నీలో నిజమై నేనున్నా చూడు











నీలో నిజమై నేనున్నా చూడు ,

కలలో నీతో కలిసున్నా చూడు ,

కదిలే కడలి నీ తీరం ఏది,

కరిగే మనసా నీ గమ్యం ఏది ,

కనులార్పకింక రెప్ప పాపను వీడిపోయింది,

మదిలోని ఆశ ప్రాణమై నన్ను మేలుకొలిపింది ....



చూసేలోగా దూరమయ్యావు నువ్వు ,

చేరేలోగా మరో చెయ్యి పట్టావు నువ్వు ,

ఆశకింక అంతమంటు మౌనంతో చెప్పావు ,

ఆగలేని అడుగును ఎందుకు ఆపలేదు ,

నాలో నిండిన నిన్ను ఎందుకు అడగలేదు ,

తీసుకో నీ మనసును వేసిపో ఒక హద్దును ....



నీ స్పర్శనే అడిగి ఉండనే అది జ్ఞాపకం అవుతుందని తెలిసుంటే ,

నీ కళ్ళనే చూసుండనే దాని కలకే నేను పరిమితం అవుతా అని తెలిసుంటే ,

ప్రేమ అన్న వలయంలో చిక్కుకోలేదు కాని నీవు అన్న నిజంతో బ్రతికాను,

దూరం అన్న శత్రువుకి బయపడలేదు కాని అది తగ్గదని తెలిసాక బ్రతకలేకున్నా ,

ఓటమి ఇచ్చుంటే గెలుపు వైపు పయనం చేసుంటాను ,

గెలుపు ఇచ్చుంటే శిఖరాలకు చేరుంటాను ,

ఒడిదుడుకులు ఓటమి అంచులు చిరునవ్వులు గెలుపులు అన్ని నీవైపోయవే ,

మారో దారి ఏదని తెలియకుండా ఉన్నా ,

మరో ప్రపంచమే నాకు తగినదని దూరామౌతున్నా .....


చేపను ప్రేమించి

నీటిలో బ్రతకలేనని తెలిసి, చేపను ప్రేమించి, అర్థం లేని పోరాటం చేస్తున్నా, నాకు నేను దూరం అవుతున్నా.. 💔