తెలియదు వారికి కళలున్నవారని ....
తెలియదు వారికి నిజమైన వారని ....
తెలియదు వారికి మనసున్న వారని ....
తెలియదు వారికి వారు మంచి స్నేహితులని ....
తెలియదు వారికి అన్ని తెలిసినవారని ...
తెలియదు వారికి వారు గొప్ప మనుషులని..
నీ రాకకై నే వేచివున్నా , నీ ప్రేమకై పరితపిస్తున్నా , నీవు నా ఊహావని తెలిసినా , నిన్ను బొమ్మగా చేసి, ప్రేమతో ప్రాణం పోయాలని యోచిస్తునా , నిను నా దానిగా చేసుకోవాలని మళ్ళి కళలు కంటున్నా .......... |
గోదారమ్మ చీకటాఎనమ్మ ... ఏ దారిన వెళ్తావు ఇంటికి... చీకటి చుక్కలు దారి చూపవమ్మ.. నా మనసును అడుగు దారిని... నీ వంకంత సాకులు నా చెంతన... వాటితో గూటినే కట్టేయన... పావురమై వొచ్చి వాలిపో... నీ గలగలలు సలసలలు నాకిచ్చిపో... నల్లని మబ్బులు కమ్మితేనే ... ఆ జాబిలమ్మకు సమయమందేది.. నీ రాగాలు వింటేనే... నా మనసు తెరచుకునేది .. ఎపటికి తెలుసుకుంటావో.. నన్నెపుడు చేరుతవో.. నా చెంతకు రాకపోతే పోయావు కాని.. నా పాటనే పడవలా మోసుకెళ్ళు .. ఈ రేయంతా తోడుగా వుంటుంది.. నీతో కబుర్లు చెబుతుంది... |
కొంత నేర్చినా మరికాస్త ఎక్కువ నేర్చినా.. తెలియని ప్రశ్నకు నేను అమాయకుడినే.. ప్రేమ వున్నా ప్రేమంటే తెలిసినా... నన్ను ప్రేమించే మనుస్సుకు నేను అమాయకుడినే... మాట నేర్చినా ఎంత మాట్లాడినా... నా మాట కోసం ఎదురు చూసే స్నేహానికి నేను అమాయకుడినే... |
బలము లేదని బలహీనులమని.... భారము వుందని భయముకొని... మన కర్తవ్యాన్నే మరచిన ... ప్రాణము వదిలినట్టే... శ్వాసవున్న ఆ మనసు లేనట్టే.. | |
కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️