాలు తలచుకొని,
రూపాన్ని నిలుపుకొని,
గుండెపై చేయేస్తే,
ప్రేమ తగలకుంటుందా...
నవ్వే నీ మకరందమైతే
నవ్వే నీ మకరందమైతే,
దానిపై వాలదా నా మాట బ్రమరమై...
మంచుకొండ బగ్గుమంటే
మంచుకొండ ఒక్కసారిగా బగ్గుమంటే,
మల్లె తీగ మొగలిరేకైపోతే,
ఊరుకున్న గుండెలో గుబులు పుట్టదా,
ఏమి లేని మనసులో ప్రేమ కలగదా..
ముద్దుల నోము
నా బుగ్గ నోచుకుంది ముద్దుల నోము అందుకే దొరికింది నాకీ వరము
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
ఏ నిదురలో దాచాలో
కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️