నాలో మాట
ఆదరణకు వీడుకోలు
చిన్న మాటకు సమయం లేదు...
చిన్న పలకరింపుకు తీరిక లేదు...
అనుబంధాలకు అడ్డుగోడలు...
ఆదరణకు వీడుకోలు...
వెన్నపూసవా
యెవ్వనాల పాల నుంచి తీసిన వెన్నపూసవా..
వేకువంత వదిలిపోయిన వెచ్చని వెన్నెల సొగసువా..
❤
ఒకటి అందంగా అయినా ఉంటావు లేక ముద్దుగైనా ఉంటావు
ఒకటి అందంగా అయినా ఉంటావు లేక ముద్దుగైనా ఉంటావు
❤
ఎలా వచ్చినా చేరేది మనసులోకే
కనుల నుంచి మనసు చేరే ప్రేమలు...
మాట నుంచి మనసు చేరే ప్రేమలు...
స్పర్శ నుంచి మనసు చేరే ప్రేమలు...
ఎలా వచ్చినా చేరేది మనసులోకే...
మనసు చేరితే కలిగేది ప్రేమ మట్టుకే...
ఆలోచనకు మెరుపొస్తుంది
ఎన్నో ఘర్షణలకు లోనైతేనే ఆలోచనకు మెరుపొస్తుంది..
ఓడిన చోటే అనుభవాలు ఓనమాలుగా కొత్త పాఠాలు నేర్పుతాయి..
అప్పుడు ఇప్పుడు
తొందరగా చీకటి పడితే జాబిలిని చూడచ్చని ఎదురుచూసే కనులు అప్పుడు...
కానీ ఇప్పుడు చిరు నేస్తాల పలకరింపుకై ఎదురుచూస్తోంది...❤
నీ కనులు వాలితే అందమొస్తోంది
సందేహిస్తోంది నా ఆలోచన అంత అందాన్ని ఎలా పోల్చాలని దేనితో పోల్చాలని..
కనులు వాలితే కలలొస్తాయేమో కానీ నీ కనులు వాలితే అందమొస్తోంది..
ఒడిపోతున్నా ఒప్పుకుంటున్నా నీ అందాన్ని పోల్చడం నా తరం కాదని కాదు కాదు ఎంత పోల్చినా తక్కువేనని...
మన కష్టం చిన్నది
మన కష్టం వాళ్ళ కష్టం కంటే చాలా చిన్నది..
మనకు నచ్చినవారు లేకపోవచ్చు వాళ్లకు బ్రతకడమే కష్టమౌతోంది...
మేఘమా కనికరించు
నింగిలో నిలువలేనంతగా అందంగా ఉందా ఈ భువి..
ఆగకుండా కురుస్తున్నావే..
ఓ మేఘమా కనికరించు నెమ్మదించు..
నీ ప్రేమ వేగం తగ్గించి చిరుగాలిలా మారు ..
మా చిన్న బ్రతుకులపై దయతలచు..
🙏
గెలుపంటే?
ఎందుకు అని ప్రశ్నించకు..
ఎప్పుడు అని ఎదురు చూడకు..
అడుగువేసే ధైర్యం లేకుంటే..
గెలుపు మీద మక్కువ పెంచుకోకు..
👎
గమ్యాన్ని అందాలనే తపనలో మనసు ఉడుకుతుంటే ఆ వేడి సెగలకు నువ్వు అందుకునే వేగం లో ఉంది నీ గెలుపు..
అంతేకాని అందుతుందో అందదో తెలియని గమ్యం లో కాదు..
👍
వచ్చి పోయే మేఘాలు
వచ్చి పోయే మేఘాలలో పులకరింతలు ఉంటాయేమో కానీ పలకరింపులు ఉండవు...
కానీ మళ్ళీ మళ్ళీ వచ్చే మేఘాలలో పులకరింతలు పలకరింపులు ఎదురుచూపులు అన్ని ఉంటాయి...
💭
❤
నిన్ను నీకే అర్పించుకో
పగిలే హృదయమా పారిపోకు..
చిగురు తొడిగే వసంతాలు రాకపోవు..
రగిలే తాపమా తరలిపోకు..
నీ ఆలాపనలో బాధ కూడా సుఖమని మరచిపోకు..
నీలో నీకై నీలో నీవై నీకే నీవై
నిన్ను నిన్నుగా ప్రేమించుకో..
నిన్ను నీకే అర్పించుకో..!
💔
అందదు తళుకుమనదు
చేరువనున్నా జాబిలి తళుకుమనదు..
తళుకులున్నా తారక చేతికందదు..
💔
సాధనను అలవాటుగా చేసుకో
నువ్వు వ్యర్థం కావు..
నీ ఆలోచన వ్యర్థం కాదు..
సంకోచించకు సందేహించకు..
ఆచరణలో పెట్టు..
ఆగకు అన్వేషించడం ఆపకు..
ఫలితం నీది కాదు ఎదురు చూడకు..
సాగిపో సాధనను అలవాటుగా చేసుకో..
కఠినమైనది
కఠినమైనది జ్ఞాపకం...
కరుణలేనిది ఈ దూరం...
కలతకు కానుక కన్నీళ్లు...
గడిచిపోయినా ఇంకా ఎన్నాళ్ళు...
💔
చీకటిని అంతా నా కౌగిట నింపు
వెన్నలను కోవెలగా చేసినావా,
కోవెలలో తనను తారకను చేసినావా,
అయినా దూరం కదా,
మనసుకు భారమౌతోంది,
అందాన్ని చూస్తూ కనులు చిన్నబోతోంది,
నేలకు పంపు నింగిని దించు,
చీకటిని అంతా నా కౌగిట నింపు...
విరహాన్ని అలవరచుకో
నిరాశ చెందకు మనసా...
శ్వాసలో నీ ప్రేమని ఉంచావు....
ధ్యాసలో ఆమెను ఉంచావు...
విరహాన్ని అలవరచుకో...
సంతోషంగా ఉండగలవు...
స్నేహం
చిలిపి వయసులో మనసే తడబడి..
అదుపు తప్పి మళ్ళీ నిలబడి..
తోడు కోసం ఎదురు చూస్తే..
ఆ ఆశ పేరే స్నేహం..
❤
స్నేహం
ఊహకు నిలువుటద్దం..
ప్రేమకు చెలిమి రూపం..
నీ జ్ఞాపకం ఇక్కడ..
నీ స్నేహం ఇక్కడ ❤
స్నేహోదయం
ప్రతి రోజు వెలికితీసే జ్ఞాపకాలలో,
ప్రతి కిరణం గుర్తు చేసే ఉదయంలో,
చిగురించే చిరు కవితలు మీరు,
అల్లుకుంటూ హత్తుకుపోయే చెలిమి మాలికలు మీరు....
నవనూతనం
నవనూతనం నిత్యం సంతోషం మీ చెలిమితో మీ కలిమితో...
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
ఏ నిదురలో దాచాలో
కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️