అందమా అది సౌందర్యమా ?












గానమే రూపు దాల్చి గళమై పాట పాడితే ,

సిరి మువ్వే అందె వేసి చిందులేస్తూ ఆడుతుంటే ,

పరవశించే హృదయం నవ్వుల హారం తొడుగుతుంటే ,

అందమా అది సౌందర్యమా ?

చెప్పతరమా చూడతరమా ఆ చిన్నారిని మాటలతో పోల్చతరమా


మనువాడని నీ స్నేహం నా చెలిమితో







మనువాడని నీ స్నేహం నా చెలిమితో ,

పసి నవ్వుల కెరటం నీ మాటల్లో,

ఎప్పుడో వెనుతిరిగిన తారక ఒకటి ఇప్పుడు వెన్నలలా ఉదయించింది ,

ఎల్లపుడు నా నింగిలో జీవిస్తూ ఉండాలని నా కోరిక ,

చీకటి వెలుగు లేకుండా స్నేహమై ఉండాలని నా మాటగా ,

విన్నవిస్తున్న నేస్తమా వింటున్నావా ,నిను తలచుకుంటూ రాస్తున్నా చూస్తున్నావా ...







ఆరని పారానికి అందాల పాదాలు...

తీరని విరజాజులకు నల్లని కురులు...

అధిన రంగులకు చక్కని చెకిల్లు...

మత్తుగొలిపే ఎరుపునకు తియ్యటి అధరాలు...

ప్రేమను మోసే ఎద జతలు...

నాజూకు నయగారాల ఒంపు సొంపులు...

గల గల గాజులకు చిక్కని చేతులు...

వెలుగు మరిపించే కాటుకకు లేడి కనులు...

కునుకు తీయని కలలకు అందమైన రూపు రేఖలు..

ఆత్మీయమైన ఈ ప్రపంచానికి అందమైన పడతులు...


ఎవ్వరికీ లేఖలు అందలేదే

వెన్నలకు లేఖ రాశాను, తారకకు లేఖ రాశాను, ఆకాశానికి లేఖ రాశాను, ఎవ్వరికీ లేఖలు అందలేదే, రాయభారిని అడిగితే, నీ నవ్వులో వెన్నలని చూసి, మినుక్కుమ...