నీ స్నేహం

చిరునవ్వు చేజారి పోనీకు,
చిన్న ఆశ నాలో అది నీతోటే ఉండనివ్వు,
కలలు ఎక్కువైతే వదిలిపోనీకు,
కలలు రావు నాకు కాస్త అప్పు ఇప్పించు,
కన్నీళ్లు వస్తే నీ దోసిల్లలోనే ఉంచు,
అదీ నాలా ముత్యమౌతుంది నీ స్నేహం దానికి పంచు,
చదివి చదివి అలిసిపోయినా మళ్ళీ చదువు,
నా అక్షరానికి కాస్త విలువ పెంచు...

చంద్రమా రామ్మ!

అలసట లేని నీ అందానికి చందం ఎక్కువ తొందర కూడా ఎక్కువ....
బారెడు ఉంటుంది చూపు తగిలే కొద్ది జానెడు అవుతుంది....
చంద్రమా రామ్మ!

తపన

నీ ఒక్క మాటకై నా తపన ముత్యమయ్యే ఆ ఒక్క చినుకు బొట్టు లాంటిది...

కనులు తడిపే భావన

కనులు తడిపే భావన ఏదైనా మనసు హత్తుకున్నదే అవుతుంది...
🧡

ముద్దబంతి సింగారం

మల్లెపూల పందిరిలో మొగలి రెకుల సోయాగం,
సన్నజాజి పాన్పుపై,
ముద్దబంతి సింగారం....

కదలని సూర్యుడు ఎలా ఉదయిస్తాడు?

☀️
కదలని సూర్యుడు ఎలా ఉదయిస్తాడు?
ఏంచేత సూర్యోదయం అన్నారు?
🌝
చంద్రోదయం అనడం సబబుగానే ఉంది కాని ఈ సూర్యోదయమే ప్రశ్నగా మిగిలిపోతోంది!

నీతో

వెన్నలను నిదురతో...
వేకువను మెలకువతో...
నిన్ను ఊహలతో...
నీ ప్రేమను మనసుతో...
💞

గతం లోతు

గతం ఎంత లోతున్నా అందులో దూకలేవు...

కలగడం తప్ప కలవడం ఉండదు

చిగురాకుపై ప్రేమొచ్చినా చిరుగాలి ఆగదు....
ప్రేమ వెళ్లిపోతున్న తాకిడికి చిగురాకు ఆడక మానదు....
ఇరువురి దారులు వెరైతే ప్రేమ కలగడం తప్ప కలవడం ఉండదు....
💔

నీ కాగితం పైన నా అక్షరం అందం ఆనందం

కాగితంపై రాసుకున్నాను... 
పూల రేకులపై రాసుకున్నాను... 
ఎండుటాకులపై రాసుకున్నాను....
మనసులోను రాసుకున్నాను...
ఎక్కడ రాసినా లేని అనుభూతి ఇక్కడ చూస్తే కలుగుతోంది...
నీ కాగితం పైన నా అక్షరం అందం ఆనందం...

నిదురపుచ్చే కల

నిదురలో కలలు కన్నా కాని కలలే నిదురపుచ్చడం కొత్తగా ఉంది...

అందం అంటే?

నిన్ను నువ్వే చూసుకొంటూ,
ఇంకేది కంటపడకుంటే,
అందం అంటే ఏంటో చెప్పగలవా?
కళ్ళు ఉన్నా ఏది చూడలేవో అదే అందం,
మనసు ఉన్నా ఏది పొందలేవో అదే అందం,
కనిపిస్తేనే అందం అంటే ప్రతి రూపం అందమే,
ప్రేమిస్తేనే అందం అంటే ప్రతి మనసు అందమే...

చిలిపి చెక్కిళ్ళ

చిలిపి చెక్కిళ్ళ చిగురులలో విరిసే మొగ్గ పేరేంటో...
సిగ్గు అని నువ్వు చెప్పినా అది అందం అని నేను చెప్తున్నా...

వెతికా మునిగా

పాటలకు సరికొత్త భావాలు లేక నీ మాటలో వెతికా...
నా కూని రాగాన్ని సరిచేసే తాలానికై నీ ఎద లయాలో మునిగా...
💞

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...