ప్రాణమిచ్చి ప్రేమించేవారు కొందరే.





అన్ని మనసులలో ప్రేమ ఉన్నా...

విరబూసే ప్రేమలు ఎన్ని?..

ప్రేమ కోసం ప్రాణమే ఇచేవారు ఉన్నా??

ప్రాణమిచ్చి ప్రేమించేవారు కొందరే....

రాలిపోయే పూలు





వాడిపోయి కాదు రాలిపోయేది పూలు...

నీ ప్రేమకోసం రాలిపోతున్నది..

గాలి తగిలి కాదు పారిపోతునవ్వి..

నీ జాడ కోసం వెతుకుతునవ్వి..

ఎవరికోసమో కాదు సువాసనలను వెధజల్లుతున్నవి..

అట్లైనా నీ చేయి తగిలి జడను చేరాలని పరితపిస్తునవ్వి..

అందమైన తారకలు..





మబ్బు తోటలో మల్లె పూలు...

ఈ రేయి జడలలో సొగసైన పూలు...

చందమామకు దూరపు చుట్టాలు..

వెలుతురు చిమ్మే వింత పూలు....

అందలేని అందలంలో అందమైన తారకలు... 


తెరచిన కనులలో తెలియని అర్థాలెన్నో





తెరచిన కనులలో తెలియని అర్థాలెన్నో..

చూసే చూపులలో చిగురుతోడుగు ప్రేమలెన్నో..

కనులకు తెలియని బాష లేదు...

దానికి ఎన్నడు మాట రాదూ..

మౌనమైనా అది మహా కావ్యమే...

కొంచముండి అది ఎంతో చేయునే... 


మీ వంతు సాయం చేయండి ...

మీ వంతు సాయం చేయండి ...
మీ వంతు చేయూతనివ్వండి...
మీ వంతు కాస్త దానము చేయండి...


జపనీయులకి మన సహాయం కావాలి. వారిని ఆదుకునే బాధ్యత మనమీద వుంది.


http://donate.worldvision.org/OA_HTML/xxwv2ibeCCtpItmDspRte.jsp?section=10339&item=2200736





Go through the above link to donate the needy . Its the right time to do it . Don't count please do it

ఓడిపోతుండాలి అపుడపుడు..





తీరాన్ని ఓడించే కెరటాలను..

నీడిచే మేఘాలనే తొలచే కిరణాలను...

ఎవరు ఇష్టపడతారు ?

గెలుపే జీవితం కాకూడదు...

ప్రేమతో స్నేహంతో ఓడిపోతుండాలి అపుడపుడు..

విరహం..





విరహమెంత విసిగించినా..

నిను వదలదు ఈ మనసు..

వలపు తోటలో పువ్వులా ఎదురుచూస్తుంది..

దొరికిన ప్రతి నిమిషం నీ జ్ఞ్యాపకంతో గడుపుతోంది...

పేద





పువ్వు కూడా ఇష్టపడదు పరిమలించడానికి పేదవాడి చేయి తగలనిదే...

బియ్యపు గింజ కూడా ఆకలి తీర్చదు పేదవాని సాయం లేనిదే...

కట్టిన గూడు కూడా నిలిచి ఉండదు పేదవాడు ఇటుక కాల్చనిదే..

ఈ ప్రపంచమే కదలదు పేదవాడు బండి నడపనిదే..

మన దేశము పేధధైతే కీర్తి క్యాతులు మనదేగా...

గొప్పదౌతు పేదరికాన్ని మరిచిపోతోంది కష్టాన్ని మరిచిపోతోంది...

పడతుల దినోత్సవం..







ప్రాణమిచ్చే అమ్మ కూడా మగువ కానిదే సాధ్యపడదు...
నీడై వుండే తోబుటువుగా మగువలేనిదే ఆ నీడకు జీవముండదు...
ప్రేమపంచే ప్రేయసైనా మగువ కానిదే అర్థం ఉండదు...
స్నేహంలోను నీ భాగం లేనిదే దానికి పరిపూర్ణత ఉండదు...
అంతటి నీకు ఈ ఒక్కరోజే కాదు ప్రతి రోజు అర్పితమే...
  

వెన్నెల

చప్పుడే లేకుంది, అయినా తెలిసిపోతుంది, నీ నవ్వు, పున్నమి లాంటిది, నీవైపు చూడకున్నా, ఆ వెన్నల నన్ను తాకుతూ ఉంటుంది... Silent yet I know, your ...