ఎలా రాయాలి

జాబిలి ఎదురుంటే తారలు కనిపించవేమి?
బాగోలేదు మార్చాలి,
నిను చూస్తుంటే ఇంకెవ్వరు కనిపించరేమి?
పాపకు కనిపించినా చూడదేమి?
ఊహు ఇలా రాయాలి,
నీ కనుపాపకు నేను కనిపించినా నా మనసును చూడదేమి?
వలను ప్రేమించే చేపకు గాలం వెయ్యవేమి?
ఇలా రాయచ్చేమో,
నీ వలపు వలను ప్రేమించే నాకు  నువ్వు అందవేమి?...

నీ ప్రేమ

నీ ప్రేమలో పడితే,
ఇసుక తిన్నెలు కూడా అలలై ఉప్పొంగుతాయి,
ఒక్కో వేసవి కిరణం మంచు తునకై నేల రాలుతుంది,
నీ ప్రేమ దూరమైతే,
కడలి కనులు కూడా చెమ్మగిల్లుతాయి,
పూలు వాడకనే పరిమళాన్ని త్యజిస్తాయి....

అందానికి వేకువ

సంధ్య వాలితే లోకానికి చీకటి
నీ రెప్పలు వాలితే
అందానికి వేకువ...

మురికి

మురికి మనుషులు వేరు మురికి మనసులు వేరు,
ముక్కు పనిచేస్తే చాలు ఇట్టే గుర్తు పటచ్చు మురికి మనుషులను,
దూరంగా వెళ్లిపోవచ్చు లేదా శుభ్రం చేయచ్చు,
కానీ అన్ని పనిచేస్తున్నా పసిగట్టలేమే మురికి మనసులను,
వాటిని ఏలా గుర్తించాలి వేటితో కడగాలి? 

ఎప్పటిదో కవిత

ఎప్పటిదో కవిత,
రాసుకున్నా దాచుకున్నా,
మళ్ళీ చూడలేదు ఎదురుపడలేదు,
కానీ వాలింది నా నీడను తాకుతోంది,
జ్ఞాపకాల లోతుల్లోంచి తెలిసిన పోలికలేవో,
రాసుకున్న అక్షరాలన్నీ కనుల ముందు,
కానీ నాదేనా అన్న సందేహం,
చూస్తూ ఉండిపోయా,
చూస్తూనే అదృష్టం కోల్పోయా...

తెలియదు

తెలియదని చెప్పడం తెలుసుకోడానికి ఒక మార్గం...

మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

నాలో ప్రాణం స్నేహం మోహం ప్రేమ అనురాగం సంకల్పం విజయం భావం కష్టం అన్నిటికి ఒక్కొక్క దశలో ఒక అర్థం చేకూర్చి ప్రతి శ్వాసను ఆస్వాదించేలా ప్రతి జ్ఞాపకాన్ని ఆనందించేలా చేసిన ప్రతి స్త్రీకి వందనం మరియు శుభాకాంక్షలు 
💐 🙏

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...