నాలో మాట
ప్రేమ సంతకం
నీవే లేని జీవితం ,
చదువే రాని సంతకం ,
తెల్ల కాగితం అయితే ఏముంది ,
అందులో అక్షరం ఏదైతే ఏముంది,
నీ స్పర్శ అందలేని ఈ చేతికి ,
అందులో ఒప్పందం ఏదైతే ఏముంది ....
రాసిచ్చానుగా నా గతమంతా ,
నీకే అంకితం చేసాను గా ,
ఇమ్మంటావా నా రేపటిని ,
తీసుకో ప్రియతమా ,
చెంతనే ఉండకర్లేదు ,
చేతిని ఇవ్వకర్లేదు ,
నా కలలో వస్తే చాలు ,
నా మనసునున్న ప్రేమ ఆస్తిని నీకే రాసిస్తా గా ...
సంతకం చేసాక తెలిసింది,
నీ దూరమే ఆ ఒప్పందమని ,
అనుకున్నా చేరుపుదామని ,
కాని తెలిసిందే అది చెరగదని ,
అమ్ముకున్నావు నిన్ను నీవు ఒక్క మాటకోసం ,
నా ప్రేమను అమ్మినా సరి తూగలేదు ఆ మాటతో ,
తెలిసేనే నా ప్రేమ ఎంత తేలికైనదో ,
తెలిసేనే నా సంతకం ఎంత విలువైనదో ....
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
ఏ నిదురలో దాచాలో
కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️