కలగవా కన్నీరు కడలికైనా











కలిగిన ఆశలు ప్రేమకు లోకువైతే ,

విరగదా మనసు ఎంతటి కొండధైనా ,

కలగవా కన్నీరు కడలికైనా .......


మోహం











కనులెదుటే మోహం ఉన్నా ,

తెలియదు ఎందుకో పిచ్చి మనసుకు ,

లోకమంత ప్రేమ ఉన్నా సూన్యమౌతుంది దాని ముందు,

తెర దించాలన్నా కాదేందుకో మోసపోతుంది ,

అది ప్రేమే అన్న బ్రమలో ఉండిపోతుంది ,

వీడాలని మనసంటున్నా ఆలోచన దానిని వెక్కిరిస్తుంది ,

జయించగలిగితే ప్రేమను పొందగలవు ,

ఓడిపోతే ఒంటరివౌతావు .......


విధికే అంకితం నా దు:ఖం












నిదురలో నిలువకే ,

నిజములా వాలవే ,

కనులతో ఆడకే ,

కన్నీటిని తెప్పించకే ,

మనసా నీవొక మాయేకదా ,

మంత్రమేసి చూపించు నా చెలిని ,

వయసా నీవు ఆగలేవు గా ,

వేగంగా వెళ్లి చేరుకో నా సఖిని ,

ఎందుకిలా చేస్తావో తెలియదు ,

ప్రేమగా ఎందుకు మారుతావో తెలియదు ,

మారినా మాసిపోవెందుకు ,

ప్రాణం పోయినా ప్రణయ రాగం ఆపవెందుకు ,

విధికే అంకితం నా దు:ఖం ,

ను విని నను చేరితే నాకు మరో ప్రాణం అందిస్తావు ,

లేకుంటే మరు జన్మలోనైనా నను వదలకు ......


శిలవైపో శిల్పమైపో












కదలకు అలజడి రేపుతావు మనసులో ,

కనులను కదపకు బాణాలు వేస్తావు కుర్రకారు హృదయాలలో ,

అభినయించకు నడవకు శిలవైపో శిల్పమైపో,

లేకుంటే వదలరు నీ వెంటబడతారు ......


అందమా అది సౌందర్యమా ?












గానమే రూపు దాల్చి గళమై పాట పాడితే ,

సిరి మువ్వే అందె వేసి చిందులేస్తూ ఆడుతుంటే ,

పరవశించే హృదయం నవ్వుల హారం తొడుగుతుంటే ,

అందమా అది సౌందర్యమా ?

చెప్పతరమా చూడతరమా ఆ చిన్నారిని మాటలతో పోల్చతరమా


మనువాడని నీ స్నేహం నా చెలిమితో







మనువాడని నీ స్నేహం నా చెలిమితో ,

పసి నవ్వుల కెరటం నీ మాటల్లో,

ఎప్పుడో వెనుతిరిగిన తారక ఒకటి ఇప్పుడు వెన్నలలా ఉదయించింది ,

ఎల్లపుడు నా నింగిలో జీవిస్తూ ఉండాలని నా కోరిక ,

చీకటి వెలుగు లేకుండా స్నేహమై ఉండాలని నా మాటగా ,

విన్నవిస్తున్న నేస్తమా వింటున్నావా ,నిను తలచుకుంటూ రాస్తున్నా చూస్తున్నావా ...







ఆరని పారానికి అందాల పాదాలు...

తీరని విరజాజులకు నల్లని కురులు...

అధిన రంగులకు చక్కని చెకిల్లు...

మత్తుగొలిపే ఎరుపునకు తియ్యటి అధరాలు...

ప్రేమను మోసే ఎద జతలు...

నాజూకు నయగారాల ఒంపు సొంపులు...

గల గల గాజులకు చిక్కని చేతులు...

వెలుగు మరిపించే కాటుకకు లేడి కనులు...

కునుకు తీయని కలలకు అందమైన రూపు రేఖలు..

ఆత్మీయమైన ఈ ప్రపంచానికి అందమైన పడతులు...


Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...