నిను చూసా







కాలమందిన అందమంత నీ కౌగిలింతలో చూసా ,

కలువ భామలో నలుపు నీ కురుల రంగులో చూసా,

ధారగా పారే గంగ నీరు నీ నవ్వు వాగులో చూసా ,

పసుపు నుదుటిపై సంధ్య బొట్టులా మోము సొగసును చూసా ,



అమ్మ కనులలో ప్రేమ కధలకు రూపమిచ్చి నిను చూసా ,

నా నీడకే నువ్వు నీడలావుంటే చనువు స్పర్శను చూసా,

రంగులే పాడే రాగ మాలికలు నీ మాట పొంగు లో చూసా,

వెంటనే వచ్చే చిలిపి గుర్తులో నీ పలకరింపును చూసా ,



కడలి పై కదిలే ఆ అలల ఆటలో చూసా ,

కొమ్మ కొమ్మకు పూచినా పువ్వు లో నిను చూసా,

బయపెట్టే చీకటిలో జాబిలమ్మ లా నిను చూసా ,

మేళవింపుల రాగాలకు ఆడే అందెలో నిను చూసా ,



మించిపోయే నిదుర మత్తులోని హాయిలో నిను చూసా ,

చేతికందిన ఆశకు నీ పేరుపెట్టి చూసా ,

మలయా మారుతాలను కరిగించే శృంగార రవళిని చూసా ,

సన్నిధిలో పూజించే దేవతలా నిను చూసా ....


పుట్టిన రోజు 'సుభా'కాంక్షలు రసజ్ఞా









వేకువలో ఒక కిరణం ,

నింగి దిగిన మేఘం ,

అందరి సేవకై సాగుతుండగా ,



కరిగిపోదు జ్ఞాపకం ,

వాడిపోదు స్నేహం,

మా మదిలో ప్రతిబింబమై నువ్వు కనిపిస్తుండగా ,



ప్రతి క్షణం నీ ఆలోచనకు నువ్వు జన్మనిస్తుంటే ,

ఈ క్షణం నీకై వేచి ఉంది ,

నీ పుట్టినరోజుకు శుభాకాంక్షలు అందజేస్తోంది ...


ప్రాణమంతా తపించే తరుణమదే









కనులారా దూరమౌతుంటే కనిపించని మనసులో ఏదో అలజడి ,

మాటేమో మౌనమౌతుంటే మాటునున్న ప్రేమకు సెలవని ,

ప్రాణమంతా తపించే తరుణమదే ,

చావు కూడా తియ్యగనిపించే దృశ్యమదే .....

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...